Telangana

News May 16, 2024

ఓయూలో దరఖాస్తుల ఆహ్వానం

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని విభాగాల బీఈ పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫలితాల రివాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.800 చెల్లించి ఈనెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రూ.200 అపరాధ రుసుముతో 25వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. జవాబు పత్రాల నకలు పొందాలనుకునే వారు ఒక్కో పేపర్‌కు రూ.1,000 చెల్లించి 25లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

 NLG: ACBకి చిక్కిన విద్యుత్ అధికారి

image

నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని మల్లారెడ్డిపల్లిలో TSSPDCL ఆర్టిజన్ గ్రేడ్ 2 ఉద్యోగి నడింపల్లి వేణు రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ACBకి పట్టుబడ్డాడు. హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన సూర్యనారణ వ్యవసాయ భూమిలో ట్రాన్స్ఫార్మర్ కోసం సంప్రదించగా వేణు రూ.50 వేలు డిమాండ్ చేసినట్లు రైతు తెలిపాడు. దీంతో రైతు ACB అధికారులకు విషయం తెలుపగా వారు వేణును రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.

News May 16, 2024

HYD: రూ.5,93,29,772 డీజీసీ ద్వారా విడుదల: రోనాల్డ్ రాస్

image

హైదరాబాద్‌లో 201 కేసుల్లో రూ.50 వేలకు మించి ఆధారాలు లేని రూ.8,48,65,710 నగదుకు సంబంధించి జిల్లా గ్రీవెన్స్ కమిటీకి సిఫారసు చేసినట్లు HYD ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. దీంట్లో 192 కేసులకు సంబంధించి రూ.5,93,29,772 డీజీసీ ద్వారా విడుదల చేసినట్లు తెలిపారు.

News May 16, 2024

నర్సాపూర్: ఏసీబీ వలలో మరో వ్యవసాయ అధికారి

image

ఏసీబీ వలకు నర్సాపూర్ పట్టణ వ్యవసాయాధికారి గురువారం చిక్కాడు. రూ.30 వేల లంచం తీసుకుంటున్న నర్సాపూర్ మండలం వ్యవసాయ అధికారి అనిల్ కుమార్‌ను ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో పట్టుకుని విచారణ చేపట్టారు. నర్సాపూర్‌లో ఒక అనుమతి కోసం డబ్బులు డిమాండ్ చేయగా సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. ఇటీవలి కాలంలో మెదక్ జిల్లాలో పలువురు అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి చిక్కారు.

News May 16, 2024

HYD: రూ.5,93,29,772 డీజీసీ ద్వారా విడుదల: రోనాల్డ్ రాస్

image

హైదరాబాద్‌లో 201 కేసుల్లో రూ.50 వేలకు మించి ఆధారాలు లేని రూ.8,48,65,710 నగదుకు సంబంధించి జిల్లా గ్రీవెన్స్ కమిటీకి సిఫారసు చేసినట్లు HYD ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. దీంట్లో 192 కేసులకు సంబంధించి రూ.5,93,29,772 డీజీసీ ద్వారా విడుదల చేసినట్లు తెలిపారు.

News May 16, 2024

HYD: దేశంలో తిరుగుబాటు తప్పదు: ఆర్.కృష్ణయ్య

image

బీసీల వాటా బీసీలకు ఇవ్వకపోతే దేశంలో తిరుగుబాటు తప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. గురువారం HYD విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో జరిగిన 16వ బీసీ సంఘాల సమావేశం అనంతరం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు. దేశానికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్లు గడిచినా పేద – ధనిక వ్యత్యాసాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదని పేర్కొన్నారు.

చిన్నారెడ్డిని చూస్తూ ఈ స్థాయికి ఎదిగా: సీఎం రేవంత్ రెడ్డి

image

నేడు హైదరాబాద్‌లోని మాదాపూర్ ఓ హోటల్ జరిగిన జిల్లా లెవెల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి రాజకీయ ప్రస్థానం చూసి ఈ స్థాయికి వచ్చానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

News May 16, 2024

వేములవాడ: పిడుగుపాటుతో వ్యక్తి మృతి

image

పిడుగుపాటుతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వేములవాడ మండలం సాత్రాజుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం పొలం వద్ద పనిచేస్తున్న కంబాల శ్రీనివాస్ (32)పై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.