Telangana

News May 18, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఎమ్మెల్సీ ఎన్నికలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} కొత్తగూడెం పట్టణంలో జడ్పీ సర్వసభ్య సమావేశం
∆} వివిధ శాఖలపై ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} జూలూరుపాడు మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News May 18, 2024

HYD: ఆర్టీసీకి ఒకేరోజు రూ.26 కోట్ల ఆదాయం

image

పోలింగ్ మరుసటి రోజు ఆర్టీసీకి రూ.26 కోట్ల ఆదాయం చేకూరిందని ఆ సంస్థ గ్రేటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం జేబీయస్‌‌లోని పుష్పక్ బస్ షెల్టర్ సందర్శియిర్ పోర్ట్‌కు వెళ్తున్న ప్రయాణికులతో మాట్లాడారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు పుష్పక్ AC బస్సులను 24 గంటల పాటు నడుపుతున్నామని, గ్రేటర్ పరిధిలో మరో 125 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

REWIND-2019: చేవెళ్లలో కాంగ్రెస్ ఓటమి!

image

చేవెళ్లలో విజయం ఎవరిదనేది హాట్‌ టాపిక్‌గా మారింది. 2019‌లోనూ రసవత్తర పోరు సాగింది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి(INC)పై రంజిత్ రెడ్డి (BRS) 14,317 ఓట్ల మెజార్టీతో‌ గెలిచారు. జనార్థన్ రెడ్డి(BJP) 3వ స్థానంలో నిలిచారు. ఎన్నికల‌కు ముందు విశ్వేశ్వర్ రెడ్డి(BJP), రంజిత్ రెడ్డి (INC), జ్ఞానేశ్వర్(BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు‌ తమదే మెజార్టీ‌ అంటున్నారు. మీ కామెంట్?

కొత్తగూడెం: పోక్సో కేసులో ముద్దాయికి 20 ఏళ్ల జైలు

image

పోక్సో కేసులో ముద్దాయికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ 5 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు ఇన్‌ఛార్జ్ న్యాయమూర్తి పాటిల్ వసంత్ శుక్రవారం తీర్పునిచ్చారు. అశ్వాపురం మండలానికి చెందిన ఓ మహిళ తన మనవరాలితో కలిసి నివసిస్తుంది. 2021 డిసెంబర్ 30న మహిళ ఇంట్లో లేని సమయంలో ఇంటి పక్కనే ఉన్న సాంబశివరావు అనే వ్యక్తి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కేసు విచారించి శిక్ష విధించారు.

News May 18, 2024

Elections: పెద్దపల్లి ఎవరికో?

image

పెద్దపల్లిలో ప్రతి ఎన్నికల్లో ప్రజలు ఒక్కో పార్టీని ఆదరిస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో BRS అభ్యర్థి MPగా గెలుపొందగా.. 2023లో లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో BRS శ్రేణులు కాంగ్రెస్‌‌లో భారీగా చేరాయి. సిట్టింగ్‌ MP వెంకటేశ్‌ నేత BJPలో చేరారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు చర్చ జరుగుతోంది. మీ కామెంట్?

News May 18, 2024

ASF: పీఎం రాష్ట్రీయ బాలపురస్కార్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

image

మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం తరఫున అందిస్తున్న ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ జాతీయ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆసిఫాబాద్ జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. 2024-25 సంవత్సరానికి ఇచ్చే పురస్కారాలకు 6-18 ఏళ్లలోపు బాలబాలికలు అర్హులన్నారు. పలు రంగాల్లో ప్రతిభ చూపిన బాలలు జులై 31లోపు http //awards.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News May 18, 2024

గజ్వేల్: ‘తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం’

image

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సిద్దిపేట జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి తనూజ తెలిపారు. గజ్వేల్‌ మండల పరిధిలోని జాలిగామ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని, ప్రతి గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు.

News May 18, 2024

వరంగల్‌లో భారీ వర్షం.. నేలకూలిన రావి చెట్టు

image

వరంగల్ జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. సగటున 49 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా WGLలో 85.4 మి.మీ, వర్ధన్నపేటలో 84.2 మి.మీ, రాయపర్తిలో 73.6, అత్యల్పంగా నర్సంపేటలో 17.4 మి.మీ వర్షపాతం నమోదైంది. భద్రకాళి ఆలయం రోడ్డులో 50-60 ఏళ్ల క్రితం నాటి రావి చెట్టు నేలకూలింది. చేతికొచ్చిన పంట నేలకొరిగింది. ధాన్యం గింజలు రాలిపోయాయి. దీంతో రైతన్నలు తీవ్ర నిరాశ చెందారు.