Telangana

News May 15, 2024

ఖమ్మం స్థానంలో ఎవరి అంచనాలు వారివే!

image

ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని తాము గెలుస్తామంటే.. తమకే అనుకూలంగా ఓట్లు వేశారంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు, పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఏ నియోజకవర్గంలో ఏయే మండలాలు, గ్రామాలు, పోలింగ్ బూత్లలో తమకు ఓట్లు పడ్డాయన్న వివరాలపై ఆరా తీస్తున్నాయి. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో తమ ఎమ్మెల్యే అభ్యర్థులే గెలిచారని దేశంలోనే అధిక మెజార్టీ వస్తుందంటూ కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు.

News May 15, 2024

నల్గొండ స్థానంలో ఎవరి అంచనాలు వారివే!

image

నల్గొండ లోక్ సభ స్థానాన్ని తాము గెలుస్తామంటే.. తమకే అనుకూలంగా ఓట్లు వేశారంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు, పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఏ నియోజకవర్గంలో ఏయే మండలాలు, గ్రామాలు, పోలింగ్ బూత్లలో తమకు ఓట్లు పడ్డాయన్న వివరాలపై ఆరా తీస్తున్నాయి. తమకు అనుకూలమైన ఓటు పడిందని, తమ గెలుపు ఎప్పుడో ఖాయమైందని, దేశంలోనే అధిక మెజార్టీ వస్తుందంటూ కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు.

News May 15, 2024

నిజామాబాద్: గుండెపోటుతో వ్యవసాయ అధికారి మృతి

image

నిజామాబాద్ జిల్లా ధర్‌పల్లి మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ (40) బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆయన మృతి పట్ల అధికారులు, రైతులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంపీపీ సారిక, ఎంపీడీవో బాలకృష్ణ, ఎమ్మార్వో మాలతి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

News May 15, 2024

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో పేషంట్ కేర్ ఆత్మహత్యాయత్నం

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో పేషంట్ కేర్‌గా పని చేస్తున్న లక్ష్మీ అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. బుధవారం రిమ్స్‌లోనే ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన సిబ్బంది స్పందించి ఎంఐసీయూ వార్డ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సూపర్‌వైజర్‌ బెదిరింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 15, 2024

నాగర్‌కర్నూల్ MP ఎన్నికలు.. పోలింగ్ ఇలా..!

image

నాగర్‌కర్నూల్ లోక్ సభ పరిధిలో మొత్తం 69.46 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక్కడ మొత్తం 17,38,254 ఓట్లకు గానూ 12,07,471 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 6,13,085 మంది పురుషులు, 5,94,967 మంది స్త్రీలు, 19 మంది ఇతరులు ఉన్నారు. గద్వాల, అలంపూర్ సెగ్మెంట్‌లో అత్యధికంగా 74.93, 74.06 శాతం పోలింగ్ కాగా.. అచ్చంపేట, కొల్లాపూర్‌లో అత్యల్పంగా 65.11 శాతం చొప్పున నమోదైంది. పురుషుల కన్నా మహిళల ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది.

News May 15, 2024

MBNR: ప్రత్యేక తరగతులు నిర్వహించండి

image

జిల్లాలో 10 తరగతి వార్షిక పరీక్షల్లో 2,127 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణత నమోదు కాలేదు. అత్యధికంగా గణితం సబ్జెక్టులో 594, సైన్స్ సబ్జెక్టులో 573 విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వీరంతా జూన్ 3 నుంచి 13 వరకు జరిగే సప్లమెంటరీ పరీక్షలకు హాజరవుతారు. వీరికి విద్యా సంవత్సరం వృధా కాకుండా ఉండేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

News May 15, 2024

మరో 2 టీఎంసీల నీటిని విడుదల చేస్తే మేలు..!

image

కర్ణాటకలోని నారాయణపూర్ జలాశయం నుంచి 1.90 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు విడుదల చేశారు. ఈ నిర్ణయంతో కొద్ది కాలం పాటు తాగునీటి అవసరాలు తీరనున్నాయి. అదనంగా మరో 2 టీఎంసీల నీటిని విడుదల చేస్తే.. జూరాల ప్రాజెక్టుపై ఆధారపడిన తాగునీటి పథకాలకు జూన్ వరకు ఇబ్బంది ఉండదని ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు.

News May 15, 2024

కామారెడ్డి జిల్లాలో ఈ గ్రామాలు ఆదర్శం

image

లోక్‌సభ ఎన్నికల్లో కొన్ని గ్రామాలు ఆదర్శంగా నిలిచాయి. ఎన్నికల కమిషన్‌ ఎన్ని స్వీప్‌ కార్యక్రమాలు నిర్వహించినా కొన్ని గ్రామాల్లో సరాసరిగా 75 శాతం కంటే అధికంగా పోలింగ్‌ నమోదు కాలేదు. కాని కామారెడ్డి జిల్లాలోని ఎనిమిది పోలింగ్‌ కేంద్రాల ఓటర్లు 90 శాతానికి పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇవి కామారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాల పరిధిలోనివి కావడం విశేషం.

News May 15, 2024

PU వీసీ పదవికి 152 దరఖాస్తులు

image

పీయూ ప్రస్తుత వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ మూడేళ్ల పదవి కాలం ఈనెల 21తో ముగియనుంది. 2021 మే 21న పీయూ 6వ ఉపకులపతిగా రాష్ట్రంలో మరో 10 యూనివర్సిటీలకు కూడా అప్పుడే వీసీలు నియమితులయ్యారు. వీరి పదవి కాలం ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియామకాలకు కసరత్తు మొదలుపెట్టింది. పీయూ వీసీ పదవికి మొత్తం 152 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా విశ్రాంతి ఆచార్యులు ఉన్నారు.

News May 15, 2024

ఉపఎన్నికపై నేడు KTR సన్నాహక సమావేశం

image

MLC పట్టభద్రుల ఉపఎన్నికపై BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. నల్గొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల MLC స్థానానికి పార్టీ అభ్యర్థిగా రాకేశ్ రెడ్డిని BRS బరిలో దింపింది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతో ఆయన భేటీ కానున్నారు. ఉపఎన్నికలో పార్టీ కార్యాచరణ, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించి నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు.