Telangana

News May 15, 2024

హైదరాబాద్‌‌లో అర్ధరాత్రి మర్డర్

image

హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. అర్ధరాత్రి ఓల్డ్ సిటీలోని హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య జరిగింది. సమాచారం అందుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతుడిని పరిశీలించారు. హత్యకు గురైంది చార్మినార్‌ ప్రాంతానికి చెందిన మక్సూద్‌ అలీగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకొన్న సౌత్‌ జోన్‌ DCP స్నేహ మెహ్రా ఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు.

News May 15, 2024

ఆదిలాబాద్‌: 12,21,563 మంది ఓటేశారు!

image

ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో 16,50,175 మంది ఓటర్లు ఉండగా.. 12,21,563 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఇక్కడ 74.03 శాతం పోలింగ్‌ నమోదైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన 71.42 శాతంతో పోల్చుకుంటే దాదాపు రెండున్నరశాతం అధికమే. ఓటు వినియోగంలో పట్టణ ఓటర్ల కన్నా గ్రామీణ ఓటర్లలోనే చైతన్యం ఎక్కువ ఉంది. మరి మీరు ఓటేశారా? కామెంట్.

News May 15, 2024

కామారెడ్డి: కొబ్బరి చెట్టు పై పిడుగు

image

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అప్రమత్తమైన సిబ్బంది ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పట్టణంలోని మహేశ్వరి థియేటర్ ప్రాంగణంలో గల కొబ్బరి చెట్టుపై పిడుగు పడి మంటలు చెలరేగాయి. పెద్ద శబ్దంతో పిడుగు పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అకాల వర్షానికి రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

News May 15, 2024

కరీంనగర్: 23,15,233 మంది ఓటేశారు!

image

ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా 32,16,115 మంది ఓటర్లు ఉండగా.. 23,15,233 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మానకొండూరు నియోజకవర్గంలో 77.75% అత్యధికంగా ఓట్లు పోలవగా.. అత్యల్పంగా కరీంనగర్‌లో 60.51% పోలవడం గమనార్హం. మొత్తంగా 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో 8,34,164 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఓటు వినియోగంలో పట్టణ ఓటర్ల కన్నా గ్రామీణ ఓటర్లలోనే చైతన్యం ఎక్కువ ఉంది. మరి మీరు ఓటేశారా? కామెంట్.

News May 15, 2024

WGL, MHBDలో 23,57,331 మంది ఓటేశారు!

image

2019 ఎన్నికలతో పోలిస్తే వరంగల్‌ లోక్‌సభ స్థానంలో 2024లో ఓటింగ్‌ శాతం పెరిగింది. అప్పుడు 63.65% నమోదు కాగా.. ఇప్పుడు 68.86% పోలింగ్ అయింది. మహబూబాబాద్‌లోనూ 2019లో కంటే ఈసారి 2.81% మంది అధికంగా పోలింగ్‌లో పాల్గొనడంతో 71.85% నమోదైంది. ఈ రెండు స్థానాల్లోని 14 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 33,56,832 మంది ఓటర్లు ఉండగా.. 70.22 శాతంతో 23,57,331 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. మరి మీరు ఓటేశారా? కామెంట్.

News May 15, 2024

MBNR: సత్తాచాటిన KVS విద్యార్థులు

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు సీబీఎస్సీ SSC ఫలితాల్లో సత్తాచాటారు. ఈ మేరకు శివకార్తీక్ 485, అలివేలి కీర్తి 478, మరో 34 మంది ఏ1 గ్రేడ్, 53 మంది ఏ2, 67 మంది బీ1, 59 మంది బీ2గా గ్రేడింగ్ పొందారు. ఎస్సెస్సీలో మొత్తం 84 మంది ఉత్తీర్ణులు అయినట్లు ప్రిన్సిపాల్ సురేందర్ తెలిపారు.

News May 15, 2024

NLG: ఓటింగ్ పై ఆసక్తి తగ్గింది ఎందుకో!

image

ఉమ్మడి జిల్లాలో 13న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహిళలు ఓటింగ్‌పై అంతగా ఆసక్తి చూపలేదు. జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల్లో ఓటర్ల పరంగా మహిళలే ముందంజలో ఉన్నా.. పోలింగ్ శాతంలో పురుషుల కంటే వెనుకబడి పోయారు. నల్గొండ లోక్ సభ స్థానంలో మొత్తం మహిళా ఓటర్లు 8,80,453 మంది ఉండగా.. వీరిలో 6,43,450 మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

News May 15, 2024

నాగర్ కర్నూల్: దరఖాస్తు చేసుకోండి

image

2024-25 సంవత్సరం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో అందించే పీజీ డిప్లొమా స్పోర్ట్స్, డిప్లొమా స్పోర్ట్స్ కోచింగ్కు దరఖాస్తు చేసుకోవాలని డీవైఎస్ఓ సీతారాం తెలిపారు. గ్వాలియర్ లోని ది లక్ష్మీబాయి నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో స్పోర్ట్స్ కోచింగ్ అందించనున్నట్లు, ఆసక్తిగల వారు ఈనెల 20వ తేదీలోగా www.inipe.edu.inలో దరఖాస్తు చేసుకోవాలని.. 25న అర్హత పరీక్ష ఉంటుందని తెలిపారు.

News May 15, 2024

REWIND-2019: నిజామాబాద్‌లో BJPకి 70,875 ఓట్ల మెజార్టీ!

image

నిజామాబాద్‌లో విజయం ఎవరిదనేది హాట్‌ టాపిక్‌గా మారింది. 2019‌లోనూ రసవత్తర పోరు సాగింది. కల్వకుంట్ల కవిత (BRS)పై D. అర్వింద్(BJP)70,875 ఓట్ల మెజార్టీతో‌ గెలుపొందారు. మధు యాష్కీ గౌడ్ (కాంగ్రెస్) 3వ స్థానంలో నిలిచారు. అయితే 2024లో జీవన్ రెడ్డి(కాంగ్రెస్), D. అర్వింద్(BJP), బాజిరెడ్డి గోవర్ధన్ (BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు‌ మాదే మెజార్టీ‌ అంటున్నారు. మీ కామెంట్?

News May 15, 2024

REWIND-2019: ఆదిలాబాద్‌లో BJPకి 58,560 ఓట్ల మెజార్టీ!

image

ఆదిలాబాద్‌లో విజయం ఎవరిదనేది హాట్‌ టాపిక్‌గా మారింది. 2019‌లోనూ రసవత్తర పోరు సాగింది. నగేశ్ (BRS)పై సోయం బాబూ రావు(BJP)58,560 ఓట్ల మెజార్టీతో‌ గెలుపొందారు. రమేశ్ రాథోడ్ (కాంగ్రెస్) 3వ స్థానంలో నిలిచారు. అయితే 2024లో సుగుణకుమారి చెలిమలి(కాంగ్రెస్), గోదం నగేశ్(BJP), ఆత్రం సక్కు (BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు‌ మాదే మెజార్టీ‌ అంటున్నారు. మీ కామెంట్?