Telangana

News May 16, 2024

REWIND-2019: జహీరాబాద్‌లో BRSకి 6,229 ఓట్ల మెజార్టీ!

image

జహీరాబాద్‌లో విజయం ఎవరిదనేది హాట్‌ టాపిక్‌గా మారింది. 2019‌లోనూ రసవత్తర పోరు సాగింది. మదన్ మోహన్(కాంగ్రెస్)పై బీబీ పాటీల్ (BRS) 6,229 ఓట్ల మెజార్టీతో‌ గెలుపొందారు. బాణాల లక్ష్మారెడ్డి (BJP) 3వ స్థానంలో నిలిచారు. అయితే 2024లో సురేశ్ షెట్కార్ (కాంగ్రెస్), బీబీపాటీల్ (BJP), గాలి అనిల్ కుమార్ (BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు‌ మాదే మెజార్టీ‌ అంటున్నారు. మీ కామెంట్?

News May 16, 2024

‘సిబ్బందికి పారితోషకం చెల్లింపులు చేయండి’

image

MBNR: 2024 ఫిబ్రవరిలో నిర్వహించిన పరీక్ష ప్రయోగ పరీక్షలు, మార్చిలో జరిగిన వార్షిక పరీక్షలు, జవాబు పత్రాల మూల్యాంకనం విధుల్లో పాల్గొన్న సిబ్బందికి పారితోషకం చెల్లింపులు సత్వరమే జరిగేలా చర్యలు తీసుకోవాలని జూనియర్ అధ్యాపకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 24 నుంచి సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. కానీ మార్చిలో జరిగిన పరీక్షల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి పారితోషకాలు అందకపోవడం శోచనీయమన్నారు.

News May 16, 2024

నల్గొండ: రైలు కిందపడి వ్యక్తి మృతి

image

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం కంకణాలపల్లికి చెందిన సతీశ్ చారి రైలు కింద పడి చనిపోయిన ఘటన తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కేశరాజు పల్లి గ్రామ సమీపంలో రైల్ ట్రాక్ కింద పడి మృతి చెందారు. మృతుడికి భార్య, ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. సతీశ్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 16, 2024

ఆదిలాబాద్: గెలుపుపై ఎవరి ధీమా వారిదే..!

image

ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై ప్రధాన పార్టీలైన CONG, BJP, BRS నాయకులు ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరిగా సాగింది. దీంతో ఏ పార్టీకి జిల్లాలో మెజార్టీ ఎంత వస్తుందో అనే దానిపై ఖచ్చితంగా ఒక అంచనాకు వచ్చే పరిస్థితులు లేకుండా పోయాయి. కాగా అభ్యర్థుల గెలుపు ఓటములపై జోరుగా చర్చ సాగుతోంది.

News May 16, 2024

కరీంనగర్: సింగరేణి ఉద్యోగాలకు అప్లికేషన్స్ స్వీకరణ

image

సింగరేణిలో 327 పోస్టులను భర్తీ చేసేందుకు యాజమాన్యం మార్చి 14న నోటిఫికేషన్‌ను జారీచేసింది. వీటికి సంబంధించి దరఖాస్తు గడువును జూన్‌ 4వ తేదీ వరకు పొడిగించింది. ముందుగా మే 4వ తేదీ వరకే ఆఖరి గడువుగా నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కొద్దిరోజుల పాటు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియను నిలిపివేశారు. పోలింగ్‌ ముగియడంతో దరఖాస్తు గడువును పెంచినట్లు యాజమాన్యం పేర్కొంది.

News May 16, 2024

మెదక్ జిల్లాలో కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి

image

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. ఇంటి వద్ద బట్టలు ఆరేస్తున్న దండెం తీగకు కరెంట్ సరఫరా కావడంతో షాక్‌కు గురై ఇద్దరు మృతిచెందగా ఒకరికి గాయాలయ్యాయి. మృతులు నీరుడి మణెమ్మ(45)ను కరెంట్ షాక్‌ నుంచి రక్షించడానికి వెళ్లిన మరిది కుమారుడు భాను ప్రసాద్(19) మరణించారు. వారిని కాపాడటానికి వెళ్లిన కూతురు శ్రీలతకు గాయాలకు గాయాలు కాగా తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News May 16, 2024

REWIND-2019: పెద్దపల్లిలో BRSకి 95,180 ఓట్ల మెజార్టీ!

image

పెద్దపల్లిలో విజయం ఎవరిదనేది హాట్‌ టాపిక్‌గా మారింది. 2019‌లోనూ రసవత్తర పోరు సాగింది. చంద్రశేఖర్(కాంగ్రెస్)పై వెంకటేశ్ నేతగాని(BRS) 95,180 ఓట్ల మెజార్టీతో‌ గెలుపొందారు. S.కుమార్ (BJP) 3వ స్థానంలో నిలిచారు. అయితే 2024లో గడ్డం వంశీకృష్ణ (కాంగ్రెస్), గోమాస శ్రీనివాస్ (BJP), కొప్పుల ఈశ్వర్ (BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు‌ మాదే మెజార్టీ‌ అంటున్నారు. మీ కామెంట్?

News May 16, 2024

18 నుంచి బంద్‌కు పిలుపునిచ్చిన జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్లు

image

జీహెచ్‌ఎంసీతో కాంట్రాక్టర్లు పోరుకు సిద్ధమయ్యారు. బకాయిలు చెల్లిస్తేనే పనులు జరుపుతామని, కొత్తగా వచ్చే ఏ పనులను చేపట్టబోమని, ఈ నెల 18 నుంచి కాంట్రాక్టర్లు మూకుమ్మడిగా బంద్‌లోకి వెళ్తున్నట్లు అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికే పూర్తి చేసిన పనులకు సంబంధించి రూ.1,350 కోట్ల బిల్లులు రావాల్సి ఉన్నదని, వాటిని వెంటనే రిలీజ్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

News May 16, 2024

నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ ఎమ్మెల్సీ స్థానంపైనే గురి

image

లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు KMM-NLG-WGL ఎమ్మెల్సీ ఉపఎన్నికలపై దృష్టి సారించాయి. ఎట్టి పరిస్థతుల్లోనూ ఈస్థానంలో పాగా వేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఈ మేరకు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. BRS నుంచి రాకేశ్ రెడ్డి పోటీలో ఉండగా ఆయనకు మద్దతుగా గతంలో ఈస్థానం నుంచి గెలిచిన పల్లా వ్యూహాలను రచిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రేమేందర్ రెడ్డినే బీజేపీ ఈ దఫా బరిలోకి దింపింది.

News May 16, 2024

18 నుంచి బంద్‌కు పిలుపునిచ్చిన జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్లు

image

జీహెచ్‌ఎంసీతో కాంట్రాక్టర్లు పోరుకు సిద్ధమయ్యారు. బకాయిలు చెల్లిస్తేనే పనులు జరుపుతామని, కొత్తగా వచ్చే ఏ పనులను చేపట్టబోమని, ఈ నెల 18 నుంచి కాంట్రాక్టర్లు మూకుమ్మడిగా బంద్‌లోకి వెళ్తున్నట్లు అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికే పూర్తి చేసిన పనులకు సంబంధించి రూ.1,350 కోట్ల బిల్లులు రావాల్సి ఉన్నదని, వాటిని వెంటనే రిలీజ్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.