Telangana

News May 16, 2024

18 నుంచి బంద్‌కు పిలుపునిచ్చిన జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్లు

image

జీహెచ్‌ఎంసీతో కాంట్రాక్టర్లు పోరుకు సిద్ధమయ్యారు. బకాయిలు చెల్లిస్తేనే పనులు జరుపుతామని, కొత్తగా వచ్చే ఏ పనులను చేపట్టబోమని, ఈ నెల 18 నుంచి కాంట్రాక్టర్లు మూకుమ్మడిగా బంద్‌లోకి వెళ్తున్నట్లు అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికే పూర్తి చేసిన పనులకు సంబంధించి రూ.1,350 కోట్ల బిల్లులు రావాల్సి ఉన్నదని, వాటిని వెంటనే రిలీజ్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

News May 16, 2024

కామారెడ్డి: లైంగిక వేధింపులు.. 7 కేసులు నమోదు

image

కామారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డి.లక్ష్మణ్ సింగ్ పై వైద్యాధికారిణులు వేర్వేరుగా ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదులపై దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో 7 కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ నాగేశ్వర్‌రావు తెలిపారు. వివిధ సెక్షన్ల కింద మంగళవారం 5, బుధవారం మరో 2 కేసులు నమోదయ్యాయి. తమను ఏడాదిన్నర కాలంగా లక్ష్మణ్ సింగ్ లైంగికంగా వేధిస్తున్నట్లు వైద్యాధికారిణులు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.

News May 16, 2024

సిద్దిపేట: బైక్‌ను ఈడ్చుకెళ్లిన కారు.. భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం

image

యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట జిల్లా ములుగుకు చెందిన మహిపాల్ రెడ్డి(39) మృతిచెందగా, భార్య నవిత తీవ్రంగా గాయపడింది. బైక్‌పై తుర్కపల్లికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనాన్ని కారు కొంత దూరం ఈడ్చుకెళ్లగా మంటలు చెలరేగి ద్విచక్రవాహనం కాలిపోయింది. దీంతో మహిపాల్ అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

News May 16, 2024

అమ్రాబాద్: విషాదం.. ఈతకు వెళ్లి బాలుడి మృతి

image

నీట మునిగి బాలుడు మృతిచెందిన ఘటన అమ్రాబాద్ మండలం వెంకటేశ్వర్లబావిలో బుధవారం జరిగింది. స్థానికుల వివరాలు.. పదరకు చెందిన రిషికుమార్(13) అట్చంపేట గురుకులంలో చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం వెంకటేశ్వర్ల బావిలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. నిన్న గ్రామ శివారులో నీటికుంటలో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన రిషి నీటమునిగి చనిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

News May 16, 2024

MBNR: విదేశీ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం

image

గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ 2024-25 విద్యా సంవత్సరానికి గాను నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీం (ఎన్వోఎస్ఎస్)లో భాగంగా ఎస్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేస్తుందని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎం.చత్రునాయక్ తెలిపారు. పీహెచీ, పోస్ట్-డాక్టోరల్ రీసెర్చ్ ప్రోగ్రాంలలో విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించే వారు ఇందుకు అర్హులని, ఈనెల 31లోగా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని కోరారు.

News May 16, 2024

వరంగల్: సైకిల్‌ను ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి

image

వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామశివారులో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలిలా.. బుధరావుపేట గ్రామానికి చెందిన రావుల వెంకన్న (45) అనే గీత కార్మికుడు రోజు వారి వృత్తిలో భాగంగా ఐనపల్లికి సైకిల్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో మహబూబాబాద్ నుంచి నర్సంపేట వైపు వేగంగా వస్తున్న కారు సైకిల్‌‌ను ఢీకొంది. ఈప్రమాదంలో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందాడు.

News May 16, 2024

కరీంనగర్: యువతిపై అత్యాచారం

image

చొప్పదండి మండలానికి చెందిన ఓ యువతిని అత్యాచారం చేసిన ఘటన సంచలనం సృష్టించింది. యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మంగళవారం చొప్పదండికి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకొని KNRకు తరలించారు. ముగ్గురు యువకులను అరెస్ట్‌ చేసి కరీంనగర్‌ జైలుకు.. మరో బాలుడిని వరంగల్‌ జువైనల్‌ హోంకు తరలించినట్లు బుధవారం తెలిసింది.

News May 16, 2024

మంచిర్యాల: రోజుకు రూ. 2 కోట్ల మద్యం విక్రయం

image

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మందుబాబులు ఈ వేసవిలో ఎక్కువగా తాగేస్తున్నారు. నిత్యం రూ. 2 కోట్లకు పైగా వెచ్చిస్తున్నారు. జిల్లాలో 73 మద్యం దుకాణాలు, 16 బార్లు ఉన్నాయి. ప్రతిరోజు సగటున రూ. 2 కోట్లకుపైగా జిల్లాలో మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఈ ఏడాది కేవలం ఫిబ్రవరి మార్చి, ఏప్రిల్, మే 15 వరకు రూ. 208.77 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. అంటే సుమారు నెలకు రూ. 60కోట్ల మద్యం విక్రయాలు జరగుతున్నాయి.

News May 16, 2024

NZB: రేపటి నుంచి సినిమా థియేటర్లు బంద్‌

image

సినిమా థియేటర్ల నిర్వాహకుల నిర్ణయం మేరకు ఉమ్మడి NZB జిల్లాలో ఈ నెల 17 నుంచి 15 రోజుల పాటు సినిమా థియేటర్లు బంద్‌ పాటిస్తున్నారు. NZB, KMR జిల్లాల్లో 35కి పైగా ఉన్న సింగిల్‌ థియేటర్లు మూసివేయనున్నారు. మల్టీఫ్లెక్స్‌లు మాత్రం కొన్నిరోజులు కొనసాగుతాయని పేర్కొంటున్నారు. మారుతున్న సాంకేతిక ప్రభావంతో ఓటీటీల్లో కోరుకున్న సినిమా అనుకూలమైన సమయంలో ఇంట్లోనే తిలకించే అవకాశం రావడమే ముఖ్యకారణంగా చెబుతున్నారు.

News May 16, 2024

MBNR: డిగ్రీ దోస్త్ అడ్మిషన్లు షురూ..

image

2024-25 విద్యా సంవత్సరం ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు గాను ప్రభుత్వం డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ దోస్త్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతోంది. ఈనెల 6 నుంచి 29వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తుంది. దరఖాస్తు దారులు మొదటి దశ వెబ్ఆప్షన్ ఇచ్చేందుకు ఈనెల 20 నుంచి జూన్ 20వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. ఆయా డిగ్రీ కళాశాలలో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు.