Telangana

News May 17, 2024

NLG: ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ

image

నల్గొండ SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నందు గ్రామీణ ప్రాంత పురుషులకు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ సంచాలకులు ఈ. రఘుపతి తెలిపారు. శిక్షణలో చేరేందుకు చివరి అవకాశం మే 19 అని, ఆసక్తి గలవారు సంస్థ కార్యాలయంలో లేదా, 7032415062 నంబర్ ద్వారా పేరు నమోదు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారై ఉండాలని తెలిపారు.

News May 17, 2024

కామారెడ్డి: 1వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

2024 – 25 విద్యా సంవత్సరంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం క్రింద 1వ తరగతిలో డే స్కాలర్ ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా ఎస్సీ కులాల అభివృద్ధి అధికారి రజిత తెలిపారు. చిన్నారులు 1 జూన్ 2018 నుంచి 31 మే 2019 మధ్య జన్మించి ఉండాలన్నారు. అర్హులైన బాలబాలికల తల్లిదండ్రులు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

News May 17, 2024

ములుగు: ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీలు..

image

ములుగు ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ విభాగాల్లో గల ఖాళీలను పొరుగు సేవల (out sourcing) కింద భర్తీకి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఖాళీ పోస్టుల వివరాలు.. డిసెక్షన్ హాల్ అటెండెన్స్ 4, డాటా ఎంట్రీ ఆపరేటర్ 10, ఆఫీస్ సబార్డినేట్ 8, థియేటర్ అసిస్టెంట్ 4, ల్యాబ్ అటెండెంట్ 4, రికార్డ్ అసిస్టెంట్ 2 పోస్టులను భర్తీ చేయనుంది.

News May 17, 2024

పెద్దపల్లి: స్ట్రాంగ్ రూంలను నిరంతరం పర్యవేక్షించాలి: కలెక్టర్

image

అధికారులు స్ట్రాంగ్ రూంలను నిరంతరం పర్యవేక్షించాలని పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. గురువారం సెంటినరీ కాలనీ జేఎన్టీయూ కళాశాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. స్ట్రాంగ్ రూంలోకి అనుమతి లేకుండా ఎవరు లోపలికి వెళ్లే వీలు లేదని, సీసీ కెమెరాలతో నిఘా కొనసాగుతుందన్నారు. అనంతరం స్ట్రాంగ్ రూంలకు వేసిన సీల్‌లను పరిశీలించి సంబంధిత రిజిస్టర్‌లో సంతకం చేశారు.

News May 16, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జాతీయ డెంగ్యూ దినోత్సవం. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల కురిసిన వర్షం. @ ఈదురుగాలుల వర్షానికి నేల కూలిన చెట్లు. @ వెలగటూరు మండలంలో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య. @ తిమ్మాపూర్ మండలంలో పిడుగు పడి ఆవు, లేగా దూడ మృతి. @ సిరిసిల్ల జిల్లాలో పిడుగు పడి ఇద్దరు మృతి.

News May 16, 2024

పట్టుదలతో పని చేస్తే విజయం మనదే: జగదీష్ రెడ్డి

image

ఉద్యోగులు, యువతను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసిందని,ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే కృతనిశ్చయంతో యువత, నిరుద్యోగులు ఉన్నారని MLA జగదీష్ రెడ్డి అన్నారు. NLG-వరంగల్-ఖమ్మం MLC ఎన్నికలకు సంబంధించి సూర్యాపేటలో జిల్లా ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన విధివిధానాలపై శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ‘పట్టుదలతో పని చేస్తే విజయం మనదే’ అని అన్నారు.

News May 16, 2024

NRPT: సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు

image

నారాయణపేటలో రైతులు సాగుకు సన్నద్ధం అవుతున్నారు. ప్రస్తుత వేసవి కాలంలో ఖాళీగా ఉన్న పంట భూములను సారవంతం చేసేందుకు రైతులు దృష్టి సారించారు. సేంద్రియ ఎరువుగా గొర్రెలు, మేకల ఎరువు భూమి సారవంతానికి ఉపయోగ పడటంతో ప్రస్తుతం గొర్రెల మందలు భూమిలో నిలుపుదల చేయించుకుంటూ భూమి సారవంతానికి రైతులు చర్యలు తీసుకుంటున్నారు. గొర్రెలు, మేకల మందలను రాత్రంతా పొలంలో నిలుపుదల చేయడం మంచిదని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.

News May 16, 2024

దక్షిణాఫ్రికాలో కొత్తపేట వాసి మృతి

image

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన నడిగట్టు సత్తయ్య దక్షిణాఫ్రికాలో మృతిచెందాడు. గుండెపోటుతో ఆయన చనిపోయినట్లు బంధువులు తెలిపారు. బతుకుదెరువు కోసం వేరే దేశం వెళ్లి.. ఇలా ఆకస్మిక మరణం చెందడంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.

News May 16, 2024

ఓయూలో దరఖాస్తుల ఆహ్వానం

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని విభాగాల బీఈ పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫలితాల రివాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.800 చెల్లించి ఈనెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రూ.200 అపరాధ రుసుముతో 25వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. జవాబు పత్రాల నకలు పొందాలనుకునే వారు ఒక్కో పేపర్‌కు రూ.1,000 చెల్లించి 25లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News May 16, 2024

ఓయూలో దరఖాస్తుల ఆహ్వానం

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని విభాగాల బీఈ పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫలితాల రివాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.800 చెల్లించి ఈనెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రూ.200 అపరాధ రుసుముతో 25వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. జవాబు పత్రాల నకలు పొందాలనుకునే వారు ఒక్కో పేపర్‌కు రూ.1,000 చెల్లించి 25లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.