Telangana

News May 17, 2024

నల్గొండ: పట్టభద్రులూ.. సరిగా ఓటేయండి

image

2021లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో 5,05,565 మందికి 3,87,969 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 21,636 మంది ఓట్లు చెల్లకపోవటం గమనార్హం. సాధారణ ఓటుహక్కు మాదిరిగా కాకుండా పట్టభద్రులు తమ ఓటుహక్కును ప్రాధాన్య క్రమంలో వినియోగించుకోవాలి. అంటే పోటీలో నిలిచిన అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటేయాలి. ఈ విధానంపై కొందరికి అవగాహన లేకపోవటంతో వారి ఓట్లు చెల్లకుండా పోతున్నాయి.

News May 17, 2024

నిజామాబాద్: లైంగిక వేధింపులు.. ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

image

లైంగిక వేధింపుల ఆరోపణలపై కామారెడ్డి DMHOను పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్యాధికారిణులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు దేవునిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఏడు కేసులు నమోదు చేసిన పోలీసులు.. విచారణ అనంతరం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. లక్ష్మణ్‌ సింగ్‌ తమను ఏడాదిన్నర కాలంగా లైంగికంగా వేధిస్తున్నట్లుగా ఇటీవల వైద్యాధికారిణులు ఆరోపించారు.

News May 17, 2024

అమెరికాలో జహీరాబాద్ యువకుడి దుర్మరణం

image

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జహీరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అబ్బరాజు పృథ్వీరాజ్(30) మృతిచెందాడు. USలోని నార్త్ కరోలినాలో 8ఏళ్లుగా పనిచేస్తున్నాడు. భార్య శ్రీప్రియతో కలిసి కారులో వెళ్తూ వర్షం కారణంగా ముందు వెళ్తున్న మరో కారును ఢీకొట్టారు. ఈ ప్రమాదం నుంచి బయటపడగా వేగంగా వచ్చిన మరో కారు వెనక నుంచి వీరి కారుని ఢీ కొట్టింది. దీంతో పృథ్వీ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు.

News May 17, 2024

MBNR: 4,63,983 మంది ఓటేయలే

image

ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటును వినియోగించుకోవడంలో పాలమూరు ప్రజలు నిర్లక్ష్యం ప్రదర్శించారు. తాజా ఎంపీ ఎన్నికల్లో 4,63,983 మంది ఓటుకు దూరంగా ఉండటమే ఇందుకు నిదర్శనం. MBNR పార్లమెంట్ సెగ్మెంట్లో మొత్తం 16,82,470 ఓట్లు ఉంటే 12,18,487 మంది తమ ఓటు వేశారు. 2019 MP ఎన్నికల్లో మొత్తం 13,68,868 మందికి 92,65,16 ఓట్లు పోలయ్యాయి. ఈ మధ్య 3,13,602 ఓట్లు పెరిగినప్పటికీ పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడం ఆందోళనకరం.

News May 17, 2024

ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం.. లేచిపోయిన ఇంటి పై కప్పు

image

ఆదిలాబాద్‌ జిల్లాలో గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షం కురిసింది. గుడిహత్నూర్‌ మండలంలో వడగళ్ల వర్షం పడింది. ఇంటి పైకప్పులు లేచిపోయాయి. ఈదురుగాలులతో విద్యుత్‌ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. రెవెన్యూ, విద్యుత్‌శాఖ అధికారులు పరిశీలించి, విద్యుత్‌ సరఫరాను మెరుగుపర్చారు. ఇంద్రవెల్లి మండలంలో భారీ వృక్షాలు నెలకొరిగాయి. రోడ్డుపై చెట్టు విరిగి పడిపోవడంతో గంట సేపు రాకపోకలు స్తంభించాయి.

News May 17, 2024

ములుగు, భూపాలపల్లి జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్‌’

image

నేటి నుంచి జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని భూపాలపల్లి, ములుగు జిల్లాలకు వాతవరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఇటీవల కురిసిన వర్షాలకే రైతులు ఆందోళన చెందుతుండగా.. 3 రోజుల విరామం ఇచ్చిన వాన మళ్లీ గురువారం జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఆయా జిల్లాల అధికారులు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రెండు జిల్లాల్లో ఇంకా వరికోతలు పూర్తికాలేదు.

News May 17, 2024

నేటి నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

image

మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు శుక్రవారం నుంచి సెమిస్టర్ 2,4,6 రెగ్యూలర్, బ్యాక్లాగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు యూనివర్సిటీ పరిధిలో 45 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం జరిగే సెమిస్టర్ పరీక్షలకు 36,392 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో 2వ సెమిస్టర్లో 12,525, 4వ సెమిస్టర్లో 12,313, 6వ సెమిస్టర్ లో 11,554 మంది పరీక్ష

News May 17, 2024

KNR: నగరవాసుల కంటే గ్రామీణ ఓటర్లే గ్రేట్

image

లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంలో నగరవాసుల కంటే గ్రామీణ ఓటర్లు ఆదర్శంగా నిలిచారు. పెద్దపల్లి పరిధిలోని 7 నియోజకవర్గాల్లో రామగుండం, మంచిర్యాలలో పోలింగ్‌ శాతం తక్కువగా నమోదైంది. మొత్తం 15,86,430 మంది ఓటర్లు ఉండగా వీరిలో 10,83,453 మంది ఓటు వేశారు. గ్రామీణ ప్రాంతాలైన సోనాపూర్‌లో 92.02, ఇసన్వాయిలో 83.91, తలమాల 86.42, కప్పరావుపేట పోలింగ్ కేంద్రంలో 84.19 శాతం అధిక పోలింగ్ నమోదైంది.

News May 17, 2024

సంగారెడ్డి: కస్తూర్బా పాఠశాలల్లో ప్రారంభమైన అడ్మిషన్లు

image

సంగారెడ్డి జిల్లాలోని కస్తూర్బా పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. 22 పాఠశాలల్లో ఆరవ తరగతికి, 10 ఇంటర్మీడియట్ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి అర్హులైన బాలికలు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈ పాఠశాలలో చదివేవారికి బోధనతోపాటు వసతి సౌకర్యం కూడా కల్పిస్తామని వివరించారు.

News May 17, 2024

ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలి: జిల్లా ఎస్పీ

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలని జిల్లా ఎస్పీ చందనా దీప్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు నిర్వహించే ర్యాలీలు, సభలు, సమావేశాలకు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని కోరారు. అభ్యర్థులు వారి ప్రచారంలో కులం, మతం, ఎదుటి వ్యక్తులను దూషించడం, ప్రార్థనా స్థలాల్లో ప్రచారం వంటివి చేయకూడదని తెలిపారు.