Telangana

News May 15, 2024

HYD: అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి: R.కృష్ణయ్య 

image

తెలంగాణలో బీసీ కులగణన చేసి పంచాయతీరాజ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆర్.కృష్ణయ్య సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 50 శాతం రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు ఉద్యమిస్తారని ఆయన హెచ్చరించారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ బైపోల్ బరిలో 52 మంది

image

WGL-KMM-NLG పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉపఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని కలెక్టర్ హరి చందన తెలిపారు. ఈ ఉప ఎన్నిక నియోజకవర్గ పరిధి 12 జిల్లాలలో ఉందని, 12 మంది అదనపు కలెక్టర్లు ఏఆర్ఓలుగా ఉన్నారన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టుకోవచ్చని, దానికి సంబంధించిన అనుమతులు జిల్లా స్థాయి ఏఆర్వోల వద్ద అనుమతి తీసుకోవాలని అన్నారు.

News May 15, 2024

HYD: మ్యూల్ బ్యాంక్ ఖాతాల కేసులో మరొకరు అరెస్ట్

image

మ్యూల్ బ్యాంక్ ఖాతాల కేసులో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. HYD కీసరలో కేశవరెడ్డి అనే వ్యక్తిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుడు ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించామని, 125 మ్యూల్ బ్యాంక్ ఖాతాలను తెరిచినట్లు విచారణలో తేల్చామని చెప్పారు. 2023లో నమోదైన కేసు ఆధారంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు దర్యాప్తు చేశారు.

MBNR: జిల్లా వ్యాప్తంగా రేపు నిరసనలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రేపు నిరసనలకు BRS పార్టీ పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ, రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొంది. క్వింటాలు వరికి రూ.500 బోనస్ ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం వంచించడమే అవుతుందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. దీంతో నిరసనలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.

News May 15, 2024

హాజీపూర్: హత్యకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్

image

హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి మల్యాల నరేశ్‌ను హత్య చేసిన చైతన్యను అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మృతుడు నరేశ్, నిందితుడు చైతన్య చెల్లెలిని లైంగికంగా వేధిస్తుండటంతో కక్ష పెంచుకొని బండరాయితో తలపై కొట్టి హత్య చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

News May 15, 2024

రేపటి నుంచి డిగ్రీ పరీక్షలు ప్రారంభం

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో చదువుతున్న డిగ్రీ విద్యార్థుల 2, 4, 5, 6వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాక్ పరీక్షలను ఈనెల 16 వ తేదీ నుండి ప్రారంభిస్తున్నామని పరీక్షల నియంత్రణ అధికారి రాజ్ కుమార్ బుధవారం తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 49 కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News May 15, 2024

MBNR: థియేటర్లు బంద్

image

ఉమ్మ‌డి జిల్లాలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమాన్యాలు థియేటర్లను బంద్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువ ఉండటంతో శుక్రవారం నుంచి పది రోజుల పాటు షోలు వేయవద్దని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు, ఇతర కారణాలతో ఇటీవల పెద్ద సినిమాలు విడుదల కాలేదు. దీంతో సినిమా హాళ్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. సినిమాలు విడుదల లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

News May 15, 2024

మన హైదరాబాద్‌లో హోర్డింగులు భద్రమేనా?

image

ముంబైలో భారీ హోర్డింగ్ కుప్పకూలి 14 మంది మరణించడంతో పాటు 70 మందికి పైగా తీవ్రగాయాలైన ఘటనతో హైదరాబాద్ నగర ప్రజల్లో ఆందోళన మొదలైంది. నగరంలో అడ్డగోలుగా వెలసిన అక్రమ హోర్డింగులెన్నో ఉన్నాయి. రానున్నది వర్షాకాలం ఏ క్షణాన ఈదురు గాలులు వీస్తే కూలుతాయో తెలియని పరిస్థితిలో ఎన్నో ఉన్నాయి. HYDలో అక్రమ హోర్డింగులను కూల్చేస్తామని ప్రకటించిన GHMC ఆ పనిని పూర్తి చేయలేకపోయింది. దీనిపై మీ కామెంట్?