Telangana

News May 15, 2024

మహబూబ్‌నగర్‌లో పెరిగిన పోలింగ్.. గెలువు ఎవరిదో..?

image

మహబూబ్‌నగర్‌ పార్లమెంట్ పరిధిలో 2019 ఎన్నికలతో పోల్చితే ఈ సారి 7.12 శాతం పోలింగ్ పెరిగింది. 2019లో 65.31 శాతం నమోదు కాగా ఈసారి 72.43 శాతం నమోదైంది. 2019లో ఇక్కడి నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి (BRS) 77,829 భారీ మెజార్టీతో కే అరుణ(BJP)పై గెలుపొందారు. కాగా ఈ ఎన్నికలో చల్లా వంశీ చంద్ రెడ్డి (INC), మన్నె శ్రీనివాస్ రెడ్డి(BRS),డీకే అరుణ(BJP)బరిలో ఉన్నారు. గెలుపెవరిదో కామెంట్ చేయండి.

News May 15, 2024

REWIND-2019: కరీంనగర్‌లో BJPకి 89,508 ఓట్ల మెజార్టీ!

image

కరీంనగర్‌లో విజయం ఎవరిదనేది హాట్‌ టాపిక్‌గా మారింది. 2019‌లోనూ రసవత్తర పోరు సాగింది. బీ వినోద్ కుమార్(BRS)పై బండి సంజయ్ (BJP) 89,08,768 ఓట్ల మెజార్టీతో‌ గెలుపొందారు. పొన్నం ప్రభాకర్(కాంగ్రెస్) 3వ స్థానంలో నిలిచారు. అయితే 2024లో రాజేందర్ రావు (కాంగ్రెస్), బండి సంజయ్(BJP), వినోద్ కుమార్ (BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు‌ మాదే మెజార్టీ‌ అంటున్నారు. మీ కామెంట్?

News May 15, 2024

మెదక్‌లో పెరిగిన పోలింగ్.. గెలువు ఎవరిదో..?

image

మెదక్ పార్లమెంట్ పరిధిలో 2019 ఎన్నికలతో పోల్చితే ఈ సారి 3.38 శాతం పోలింగ్ పెరిగింది. 2019లో 71.71 శాతం నమోదు కాగా ఈసారి 75.09 శాతం నమోదైంది. 2019లో ఇక్కడి నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి(BRS) 3,16,427 భారీ మెజార్టీతో గాలి అనిల్ కుమార్(INC)పై గెలుపొందారు. కాగా ఈ ఎన్నికలో నీలం మధు(INC),వెంకట్రామిరెడ్డి(BRS), రఘునందన్ రావు(BJP) బరిలో ఉన్నారు. గెలుపెవరిదో కామెంట్ చేయండి.

News May 15, 2024

ఖమ్మం: స్వల్పంగా పెరిగిన పోలింగ్.. గెలుపు ఎవరిది…?

image

ఖమ్మం MP సెగ్మెంట్ పరిధిలో 2019తో పోల్చితే ఈసారి పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 2019లో 75.30శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 76.09 శాతం నమోదైంది. 2019లో ఇక్కడి నుంచి నామా(BRS) 1,68,062 మెజార్టీతో రేణుకా చౌదరి(INC)పై గెలుపొందారు. మరి ఈసారి కాంగ్రెస్ తరఫున రఘురాం రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నామా, బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావు బరిలో ఉన్నారు. గెలుపెవరిదో కామెంట్ చేయండి.

News May 15, 2024

REWIND-2019: వరంగల్‌లో BRSకి 3,50,298 ఓట్ల మెజార్టీ!

image

వరంగల్‌లో విజయం ఎవరిదనేది హాట్‌ టాపిక్‌గా మారింది. 2019‌లోనూ రసవత్తర పోరు సాగింది. దొమ్మాటి సాంబయ్య(కాంగ్రెస్)పై పసునూరి దయాకర్(BRS) 3,50,298 ఓట్ల మెజార్టీతో‌ గెలుపొందారు. చింతా సాంబమూర్తి(BJP) 3వ స్థానంలో నిలిచారు. అయితే 2024లో కావ్య(కాంగ్రెస్), ఆరూరి రమేశ్(BJP), సుధీర్ కుమార్(BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు‌ మాదే మెజార్టీ‌ అంటున్నారు. మీ కామెంట్?

