Telangana

News May 17, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

*కోరుట్లలో లైసెన్స్ లేకుండా మందులు విక్రయించిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష.
*ప్రభుత్వ పాఠశాలలలో మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలన్న జగిత్యాల కలెక్టర్.
*కోరుట్లలో ఆర్థిక ఇబ్బందులతో స్వర్ణకారుడు ఆత్మహత్య.
*వేములవాడ అర్బన్ మండలంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతుల ఆందోళన.
*పెద్దపల్లి మండలంలో పర్యటించిన డిపిఓ.
*కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల కురిసిన వర్షం.

News May 17, 2024

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ఎంపీ అభ్యర్థి నగేశ్

image

కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఎంపీ అభ్యర్థి నగేశ్ శుక్రవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పార్లమెంటు పోలింగ్ సరళి, తదితర అంశాలను ఆయనతో చర్చించారు. అదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని మనం గెలవబోతున్నామని, అందుకు గాను ముందస్తు అభినందనలు తెలిపారు. ఆయనతో పాటు పార్లమెంట్ కో ఇన్‌ఛార్జ్ అశోక్ ముస్తాపురే, జిల్లా బీజేపీ నాయకులు, తదితరులున్నారు.

News May 17, 2024

వరంగల్: 2 రోజులు మార్కెట్ బంద్

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు రేపు, ఎల్లుండి సెలవులు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. రేపు వారాంతపు యార్డు బంద్, ఎల్లుండి (ఆదివారం) సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. రైతులు విషయాన్నీ గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కు సరుకులు తీసుకుని రావద్దని సూచించారు.

News May 17, 2024

NLG : మల్లన్నను తప్పించాలని కాంగ్రెస్ బహిష్కృత నేత ధర్నా

image

శ్మశానానికి పంపుతారా-శాసన మండలికి పంపుతారా అని 4.61 లక్షల గ్రాడ్యుయేట్ ఓటర్లను బ్లాక్ మెయిల్ చేసిన తీన్మార్ మల్లన్నను ఎన్నికల బరి నుంచి తొలగించాలని ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జడ్సన్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై శుక్రవారం ఆయన ఖమ్మం కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేశారు.

News May 17, 2024

లక్ష్మీనరసింహస్వామి ఆదాయం ఎంతంటే..?

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.1,59,135 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాల టికెట్లు అమ్మకం ద్వారా రూ.79,758 ప్రసాదం అమ్మకం ద్వారా రూ.65,245 అన్నదానం రూ.14,132 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.

News May 17, 2024

కుక్కునూరు: డోలిలో గర్భిణీ మహిళ తరలింపు

image

పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను గ్రామస్థులు ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ డోలిలో అంబులెన్స్ వద్దకు తరలించి ఆసుపత్రికి తీసుకెళ్ళిన ఘటన కుక్కునూరు మండలంలోని లచ్చి పేట గ్రామంలో జరిగింది. లచ్చిపేట గ్రామానికి చెందిన కోసి అనే మహిళకు శుక్రవారం పురిటి నొప్పులు ఎక్కువ అవ్వడంతో 108 అంబులెన్స్‌కు ఆ గ్రామం చేరుకునే దారి లేకపోవడంతో గ్రామస్థులు డోలీలో మహిళను అంబులెన్స్ వరకు తరలించి ఆసుపత్రికి తీసుకెళ్లారు.

News May 17, 2024

బడులు ప్రారంభం అయ్యే నాటికి పనులన్నీ పూర్తి కావాలి: CS

image

బడులు పునః ప్రారంభం అయ్యే నాటికి పనులన్ని పూర్తి కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లకు సూచించారు. శుక్రవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ల‌తో మాట్లాడారు. కొత్త విద్యా సంవత్సరంలో బడులు తెరుచుకునేందుకు మరో 20 రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉన్నందున యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి గడువులోపు పూర్తయ్యేలా పనులు పూర్తిచేయాలన్నారు.

News May 17, 2024

డిగ్రీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: టీయూ రిజిస్ట్రార్

image

డిగ్రీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని టీయూ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి డిగ్రీ రెగ్యులర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్‌లతో అకడమిక్ అడిట్ సెల్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 21 నుంచి జూన్15 వరకు ఉమ్మడి నిజామాబాద్ వ్యాప్తంగా మొత్తం 38 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.

News May 17, 2024

HYD: అంతర్జాతీయ స్థాయిలో కోహెడ పండ్ల మార్కెట్..!

image

HYD శివారు హయత్‌నగర్ పరిధి కోహెడ పండ్ల మార్కెట్ తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా మార్చనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులకు అడ్డాగా మారుస్తామని అధికారులతో అన్నారు. మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం అంతర్జాతీయ స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. అంతేకాక ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు.

News May 17, 2024

మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

image

టెస్కో ద్వారా శానిటరీ నాప్‌కిన్ తయారీ యూనిట్ల ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్రమంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. బుగ్గపాడులో త్వరలోనే పరిశ్రమల స్థాపన, వర్షాల వలన రైతులు పంట నష్టపోకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆదేశించారు. మార్కెటింగ్, గిడ్డంగుల సంస్థ గోదాములపై సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేస్తామని, ఖమ్మం మార్కెట్‌ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.