Telangana

News May 16, 2024

ALERT: టీయూ పరిధిలో పరీక్షలు వాయిదా

image

టీయూ పరిధిలోని డిగ్రీకి సంబంధించి జూన్‌ 6న జరగాల్సిన పరీక్ష జూన్ 15వ తేదీకి వాయిదా వేసినట్లు యూనివర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. జూన్‌ 6న జరగాల్సిన బీఏ, బీకాం, బీఎస్సీ 2, 4, 6వ సెమిస్టర్లు, బ్యాక్‌లాగ్‌ పరీక్షలు ఐసెట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ కారణంగా వాయిదా పడ్డాయని వెల్లడించారు. సంబంధిత కళాశాలల ప్రిన్సిపల్స్, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు.

News May 16, 2024

మంచిర్యాల: 2,21,397 మంది ఓటేయ్యలేదు

image

ప్రతిఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు మంచిర్యాల జిల్లా అధికారులు విస్తృతంగా ప్రచారం చేశారు. అయినప్పటికీ లోక్ సభ ఎన్నికల్లో చాలా మంది ఓటు వేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. 3 నియోజకవర్గాల్లో 6,49,030 మంది ఓటర్లు నమోదై ఉండగా ఏకంగా 2,21,397 మంది ఓటర్లు ఓటు వేయలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 1,54,882 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోలేదు.

News May 16, 2024

MBNR: టెన్త్‌ సప్లిమెంటరీ రాయనున్న 5,575 మంది విద్యార్థులు

image

ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది 44,898 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా.. వీరిలో 39,323 పాసయ్యారు. మొత్తం 5,575 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అత్యధికంగా MBNR జిల్లాలో 2,127 మంది అత్యల్పంగా, NRPT జిల్లాలో 526 మంది ఫెయిలయ్యారు. వీరందరూ జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకానున్నారు. ఫెయిలైన విద్యార్థులంతా పాసయ్యేలా స్పెషల్ పోకస్ పెట్టినట్లు DEO రవీందర్ తెలిపారు.

News May 16, 2024

HYD: నిబంధనలు పాటించని బడి బస్సులను సీజ్‌ చేస్తాం: ఆర్టీఏ

image

జూన్‌ ప్రారంభంలో ప్రైవేట్‌ విద్యాసంస్థలు ప్రారంభం కానుండటంతో రవాణా శాఖ అధికారులు బస్సుల ఫిట్‌నెస్‌పై యాజమాన్యాలకు పలు సూచనలు చేస్తున్నారు. గ్రేటర్‌ HYD పరిధిలో 11,834 విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 70 శాతం బస్సులు ఫిట్‌నెస్‌ రెన్యూవల్‌ చేసుకున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడిపితే యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.

వరంగల్: సింగరేణి ఉద్యోగాలకు అప్లికేషన్స్ స్వీకరణ

image

సింగరేణిలో 327 పోస్టులను భర్తీ చేసేందుకు యాజమాన్యం మార్చి 14న నోటిఫికేషన్‌ను జారీచేసింది. వీటికి సంబంధించి దరఖాస్తు గడువును జూన్‌ 4వ తేదీ వరకు పొడిగించింది. ముందుగా మే 4వ తేదీ వరకే ఆఖరి గడువుగా నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కొద్దిరోజుల పాటు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియను నిలిపివేశారు. పోలింగ్‌ ముగియడంతో దరఖాస్తు గడువును పెంచినట్లు యాజమాన్యం పేర్కొంది.

News May 16, 2024

HYD: మరో రెండు గంటల్లో వర్షం పడే ఛాన్స్!

image

HYD నగరంలోని పలు చోట్ల మరో రెండు గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలంగాణ వెదర్ మెన్ తెలిపింది. క్యుములోనింబస్ మేఘాలు మేఘావృతమై ఉన్నట్లు తెలియజేసింది. ఇప్పటికే రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల బెల్ట్ ప్రాంతాల్లో చిరుజల్లులు ప్రారంభమైనట్లు పేర్కొంది. HYD నగరంలో నేడు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.

NLG: రేపటి నుంచి డిగ్రీ పరీక్షలు 

image

మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 17వ తేదీ నుంచి డిగ్రీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎంజీయూ పరీక్షల నియంత్రణ అధికారి ఉపేందర్ రెడ్డి తెలిపారు. డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్.. 1, 3, 5 సెమిస్టర్ల బ్యాక్‌లాగ్పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

News May 16, 2024

ఖమ్మం: గ్రూప్-1, సివిల్స్ గ్రాండ్ టెస్టులు

image

ఖమ్మం ఉమ్మడి జిల్లాలో టీఎస్పీఎస్సీ గ్రూప్-1, సివిల్స్ కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు పరీక్షలపై అవగాహన పెంపొందించేలా ఆన్లైన్ గ్రాండ్ టెస్టులు నిర్వహించనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.శ్రీలత తెలిపారు. గ్రూప్-1 నమూనా పరీక్షలు 18, 20, 22, 24, 25, 27, 29, 31, జూన్ 1, 3 తేదీల్లో జరుగుతాయని వెల్లడించారు. అలాగే సివిల్స్ ఈనెల 23, 24, 27, 29, 31, జూన్ 1, మూడు తేదీల్లో జరుగుతాయన్నారు.