Telangana

News May 15, 2024

NZB: గ్రూప్ -1, UPSC ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ నిర్వహణ

image

గ్రూప్-1 ప్రిలిమ్స్ ఆఫ్‌లైన్ గ్రాండ్ టెస్ట్‌ను నిజామాబాద్ బీసీ స్టడీ సర్కిల్‌లో, UPSC ప్రిలిమ్స్ ఆఫ్‌లైన్ గ్రాండ్ టెస్ట్‌ను హైదరాబాద్ బీసీ స్టడీ సర్కిల్‌లో నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ వెంకన్న తెలిపారు. అభ్యర్థులు www.tsbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News May 15, 2024

నాగార్జునసాగర్ జలాశయం సమాచారం

image

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. బుధవారం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 504.80 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 123.0112 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 400 క్యూసెక్కులుగా ఉంది.

News May 15, 2024

HYD: BRS, కాంగ్రెస్ ఒక్కటే: కిషన్ రెడ్డి

image

BRS, కాంగ్రెస్ ఒక్కటే అని, ఆ పార్టీలకు ప్రత్యామ్నాయం BJPనే అని కేంద్ర మంత్రి, తెలంగాణ BJP చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. HYD నాంపల్లిలోని పార్టీ స్టేట్ ఆఫీస్‌లో ఆయన ఈరోజు మాట్లాడారు. ఇచ్చిన ఏ హామీని కాంగ్రెస్ అమలు చేయట్లేదని మండిపడ్డారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించట్లేదని, ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఇవ్వట్లేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు మానుకోవాలన్నారు.

MBNR, NGKL: లెక్కలేసుకుంటున్న అభ్యర్థులు

image

MBNR, NGKL లోక్‌సభ స్థానాన్ని తాము గెలుస్తామంటే.. తమకే అనుకూలంగా ఓట్లు వేశారంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు, పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఏ నియోజకవర్గంలో ఏయే మండలాలు, గ్రామాలు, పోలింగ్ బూత్లలో తమకు ఓట్లు పడ్డాయన్న వివరాలపై ఆరా తీస్తున్నాయి. CM రేవంత్ సొంత  జిల్లా, అత్యధిక అసెంబ్లీ సెగ్మెంట్లల్లో తమ ఎమ్మెల్యే అభ్యర్థులే గెలిచారని భారీ మెజార్టీతో గెలుస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు.

News May 15, 2024

NZB: మహిళా ఉద్యోగిని తిట్టిన ఎమ్మల్యే.. ఉద్యోగానికి రాజీనామా

image

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్ర వద్ద విధులు నిర్వహిస్తున్న తనను ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి తిట్టి కేంద్రం నుంచి బయటకి పంపించేశారిని మహిళ మెప్మా ఆర్పీ ఉద్యోగి ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ తనకు అక్కడ డ్యూటీ వేశారని చెబుతున్న వినకుండా ఎమ్మెల్యే తనను అవమానించాడని పేర్కొన్నారు. దీంతో మనస్తాపం చేంది తన ఉద్యోగానికి రాజీనామా చేసి లెటర్‌ను మున్సిపల్ కమిషనర్‌కి అందజేశారు.

News May 15, 2024

ఖమ్మం: 2007 నుంచి కారు పార్టీదే గెలుపు

image

NLG-KMM-WGL MLC స్థానంలో ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే హవా నడిచింది. ఉమ్మడి ఏపీలో శాసనమండలి ఏర్పాటు కోసం 2007లో జరిగిన మొదటి ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి దిలీప్ కుమార్ గెలిచారు. రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసి 2009 పోటీ చేసిన దిలీప్ కుమార్ మరోసారి విజయం సాధించారు. 2015, 21లోనూ బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు.

News May 15, 2024

HYD: SRH VS GT.. బ్లాక్ టికెట్ల దందా..!

image

HYD ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్‌నేషనల్ క్రికెట్ స్టేడియంలో SRH VS GT మధ్య మే 16న సా.7:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. కీలక మ్యాచ్ కావడంతో ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్న కొందరు సోషల్ మీడియా ద్వారా ఒక్కో టికెట్ రూ.2 వేల నుంచి రూ.5 వేల చొప్పున విక్రయిస్తూ బ్లాక్ దందాకు తెర లేపారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతోన్న ఈ దందాపై పోలీసులు చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు. 

HYDను కేంద్ర పాలిత ప్రాంతం చేసే ఛాన్సే లేదు: సీఎం

image

జూన్ 2 వరకే హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా ఉంటుందని.. ఆ తర్వాత హైదరాబాద్‌ను బీజేపీ కేంద్ర పాలిత ప్రాంతం చేస్తుందంటూ BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి KTR సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరిందని KTR ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. HYDను కేంద్ర పాలిత ప్రాంతం చేసే ఛాన్సే లేదని స్పష్టం చేశారు.