Telangana

News May 16, 2024

సిద్దిపేట: ‘నేల చల్లబడ్డాక సాగు చేయాలి’

image

రెండు మూడు వర్షాలు పడి నేల చల్లబడ్డాక సాగుకు ఉపక్రమించాలని తొలకరి చినుకులకే విత్తనాలు నాటి నష్టపోవద్దని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఉపసంచాలకులు(ఏడీఆర్‌) డా. మల్లారెడ్డి రైతులకు సూచించారు. వానకాలం సాగులో మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సమతుల్య సాగు అవసరమని తెలిపారు. నీటి సాంకేతికతకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు తీసుకోవాలని చెప్పారు.

News May 16, 2024

నేటి నుంచి పీయూ డిగ్రీ పరీక్షలు

image

PU పరిధిలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎస్ డబ్ల్యూ తదితర కోర్సులు 2,4,5,6వ సెమిస్టర్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసినట్లు పీయూ పరీక్షల నిర్వహణ అధికారి డా.రాజ్ కుమార్ తెలిపారు. 49 కేంద్రాల్లో 13,751 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని, పరీక్షల టైంటేబుల్ కోసం www.palamuru- university.com లో సందర్శించాలన్నారు.

News May 16, 2024

NLG: అసంపూర్తిగా డిజిటల్ సర్వే.. 

image

ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ డోర్ నంబర్ల సర్వే అర్ధాంతరంగా నిలిచిపోయింది. పూర్తి వివరాలు అందజేయకుండా సంబంధిత కాంట్రాక్టర్ చేతులు దులుపుకున్నారు. సర్వే ప్రారంభమై ఏడాదిన్నర దాటినా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. క్షేత్ర స్థాయిలో దాదాపు 80 శాతం సర్వే పూర్తయినట్లు సర్వే సంస్థ చెబుతున్నా అంతా అసంపూర్తిగానే ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

News May 16, 2024

వానాకాలం సాగుకు వ్యవసాయ శాఖ సన్నద్ధం

image

వానాకాలం సాగుకు జిల్లా వ్యవసాయశాఖ సన్నద్ధమవుతోంది. సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను ముందస్తుగా సిద్ధం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. గతంలో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఎరువుల కొరతను ఎదుర్కొన్న నేపథ్యంలో ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తుగానే పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది. ఇప్పటికే ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేశారు.

News May 16, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి పర్యటన

News May 16, 2024

REWIND-2019: పెద్దపల్లిలో BRSకి 95,180 ఓట్ల మెజార్టీ!

image

పెద్దపల్లిలో విజయం ఎవరిదనేది హాట్‌ టాపిక్‌గా మారింది. 2019‌లోనూ రసవత్తర పోరు సాగింది. చంద్రశేఖర్(కాంగ్రెస్)పై వెంకటేశ్ నేతగాని(BRS) 95,180 ఓట్ల మెజార్టీతో‌ గెలుపొందారు. S.కుమార్ (BJP) 3వ స్థానంలో నిలిచారు. అయితే 2024లో గడ్డం వంశీకృష్ణ (కాంగ్రెస్), గోమాస శ్రీనివాస్ (BJP), కొప్పుల ఈశ్వర్ (BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు‌ మాదే మెజార్టీ‌ అంటున్నారు. మీ కామెంట్?

News May 16, 2024

REWIND-2019: మహబూబాబాద్‌లో BRSకి 1,46,663 ఓట్ల మెజార్టీ!

image

మహబూబాబాద్‌లో విజయం ఎవరిదనేది హాట్‌ టాపిక్‌గా మారింది. 2019‌లోనూ రసవత్తర పోరు సాగింది.
బలరాం నాయక్(కాంగ్రెస్)పై మాలోత్ కవిత (BRS) 1,46,663 ఓట్ల మెజార్టీతో‌ గెలుపొందారు. అర్జున్ కుమార్ (TJS) 3వ స్థానంలో నిలిచారు. అయితే 2024లో బలరాం నాయక్(కాంగ్రెస్), సీతారాం నాయక్ (BJP), మాలోత్ కవిత(BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు‌ మాదే మెజార్టీ‌ అంటున్నారు. మీ కామెంట్?

News May 16, 2024

జహీరాబాద్‌లో పెరిగిన పోలింగ్.. గెలువు ఎవరిదో..?

image

జహీరాబాద్‌ పార్లమెంట్ పరిధిలో 2019 ఎన్నికలతో పోల్చితే ఈ సారి 4.93 శాతం పోలింగ్ పెరిగింది. 2019లో 69.01 శాతం నమోదు కాగా 2024లో 74.63 శాతం నమోదైంది. మొత్తం 16.41 లక్షలకు 12.25లక్షల మంది ఓటేశారు. ఇక్కడ 2019లో బీబీపాటిల్(BRS) 6,229 మెజార్టీతో మదన్ మోహన్ రావు(INC)పై గెలుపొందారు. కాగా ఈ ఎన్నికలో సురేశ్ షెట్కార్(INC), గాలి అనిల్ కుమార్(BRS), బీబీ పాటిల్,(BJP) బరిలో ఉన్నారు. గెలుపెవరిదో కామెంట్ చేయండి.

News May 16, 2024

నల్గొండ- ఖమ్మం- వరంగల్‌పై గురి

image

లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు KMM-NLG-WGL ఎమ్మెల్సీ ఉపఎన్నికలపై దృష్టి సారించాయి. ఎట్టి పరిస్థతుల్లోనూ ఈస్థానంలో పాగా వేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఈ మేరకు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. BRS నుంచి రాకేశ్ రెడ్డి పోటీలో ఉండగా ఆయనకు మద్దతుగా గతంలో ఈస్థానం నుంచి గెలిచిన పల్లా వ్యూహాలను రచిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రేమేందర్ రెడ్డినే బీజేపీ ఈ దఫా బరిలోకి దింపింది.

News May 16, 2024

REWIND-2019: హైదరాబాద్‌లో BJP ఓటమి!

image

HYD లోక్‌సభ‌పై అందరి దృష్టి పడింది. దశాబ్దాలుగా‌ ఇక్కడ MIM‌దే హవా. 2019‌ ఎన్నికల్లోనూ వార్‌ వన్‌సైడ్ అయింది. భగవంతరావు(BJP)పై అసదుద్దీన్(MIM) 2,82,186 ఓట్ల భారీ మెజార్టీతో‌ గెలుపొందారు. కానీ, ప్రస్తుత రాజకీయాలు మారాయి. ఎన్నికల‌కు ముందు MIM, BJP, INC, BRS నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశాయి. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు‌ మాదే గెలుపు అంటున్నారు. ఈసారి HYDలో టగ్ ఆఫ్ వార్‌ అని‌ టాక్. దీనిపై మీకామెంట్?