Telangana

News May 16, 2024

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి: KMR కలెక్టర్

image

ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం ధాన్యం కొనుగోళ్లపై జిల్లా పౌరసరఫరాల, సహకార శాఖ అధికారులు, రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలువలు లేకుండా ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలన్నారు.

News May 16, 2024

పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగింది: జిల్లా కలెక్టర్

image

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. బుధవారం నల్గొండ కలెక్టరేట్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నల్గొండ పార్లమెంటు స్థానంలో 74.03 శాతం పోలింగ్ నమోదు అయిందని, పోస్టల్ బ్యాలెట్ ద్వారా మరో 2 శాతం పోలింగ్ నమోదు అయిందని తెలిపారు.

News May 16, 2024

వరంగల్ మార్కెట్ నేడు పునఃప్రారంభం

image

6 రోజుల సుదీర్ఘ సెలవుల అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ నేడు పున ప్రారంభం కానుంది. ఈనెల 13న పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 10 నుంచి 15 వరకు 6రోజుల సెలవులు ఇచ్చారు. ఈ క్రమంలో ఈరోజు మార్కెట్ ప్రారంభం కానుండటంతో ఉ.6 గం.ల నుంచే మార్కెట్లో క్రయవిక్రయాలు జరుగుతాయని తెలిపారు. కావున రైతులు విషయాన్ని గమనించాలని కోరారు.

News May 16, 2024

సిరిసిల్ల: నూతన ఆలోచనలతో ముందుకు వెళ్లాలి: కలెక్టర్

image

స్వయం సంఘాల గ్రూపులకు చెందిన మహిళలు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నూతన ఆలోచనలతో ముందుకు వెళ్లాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పిలుపునిచ్చారు. స్వయం సంఘాల గ్రూపులకు చెందిన మహిళలు యంత్రాలపై విస్తారాకులు , పేపర్ ప్లేట్స్, చట్నీలు, వక్కపొడి, స్వీట్స్, సమోసాలు తదితర సామాగ్రి తయారుచేసి విక్రయిస్తున్నారు. వీరందరితో కలెక్టరేట్లో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ గౌతమి తదితరులున్నారు.

News May 16, 2024

పట్టభద్రుల ఎమ్మెల్సీ బైపోల్ బరిలో 52 మంది

image

WGL-KMM-NLG పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉపఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని కలెక్టర్ హరి చందన తెలిపారు. ఈ ఉపఎన్నిక నియోజకవర్గ పరిధి 12 జిల్లాలలో ఉందని, 12 మంది అదనపు కలెక్టర్లు ఏఆర్ఓలుగా ఉన్నారన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టుకోవచ్చని, దానికి సంబంధించిన అనుమతులు జిల్లా స్థాయి ఏఆర్వోల వద్ద అనుమతి తీసుకోవాలన్నారు.

News May 15, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఓదెల మండలంలో ఈతకు వెళ్లి యువకుడి మృతి. @ కోరుట్ల మున్సిపల్ పరిధి ఎకిన్ పూర్ లో కూతురిపై అత్యాచారానికి పాల్పడిన తండ్రికి కఠిన కారాగార శిక్ష. @ మేడిపల్లి మండలంలో హత్యకు పాల్పడిన వ్యక్తికి జీవిత ఖైదు. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వర్ష సూచన. @ బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో కరీంనగర్ వాసి. @ వేములవాడలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన సిరిసిల్ల కలెక్టర్.

News May 15, 2024

జగిత్యాల: కూతురిపై అత్యాచారానికి పాల్పడిన తండ్రికి జైలుశిక్ష

image

కోరుట్ల మున్సిపల్ పరిధిలోని ఏకిన్‌పూర్‌కు చెందిన ఎల్లాల తుకారం (40) తన కూతురుపై అత్యాచారానికి పాల్పడినందుకు 25 ఏళ్ల జైలుశిక్ష, పదివేల జరిమానాతో పాటు బాధితురాలికి 3 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని జగిత్యాల జడ్జి నీలిమ బుధవారం తీర్పునిచ్చారు. 2022 అక్టోబర్ 14న రాత్రి అత్యాచారానికి పాల్పడగా.. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయగా, సాక్షులను విచారించి న్యాయమూర్తి నేడు తీర్పు వెలువరించారు.

News May 15, 2024

HYD: అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి: R.కృష్ణయ్య 

image

తెలంగాణలో బీసీ కులగణన చేసి పంచాయతీరాజ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆర్.కృష్ణయ్య సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 50 శాతం రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు ఉద్యమిస్తారని ఆయన హెచ్చరించారు.

News May 15, 2024

HYD: అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి: R.కృష్ణయ్య

image

తెలంగాణలో బీసీ కులగణన చేసి పంచాయతీరాజ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆర్.కృష్ణయ్య సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 50 శాతం రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు ఉద్యమిస్తారని ఆయన హెచ్చరించారు.

News May 15, 2024

పట్టభద్రుల ఎమ్మెల్సీ బైపోల్ బరిలో 52 మంది

image

WGL-KMM-NLG పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉపఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని కలెక్టర్ హరి చందన తెలిపారు. ఈ ఉప ఎన్నిక నియోజకవర్గ పరిధి 12 జిల్లాలలో ఉందని, 12 మంది అదనపు కలెక్టర్లు ఏఆర్ఓలుగా ఉన్నారన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టుకోవచ్చని, దానికి సంబంధించిన అనుమతులు జిల్లా స్థాయి ఏఆర్వోల వద్ద అనుమతి తీసుకోవాలని అన్నారు.