Telangana

News May 18, 2024

HYD: ఎక్కడ రైలెక్కినా AIRPORT వెళ్లేలా రూట్..!

image

HYDలోని మొదటి 3 దశల మెట్రో కారిడార్లు మియాపూర్ నుంచి ఎల్బీనగర్, రాయదుర్గం నుంచి నాగోల్, JBS నుంచి MGBSతో నూతన ఎయిర్‌పోర్ట్ మెట్రో లైన్‌ను అనుసంధానం చేయాలని అధికారులు నిర్ణయించారు. దీని వల్ల ప్రయాణికులు మొదటి దశలోని ఏ మెట్రో స్టేషన్‌లో రైలెక్కినా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవచ్చు. ప్రయాణికులకు అనుగుణంగా అధికారులు రెండో దశలోని మెట్రో రూట్ మ్యాప్ ఖరారు చేశారు.

News May 18, 2024

MBNR: ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఎక్కడంటే

image

వచ్చే నెల 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించింది. ➢కొడంగల్- పాలమూరు విశ్వవిద్యాలయం లైబ్రరీ హాల్
➢నారాయణపేట- ఇండోర్ గ్రేమ్స్ కాంప్లెక్స్
➢మహబూబ్ నగర్- ఎగ్జామినేషన్ బ్రాంచ్ గ్రౌండ్ ఫ్లోర్
➢జడ్చర్ల- ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఫస్ట్ ఫ్లోర్
➢దేవరకద్ర- ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఫస్ట్ ఫ్లోర్
➢మక్తల్- ఇండోర్ స్టేడియం
➢షాద్‌నగర్- ఫస్ట్ ఫ్లోర్ ఫార్మాస్యూటికల్ బ్లాక్

News May 18, 2024

MBNR: పల్లెల్లో మొదలైన పంచాయతీ ఎన్నికల చర్చ

image

ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు ముగియటంతో జిల్లాలోని పల్లెల్లో గ్రామపంచాయతీ ఎన్నికల చర్చ మొదలైంది. ఫిబ్రవరి 1వ తేదీన సర్పంచుల పదవీకాలం ముగియటం, ఫిబ్రవరి 2నుంచి స్పెషలాఫీసర్ల పాలన ప్రారంభంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. సీఎం జూన్లో ఎన్నికలు ఉంటాయని ప్రకటించడంతో మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. వనపర్తి జిల్లాలో 255 పంచాయతీలు ఉండగా, సర్పంచ్ అభ్యర్థి ఎవరన్నదానిపై పల్లెల్లో చర్చ సాగుతోంది.

News May 18, 2024

NZB: మంత్రి తుమ్మల ను కలిసిన డీసీసీబీ ఛైర్మన్

image

రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ కుంట రమేశ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన్ను శాలువాతో సత్కరించారు. రుణమాఫీ ప్రక్రియను త్వరగా చేపట్టాలని కోరారు. రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని మరోసారి నిరూపించుకుకోవాలని ఆయన్ను కోరారు.

News May 18, 2024

HYD: ఎక్కడ రైలెక్కినా AIRPORT వెళ్లేలా రూట్..!

image

HYDలోని మొదటి 3 దశల మెట్రో కారిడార్లు మియాపూర్ నుంచి ఎల్బీనగర్, రాయదుర్గం నుంచి నాగోల్, JBS నుంచి MGBSతో నూతన ఎయిర్‌పోర్ట్ మెట్రో లైన్‌ను అనుసంధానం చేయాలని అధికారులు నిర్ణయించారు. దీని వల్ల ప్రయాణికులు మొదటి దశలోని ఏ మెట్రో స్టేషన్‌లో రైలెక్కినా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవచ్చు. ప్రయాణికులకు అనుగుణంగా అధికారులు రెండో దశలోని మెట్రో రూట్ మ్యాప్ ఖరారు చేశారు.

News May 18, 2024

కామేపల్లిలో భీకరంగా ప్రవహిస్తున్న బుగ్గ వాగు

image

కామేపల్లి మండల పరిధిలోని పింజరమడుగు పొన్నెకల్లు రెవెన్యూ గ్రామాలకు ఆనుకుని ఉన్న బుగ్గవాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. గురువారం రాత్రి ఇల్లందు కారేపల్లి కామేపల్లి మండలాలలో భారీగా కురిసిన వర్షాలకు బుగ్గవాగు ఉగ్రరూపం దాల్చి భీకరంగా ప్రవహిస్తుంది. బుగ్గవాగు ఉధృతితో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పశువులకు మేకలకు తాగునీరు దొరుకుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షంతో వాతావరణం చల్లబడింది.

News May 18, 2024

గజ్వేల్: వడ్లతో కన్యకా పరమేశ్వరి చిత్రాన్ని రూపొందించిన రామకోటి

image

కన్యకా పరమేశ్వరి మాత జయంతిని పురస్కరించుకొని గజ్వేల్ పట్టణంలోని అద్దాల మందిరం వద్ద అమ్మ వారి చిత్రాన్ని వడ్లను ఉపయోగించి అపురూపంగా రూపొందించి శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు.

News May 18, 2024

గుర్రంపోడు: ‘డీఎస్పీ అభ్యర్థి దుర్గాప్రసాద్‌ని పట్టభద్రులు గెలిపించాలి’

image

వరంగల్, ఖమ్మం, NLG పట్టభద్రుల MLC ఉప ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి బరిగెల దుర్గాప్రసాద్ మహారాజ్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మామిడి సైదయ్య (జగన్) పట్టభద్రుల ఓటర్లను కోరారు. శుక్రవారం మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని రక్షించే వాళ్ళు ఒకవైపు, రాజ్యాంగాన్ని తీసివేయాలనే వాళ్ళు ఒకవైపు ఉన్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని కోరారు.

News May 17, 2024

హైదరాబాద్‌ మెట్రో రైలు వేళల్లో అధికారులు మార్పు..

image

హైదరాబాద్‌ మెట్రో రైలు వేళల్లో అధికారులు మార్పు చేశారు. ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు ఉండగా.. ఇక నుంచి 11.45 గంటలకు చివరి రైలు అందుబాటులో ఉండనుంది. అలాగే ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకే మెట్రో రాకపోకలు మొదలు కానున్నాయి. మిగతా రోజుల్లో సాధారణంగానే ఉదయం 6 గంటల నుంచే మెట్రో పరుగులు పెట్టనుంది. ఇటీవల రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో వేళల్లో మార్పులు చేసినట్టు సమాచారం.