Telangana

News May 16, 2024

HYD: మూసీ పొడవున ప్రతి నెల నీటి పరీక్షలు!

image

HYD కాలుష్య నియంత్రణ మండలి ప్రతి నెల గండిపేట్, ముసారాంబాగ్, నాగోల్, ఫిర్జాదిగూడ, ప్రతాప సింగారం వరకు మూసీ నదిలో నీటి నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తోంది. ఆర్టీడబ్ల్యూఎంఎస్ ద్వారా నీటిలోని ఆక్సిజన్, అమ్మోనియా, బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD), కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (COD), నైట్రేట్, ఫ్లోరైడ్, పీహెచ్ తదితర పరిమాణాలను లెక్కిస్తున్నారు. కానీ వాటి వివరాలు అధికారులు వెల్లడించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

News May 16, 2024

HYD: మూసీ పొడవున ప్రతి నెల నీటి పరీక్షలు!

image

HYD కాలుష్య నియంత్రణ మండలి ప్రతి నెల గండిపేట్, ముసారాంబాగ్, నాగోల్, ఫిర్జాదిగూడ, ప్రతాప సింగారం వరకు మూసీ నదిలో నీటి నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తోంది. ఆర్టీడబ్ల్యూఎంఎస్ ద్వారా నీటిలోని ఆక్సిజన్, అమ్మోనియా, బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD), కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (COD), నైట్రేట్, ఫ్లోరైడ్, పీహెచ్ తదితర పరిమాణాలను లెక్కిస్తున్నారు. కానీ వాటి వివరాలు అధికారులు వెల్లడించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

News May 16, 2024

అంతుచిక్కని ఓటరు నాడి.. అయోమయంలో నేతలు

image

ఉమ్మడి జిల్లాలో రెండు ఎంపీ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల అనంతరం ఓటరు నాడి అంతు చిక్కడం లేదు. దీంతో నాయకులు లెక్కల మీద లెక్కలు వేస్తూ అయోమయంలో పడ్డారు. MBNR, NGKL స్థానాల్లో గతంలో కంటే ఈసారి అధికంగా పోలింగ్ శాతం పెరిగింది. గ్రామాల వారిగా నివేదికలు తెప్పించుకుని లెక్కలు వేస్తున్నారు.

News May 16, 2024

సంగారెడ్డి, మెదక్ జిల్లాలో సాగుకు సమాయత్తం

image

వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌ పంటల సాగు ప్రణాళికను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. ఏ పంట ఎంత మేరకు సాగు కానున్నది. ఇందుకు అనుగుణంగా ఏ రకం విత్తనాలు ఎంత మేరకు అవసరం అవుతాయని అంచనాలను రూపొందించారు. గత సీజన్‌ కంటే ఈసారి వరి, పత్తి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశమున్నట్లు అంచనా వేశారు. సంగారెడ్డి జిల్లాలో 7,24,405 ఎకరాల్లో అన్ని రకాల పంటలు, మెదక్‌ జిల్లాలో 3,73,509 ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నట్లు అంచనా వేశారు.

News May 16, 2024

కరీంనగర్: రూ.9.17 కోట్లు పట్టివేత

image

పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కరీంనగర్‌ నియోజకవర్గ పరిధిలో పోలీసుల తనిఖీల్లో నగదుతో పాటు ఇతర వస్తువులు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.9.17 కోట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన వాటిని ఎన్నికల పరిశీలన త్రిసభ్య కమిటీ అధికారులకు అప్పగించారు. ఇందులో రూ.8.96 కోట్ల నగదు ఉంది. పట్టుకున్న నగదుకు ఆధారాలు చూపడంతో రూ.కోటిని అధికారులు రిలీజ్‌ చేశారు.

News May 16, 2024

సింగరేణి ఉద్యోగాలకు అప్లికేషన్స్ స్వీకరణ

image

సింగరేణిలో 327 పోస్టులను భర్తీ చేసేందుకు యాజమాన్యం మార్చి 14న నోటిఫికేషన్‌ను జారీచేసింది. వీటికి సంబంధించి దరఖాస్తు గడువును జూన్‌ 4వ తేదీ వరకు పొడిగించింది. ముందుగా మే 4వ తేదీ వరకే ఆఖరి గడువుగా నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కొద్దిరోజుల పాటు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియను నిలిపివేశారు. పోలింగ్‌ ముగియడంతో దరఖాస్తు గడువును పెంచినట్లు యాజమాన్యం పేర్కొంది.

News May 16, 2024

సీఎం క్యాంప్ ఆఫీస్‌గా లేక్ వ్యూ గెస్ట్ హౌస్

image

రాజ్‌భవన్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌ను సీఎం రేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయంగా వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచే పాలన సాగిస్తున్నారు. అయితే సమావేశాలకు ఇబ్బందికరంగా మారడంతో ‘లేక్ వ్యూ’ని వాడాలని ఆయన యోచిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 2న భవనాన్ని అధికారులు స్వాధీనం చేసుకోనున్నారు.

News May 16, 2024

యాదాద్రి: భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం

image

యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట జిల్లా ములుగుకు చెందిన మహిపాల్ రెడ్డి(39) మృతిచెందగా, భార్య నవిత తీవ్రంగా గాయపడింది. బైక్‌పై తుర్కపల్లికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనాన్ని కారు కొంత దూరం ఈడ్చుకెళ్లగా మంటలు చెలరేగి ద్విచక్రవాహనం కాలిపోయింది. దీంతో మహిపాల్ అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

News May 16, 2024

సంగారెడ్డి: ఓట్ల పండుగ.. ఆదాయం దండిగా

image

లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఓటర్లు తమ స్వస్థలాలకు పయనం కావడంతో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది. మెదక్‌ రీజియన్‌ పరిధిలోని ఎనిమిది డిపోల నుంచి ఎన్నికల నిమిత్తం 323 బస్సు సర్వీసులు అదనంగా నడిపారు. మరో 17బస్సులను ఏపీకి తిప్పారు. సుమారు 10, 36, 200 మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేశారు. దీంతో మెదక్‌ రీజియన్‌కు రూ.4.30 కోట్ల ఆదాయం సమకూరింది.

News May 16, 2024

వరంగల్: రేపటి నుంచి సినిమా థియేటర్లు బంద్‌

image

సినిమా థియేటర్ల నిర్వాహకుల నిర్ణయం మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈనెల 17 నుంచి 15 రోజులు మూసివేస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ రమేశ్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 40కి పైగా ఉన్న సింగిల్‌ థియేటర్లు మూసివేయనున్నారు. మల్టీఫ్లెక్స్‌లు మాత్రం కొన్నిరోజులు కొనసాగుతాయన్నారు. మారుతున్న సాంకేతిక ప్రభావంతో ఓటీటీల్లో కోరుకున్న సినిమా అనుకూలమైన సమయంలో ఇంట్లోనే తిలకించే అవకాశం రావడమే ముఖ్యకారణంగా చెబుతున్నారు.