Telangana

News May 15, 2024

REWIND-2019: సికింద్రాబాద్‌లో BJPకి 62,114 మెజార్టీ!

image

సికింద్రాబాద్‌లో విజయం ఎవరిదనేది హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక్కడ గెలిస్తే ఆ పార్టీదే దేశంలో అధికారమని సెంటిమెంట్. 2019‌లోనూ రసవత్తర పోరు సాగింది. సాయికిరణ్‌(BRS)పై కిషన్ రెడ్డి(BJP) 62,114 ఓట్ల మెజార్టీతో‌ గెలుపొందారు. అంజన్ కుమార్(INC) 3వ స్థానంలో నిలిచారు. అయితే, ఈ ఎన్నికల ముందు BJP, BRS, INC నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశాయి. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు‌ మాదే మెజార్టీ‌ అంటున్నారు. మీ కామెంట్?

News May 15, 2024

స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత వ్యవస్థ

image

ఈవీఎంలను నల్గొండ సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి వద్ద గోదాంలో భద్రపరిచిన విషయం తెలిసిందే. అయితే వాటికి రక్షణగా మూడంచెల భద్రతను ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ హరిచందన, ఎస్పీ చందన దీప్తి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు

News May 15, 2024

ఓటు వేస్తూ వీడియో తీసిన యువకుడిపై కేసు నమోదు

image

ఓటు వేస్తూ సెల్ ఫోన్‌లో వీడియో తీసి, దాన్ని సామాజిక మాద్యమాల్లో పోస్టు చేసిన యువకుడిపై ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో  కేసు నమోదైంది. ఎస్ఐ రామారావు తెలిపిన వివరాల ప్రకారం… సోమవారం జరిగిన ఎన్నికల్లో ఏదులాపురానికి చెందిన ఏపూరి తరుణ్ సెల్ ఫోన్‌తో పోలింగ్ బూత్లోకి వెళ్లి తాను ఓటు వేసిన గుర్తు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. సీ విజిల్ యాప్ లో ఫిర్యాదు అందగా కేసు నమోదు చేశారు.

News May 15, 2024

నా గెలుపు ముందే డిసైడ్ అయింది: DK అరుణ

image

నా గెలుపు పోలింగ్‌కు ముందే నిర్ణయమైందని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. తనను గెలిపించాలని ప్రజలు ముందే నిర్ణయించుకున్నారని వ్యాఖ్యానించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దేశం కోసం.. ధర్మం కోసం.. అంటూ ఏకపక్షంగా బీజేపీకి ప్రజలు ఓటేశారని అన్నారు. మహబూబ్‌నగర్‌ స్థానంలో విజయం కాషాయ పార్టీదేనని జోస్యం చెప్పారు.

News May 15, 2024

5 నెలల్లో BRS భూస్థాపితం అవనుంది: షబ్బీర్ అలీ

image

BRS పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం HYD నాంపల్లిలోని గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మరో 5 నెలల్లో BRS భూస్థాపితం అవనుందని, ఇక ఆ పార్టీ పని ఖతమైందన్నారు. BRS పార్టీ BJPకి బీ టీమ్‌గా పని చేస్తోందని ఆరోపించారు. కూతురు కవితను జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు KCR BJPతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.

News May 15, 2024

మోసం చేయడంలో బీజేపీ వాళ్ళకు ర్యాంక్ ఇవ్వొచ్చు: జగ్గారెడ్డి

image

మోసం చేయడంలో బీజేపీ నేతలకు మొదటి ర్యాంకు ఇవ్వవచ్చని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడడం సరికాదని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి 20, బీజేపీ నుంచి ముగ్గురు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని తెలిపారు. సమావేశంలో పార్టీ నాయకుడు పాల్గొన్నారు.

News May 14, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఇబ్రహీంపట్నం మండలంలో పాముకాటుతో మహిళ మృతి. @ వేములవాడలో ఆటో బోల్తా పలువురికి గాయాలు. @ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ కాటారం మండలంలో పర్యటించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. @ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే వివేక్, ఎంపీ అభ్యర్థి వంశీ. @ ఎల్లారెడ్డిపేట మండలంలో ఉర్సు ఉత్సవాలలో పాల్గొన్న కేటీఆర్. @ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్న మెట్ పల్లి మెజిస్ట్రేట్.

News May 14, 2024

వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం

image

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం వాజేడు ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో బైకుపై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. మృతుడు మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు తెలిసింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 14, 2024

పిట్లంలో రోడ్డు ప్రమాదం

image

కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పిట్లంలో పోతిరెడ్డి పల్లి తండాలో మంగళవారం రాత్రి బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి ఆగి ఉన్న లారీని ఢీ కొన్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నిజాంసాగర్ మండలం నర్సింగ్‌రావు పల్లి గ్రామానికి చెందిన బోట్ల పండరి(29)గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.

News May 14, 2024

FINAL: పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 67.87%

image

పెద్దపల్లి లోక్‌సభ స్థానం పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. బెల్లంపల్లి-70.96%, చెన్నూర్- 68.53%, ధర్మపురి73.35%, మంచిర్యాల-60.84%, మంథని-69.98%, పెద్దపల్లి- 71.34%, రామగుండం-61.59 శాతంగా ఉన్నాయి. మొత్తంగా 67.87% పోలింగ్ నమోదైంది. కాగా ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి వంశీకృష్ణ, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ బరిలో ఉన్నారు.