Telangana

News May 17, 2024

NZB: ఫైనల్‌కి చేరిన నిఖత్ జరీన్

image

నిజామాబాద్‌కు చెందిన స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ సత్తా చాటింది. ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నిలో నిఖత్ (52 కేజీలు) అద్భుత విజయంతో ఫైనల్‌కు చేరుకుంది. కజకిస్థాన్‌కి చెందిన టొమిరిస్ మిర్జాకుల్ పై 5-0 తో విజయం సాధించింది. బౌట్ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై పదునైన పంచ్లతో విరుచుకుపడ్డ నిఖత్ అలవోకగా విజయం సాధించింది.

News May 17, 2024

REWIND-2019: మల్కాజిగిరిలో BRS ఓటమి!

image

మల్కాజిగిరిలో విజయం ఎవరిదనేది హాట్‌ టాపిక్‌గా మారింది. 2019‌లోనూ రసవత్తర పోరు సాగింది. రాజశేఖర్ రెడ్డి(BRS)పై రేవంత్ రెడ్డి (INC) 10,919 ఓట్ల మెజార్టీతో‌ గెలుపొందారు. రాంచందర్ రావు(BJP) 3వ స్థానంలో నిలిచారు. కానీ, ప్రస్తుత రాజకీయాలు మారాయి. ఎన్నికల‌కు ముందు ఈటల (BJP), సునీత (INC), రాగిడి (BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు‌ తమదే మెజార్టీ‌ అంటున్నారు. మీ కామెంట్?

HYD: అవగాహన లేకుండా హామీలు ఇచ్చారు: కొండా

image

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సామాజిక ఆర్థిక పరిస్థితులపై అవగాహన లేకుండా హామీలు ఇవ్వడం బాధాకరమని బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడం అసాధ్యమన్నారు. వారు అమలు చేయాలని చూసినా రాష్ట్ర ఖజానాలో నిధులు లేవన్నారు.

పాలమూరులో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం

image

సీఎం రేవంత్ సొంత ఇలాకా మహబూబ్‌నగర్ జిల్లా కావడంతో ఇక్కడ కాంగ్రెస్ గెలుపును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 2పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా 11 పర్యాయాలు స్వయంగా పర్యటించారు. ఇందులో ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న MBNR పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా పలుసార్లు వచ్చారు. జిల్లాను అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

News May 17, 2024

మెదక్: ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం: అదనపు కలెక్టర్

image

ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని మెదక్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు రైతులకు అభయమిచ్చారు. ఈ నెలాఖరు వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామన్నారు. రవాణా కోసం అదనపు వాహనాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చిలిపిచెడ్ మండలంలోని చిట్కుల్, చండూర్, కొల్చారం మండలంలోని చిన్న ఘనపూర్ గ్రామాల్లో దాన్యం కొనుగోలు సెంటర్‌ను గురువారం జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు.

News May 17, 2024

భద్రాద్రి జిల్లా: ‘విప్లవ ఘాతుకాన్ని ఓడించాలి’

image

భారత విప్లవోద్యమ నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న విప్లవ ఘాతుకాన్ని ఓడించాలని మావోయిస్ట్ పార్టీ భద్రాద్రి-అల్లూరి జిల్లాల డివిజన్ కార్యదర్శి ఆజాద్ గురువారం విడుదల చేసిన లేఖలో కోరారు. మావోయిస్టుల నిర్మూలన పేరుతో బస్తర్లో ఆదివాసీలపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. మావోయిస్టుల పేరుతో అమాయకులపై జరుగుతున్న దాడులను ఖండించి సంఘీభావంగా మేధావులు ఉండాలని పిలుపునిచ్చారు.

News May 17, 2024

ADB: సీఎం కలిసిన సోషల్ మీడియా కో ఆర్డీనేటర్స్

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు సోషల్ మీడియా కోఆర్డీనేటర్‌లు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బెల్లంపల్లి, ఆసిఫాబాద్, నిర్మల్‌కి చెందిన సోషల్ మీడియా కోఆర్డీనేటర్‌లు హైదరాబాద్‌లో గురువారం సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వారు చేసిన కృషిని ఆయన అభినందించారు.

News May 17, 2024

MBNR: అప్పుడు 40.. ఇప్పుడు 22 రోజులు..!

image

ఉమ్మడి జిల్లాలో 2019 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా పోలింగ్ ముగిసిన తర్వాత 40 రోజులకు ఫలితాలు వెలువడ్డాయి. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలు ముగిసిన రోజు నుంచి ఫలితాలు వెల్లడి కోసం 22 రోజులు నిరీక్షించాలి. దేశవ్యాప్తంగా మరో 3 దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అన్ని పూర్తయ్యాక జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. నేతలు ఓటర్లు ఎక్కడ మొగ్గు చూపారో అని లెక్కలు వేసుకుంటున్నారు.