News May 15, 2024

నల్గొండ: స్వల్పంగా పెరిగిన పోలింగ్.. గెలుపు ఎవరిది…?

image

నల్గొండ MP సెగ్మెంట్ పరిధిలో 2019తో పోల్చితే ఈసారి పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 2019లో 74.13శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 75.04 శాతం నమోదైంది. 2019లో ఇక్కడి నుంచి ఉత్తమ్(INC) 25,682 మెజార్టీతో నరసింహారెడ్డి(BRS)పై గెలుపొందారు. మరి ఈసారి కాంగ్రెస్ తరఫున రఘువీర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి బరిలో ఉన్నారు. గెలుపెవరిదో కామెంట్ చేయండి.

News May 15, 2024

REWIND-2019: సికింద్రాబాద్‌లో BJPకి 62,114 మెజార్టీ!

image

సికింద్రాబాద్‌లో విజయం ఎవరిదనేది హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక్కడ గెలిస్తే ఆ పార్టీదే దేశంలో అధికారమని సెంటిమెంట్. 2019‌లోనూ రసవత్తర పోరు సాగింది. సాయికిరణ్‌(BRS)పై కిషన్ రెడ్డి(BJP) 62,114 ఓట్ల మెజార్టీతో‌ గెలుపొందారు. అంజన్ కుమార్(INC) 3వ స్థానంలో నిలిచారు. అయితే, ఈ ఎన్నికల ముందు BJP, BRS, INC నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశాయి. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు‌ మాదే మెజార్టీ‌ అంటున్నారు. మీ కామెంట్?

News May 15, 2024

REWIND-2019: సికింద్రాబాద్‌లో BJPకి 62,114 మెజార్టీ!

image

సికింద్రాబాద్‌లో విజయం ఎవరిదనేది హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక్కడ గెలిస్తే ఆ పార్టీదే దేశంలో అధికారమని సెంటిమెంట్. 2019‌లోనూ రసవత్తర పోరు సాగింది. సాయికిరణ్‌(BRS)పై కిషన్ రెడ్డి(BJP) 62,114 ఓట్ల మెజార్టీతో‌ గెలుపొందారు. అంజన్ కుమార్(INC) 3వ స్థానంలో నిలిచారు. అయితే, ఈ ఎన్నికల ముందు BJP, BRS, INC నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశాయి. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు‌ మాదే మెజార్టీ‌ అంటున్నారు. మీ కామెంట్?

News May 15, 2024

స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత వ్యవస్థ

image

ఈవీఎంలను నల్గొండ సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి వద్ద గోదాంలో భద్రపరిచిన విషయం తెలిసిందే. అయితే వాటికి రక్షణగా మూడంచెల భద్రతను ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ హరిచందన, ఎస్పీ చందన దీప్తి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు

News May 15, 2024

ఓటు వేస్తూ వీడియో తీసిన యువకుడిపై కేసు నమోదు

image

ఓటు వేస్తూ సెల్ ఫోన్‌లో వీడియో తీసి, దాన్ని సామాజిక మాద్యమాల్లో పోస్టు చేసిన యువకుడిపై ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో  కేసు నమోదైంది. ఎస్ఐ రామారావు తెలిపిన వివరాల ప్రకారం… సోమవారం జరిగిన ఎన్నికల్లో ఏదులాపురానికి చెందిన ఏపూరి తరుణ్ సెల్ ఫోన్‌తో పోలింగ్ బూత్లోకి వెళ్లి తాను ఓటు వేసిన గుర్తు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. సీ విజిల్ యాప్ లో ఫిర్యాదు అందగా కేసు నమోదు చేశారు.