Telangana

News September 14, 2024

సిరిసిల్ల: విష జ్వరంతో బాలిక మృతి

image

సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఓ బాలిక విష జ్వరంతో మృతి చెందింది. కుటుంబీకుల ప్రకారం.. మైదం శెట్టి మల్లికార్జున్ పెద్ద కూతురు నక్షత్ర హాసిని(13)కి బుధవారం జ్వరం వచ్చింది. స్థానిక ఓ ఆర్‌ఎంపీ దగ్గర వైద్యం చేయించగా నయం కాలేదు. ఆ తర్వాత సిరిసిల్ల, KNR నుంచి HYDలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా శనివారం మృతి చెందింది.

News September 14, 2024

బాల్కొండ: మిస్ అయిన బాలుడి హత్య..!

image

నాలుగు రోజుల క్రితం మిస్ అయిన బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామానికి కచ్చు రాకేష్ (12) మృతదేహం శనివారం బాల్కొండలోని పురాతన ఖిల్లా వద్ద హత్యకు గురైన స్థితిలో లభ్యమైంది. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ నరేశ్ పరిశీలించారు. చిట్టాపూర్ గ్రామానికి చెందిన కచ్చు బాను, లక్మయ్యల కుమారుడైన రాకేశ్ 4 రోజుల క్రితం అదృశ్యమవగా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

News September 14, 2024

లక్ష్మారెడ్డిని పరామర్శించిన కేటీఆర్

image

మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం తిమ్మాజీపేట మండలం ఆవంచలోని లక్ష్మారెడ్డి ఇంటికి చేరుకొని శ్వేతా రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా BRS మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

News September 14, 2024

కామారెడ్డి: జిల్లా అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులు

image

కామారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ మీట్ 2024లో నిర్వహించిన పోటీలలో లింగంపేట మైనారిటీ గురుకుల కళాశాల ఎంపీసీ రెండో సంవత్సరం విద్యార్థులు కె. నితిన్, ఎస్‌డీ జునైద్ గోల్డ్ మెడల్ సాధించారని కళాశాల ప్రిన్సిపల్ ఏ. మధుసూదన్ రావు తెలిపారు. గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులను సన్మానించారు.

News September 14, 2024

HYD: 10 నిమిషాలతో సగం రోగాలు దూరం: GHMC

image

గ్రేటర్ HYD ప్రజలకు జీహెచ్ఎంసీ కీలక సూచన చేసింది. రోజూ 10-15 నిమిషాల పాటు వేడి చేసి, చల్లార్చి గురువెచ్చని నీటిని తాగితే సగం రోగాలు దూరమవుతాయని తెలిపింది. నీటి కలుషితంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని, బ్రష్ చేసేటప్పుడు, వంట వండేటప్పుడు, కూరగాయలు, పండ్లు కడిగేటప్పుడు వేడిచేసిన నీటితో కడగటం శ్రేయస్కరమని పేర్కొన్నారు. RR, MDCL, VKB ప్రజలు సైతం పాటించాలని డాక్టర్లు సూచించారు.

News September 14, 2024

మదర్ డైరీ ఛైర్మన్‌గా మధుసూదన్ రెడ్డి

image

రంగారెడ్డి నల్లగొండ మదర్ డైరీ ఛైర్మన్‌గా గుడిపాటి మధుసూదన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు నియామక పత్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందజేశారు .ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ,భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

News September 14, 2024

నేటి నుంచి రాష్ట్రస్థాయి పోటీలు.. ఖోఖో బాలుర జట్టు ఇదే !

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సబ్ జూనియర్స్ ఖోఖో జిల్లాస్థాయిలో ఎంపికలు నిర్వహించగా.. ఈ నెల 14, 15న HYDలో జరగనున్న రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొంటారని పిడి రూప తెలిపారు. బాలురు:-శివ, తిమ్మప్ప, భీమేష్(నవాబ్ పేట్), రాఘవేందర్, శివరాజ్(TSWRS), అరవింద్,నితిన్ (కర్ని), ఉమర్, అభినవ్(GPనగర్), అజయ్(మద్దూర్), నరహరి, కార్తీక్ (తూడుకుర్తి), ముసాయిద్ అహ్మద్(కోయిలకొండ), సుశాంత్ (మరికల్), సాయిరాం(పెద్దపల్లి).

News September 14, 2024

గవర్నర్ వద్దకు వెళ్లిన సికింద్రాబాద్ ADRM

image

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వద్దకు సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే కమర్షియల్ మేనేజర్, అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాల్ వెళ్లారు. గవర్నర్ పిలుపు మేరకు వెళ్లిన అధికారి, రైల్వే అభివృద్ధి, ఇతర అంశాల గురించి విస్తృతంగా చర్చలు జరిపినట్లు తెలిపారు. రైల్వే సేఫ్టీపై తగు చర్యలు తీసుకోవాలని గవర్నర్ వారికి సూచించారు.

News September 14, 2024

నిమ్స్‌లో ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు

image

నిమ్స్‌లో ఈ నెల 22 నుంచి 28 వరకు యూకే వైద్యుల బృందం ఉచిత గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్లు నిమ్స్ సంచాలకుడు బీరప్ప శనివారం తెలిపారు. గుండెకు రంధ్రం ఇతర సమస్యలతో బాధపడుతున్న వాళ్లకు వైద్య సేవలు అందించనున్నారు. వివరాలకు నిమ్స్‌లోని కార్డియో వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News September 14, 2024

నిమ్స్‌లో ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు

image

నిమ్స్‌లో ఈ నెల 22 నుంచి 28 వరకు యూకే వైద్యుల బృందం ఉచిత గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్లు నిమ్స్ సంచాలకుడు బీరప్ప శనివారం తెలిపారు. గుండెకు రంధ్రం ఇతర సమస్యలతో బాధపడుతున్న వాళ్లకు వైద్య సేవలు అందించనున్నారు. వివరాలకు నిమ్స్‌లోని కార్డియో వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.