Telangana

News May 17, 2024

మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

image

టెస్కో ద్వారా శానిటరీ నాప్‌కిన్ తయారీ యూనిట్ల ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్రమంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. బుగ్గపాడులో త్వరలోనే పరిశ్రమల స్థాపన, వర్షాల వలన రైతులు పంట నష్టపోకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆదేశించారు. మార్కెటింగ్, గిడ్డంగుల సంస్థ గోదాములపై సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేస్తామని, ఖమ్మం మార్కెట్‌ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

News May 17, 2024

HYD: అంతర్జాతీయ స్థాయిలో కోహెడ పండ్ల మార్కెట్..!

image

HYD శివారు హయత్‌నగర్ పరిధి కోహెడ పండ్ల మార్కెట్ తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా మార్చనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులకు అడ్డాగా మారుస్తామని అధికారులతో అన్నారు. మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం అంతర్జాతీయ స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. అంతేకాక ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు.

News May 17, 2024

MDK: నా కారు నంబర్‌తో మరో కారు తిరుగుతోంది: MLA

image

తన కారు నంబర్ (TS10FB9999)తో HYDలో మరో కారు తిరుగుతోందని మెదక్ MLA మైనంపల్లి రోహిత్ అన్నారు. ఈ మేరకు ఈరోజు కొంపల్లిలోని పేట్ బషీరాబాద్ PSలో ఎమ్మెల్యే సిబ్బంది వచ్చి ఫిర్యాదు చేశారు. ఓవర్ స్పీడ్ పేరిట తనకు చలాన్ వచ్చిందని, ఆ కారు తనది కాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తన కారు నంబర్ ఎవరు వాడుతున్నారో దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

News May 17, 2024

BREAKING: కామారెడ్డి: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

image

సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం రాంసానిపల్లి వద్ద 161వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాందేడ్-అకోలా 161వ జాతీయ రహదారిపై బైక్‌పై ముగ్గురు వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన శ్రీనివాస్(35), సునీత(30), కుమారుడు నగేశ్(7) మృతిచెందారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద తడ్కుర్ గ్రామానికి చెందిన వ్యక్తులుగా స్థానికులు గుర్తించారు.

News May 17, 2024

BREAKING: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 

image

సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం రాంసానిపల్లి వద్ద 161వ జాతీయ రహదారిపై ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాందేడ్-అకోలా 161వ జాతీయ రహదారిపై బైక్‌పై ముగ్గురు వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో దంపతులు శ్రీనివాస్ (35), సునీత(30), కుమారుడు నగేశ్(7) మృతిచెందారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద తాడ్కూర్ గ్రామానికి చెందిన వ్యక్తులుగా స్థానికులు గుర్తించారు.  

News May 17, 2024

MDK: నా కారు నంబర్‌తో మరో కారు తిరుగుతోంది: MLA

image

తన కారు నంబర్ (TS10FB9999)తో HYDలో మరో కారు తిరుగుతోందని మెదక్ MLA మైనంపల్లి రోహిత్ అన్నారు. ఈ మేరకు ఈరోజు కొంపల్లిలోని పేట్ బషీరాబాద్ PSలో ఎమ్మెల్యే సిబ్బంది వచ్చి ఫిర్యాదు చేశారు. ఓవర్ స్పీడ్ పేరిట తనకు చలాన్ వచ్చిందని, ఆ కారు తనది కాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తన కారు నంబర్ ఎవరు వాడుతున్నారో దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

News May 17, 2024

ప్రశ్నించే వ్యక్తి కావాలా? ప్రశ్నించలేని వ్యక్తి కావాలా?: రాకేశ్ రెడ్డి

image

పట్టభద్రుల ఎన్నికల అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న ఏ విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నినిస్తారని, ఇప్పటివరకు నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకు ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్‌పై మల్లన్న ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ప్రభుత్వాన్ని, ప్రశ్నించే వ్యక్తి కావాల ప్రశ్నించలేని వ్యక్తి కావాలా ఆలోచించాలన్నారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలన్నారు.

News May 17, 2024

ఇంటర్‌ ఫస్టియర్‌ సప్లిమెంటరీ పరీక్షల టైమ్‌ టేబుల్‌

image

మే 24న సెకండ్‌ లాంగ్వేజ్‌, 25న ఇంగ్లిష్‌ పేపర్‌, 28న మ్యాథ్స్‌-1ఏ, బోటనీ, పొలిటికల్‌ సైన్స్‌-1 పరీక్షలు, 29న మ్యాథ్స్‌-1బీ, జువాలజీ-1, హిస్టరీ-1 పరీక్షలు, 30న ఫిజిక్స్‌-1, ఎకనామిక్స్‌-1 పరీక్షలు, 31న కెమిస్ట్రీ-1, కామర్స్‌-1 పరీక్షలు, జూన్‌ 1న పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌-1, బ్రిడ్జికోర్స్‌ మ్యాథ్స్‌-1 పరీక్షలు, జూన్‌ 3న మోడరన్‌ లాంగ్వేజీ-1, జాగ్రఫీ -1 పరీక్షలు జరగనున్నాయి.

News May 17, 2024

ఎర్రవరంలో ఉత్సవాలు

image

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరంలో ఈ నెల 21 నుంచి 23 వరకు శ్రీ దూళ్లగుట్ట బాల ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి దంపతులు హాజరకానున్నారని దేవాలయ కమిటీ తెలిపింది. భక్తులు పెద్దఎత్తున తరలిరావాలని స్వామి వారి ఆశీస్సులు పొందాలన్నారు.

News May 17, 2024

HYD: 39 కొత్త STPలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్..!

image

మూసీ ప్రక్షాళనకు ముందడుగు పడింది. HYDలో రూ.4 వేల కోట్లతో 39 కొత్త STPలకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మురుగు నీటి శుద్ధికి ఇప్పటికే 31 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(STP)లు నిర్మాణంలో ఉండగా.. మరో 39 ఎస్టీపీలకు సాంకేతిక కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (DPR)లకు ఆమోదముద్ర వేసింది. వీటితో మూసీలోని ప్రతి నీటి చుక్కను శుద్ధి చేయనున్నారు.