Telangana

News May 14, 2024

FINAL: మెదక్ ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 75.09%

image

మెదక్ లోక్‌సభ స్థానం పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. దుబ్బాక-82.42%, గజ్వేల్-80.31%, మెదక్-80.19%, నర్సాపూర్-84.25%, పటాన్‌చెరు-63.01%, సంగారెడ్డి-71.99%, సిద్దిపేట-73.64%గా నమోదైంది. కాగా ఇక్కడ మొత్తం 75.09% నమోదైంది. ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీఆర్ఎస్ నుంచి వెంకట్రాంరెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్ రావు బరిలో ఉన్నారు.

News May 14, 2024

నల్గొండ ఫైనల్ ఓటింగ్ 74.02%

image

నల్గొండ లోక్‌సభ స్థానం పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. DVK-70.60%, HNR-76.34%, KDD-75.21%, MLG-73.34, సాగర్-74.50%, NLG-75.20, SRPT-73.07%గా ఉంది. మొత్తంగా 74.02% పోలింగ్ నమోదైంది. కాగా ఈ స్థానంలో కాంగ్రెస్ తరఫున రఘువీర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కృష్ణారెడ్డి, బీజేపీ తరఫున సైదిరెడ్డి పోటీ చేశారు.

News May 14, 2024

FINAL: MHBD ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 71.85%

image

మహబూబాబాద్ లోక్‌సభ స్థానం పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. భద్రాచలం-69.02%, డోర్నకల్-75.39%, మహబూబాబాద్-71.24%, ములుగు-69.66%, నర్సంపేట-76.60%, పినపాక-69.40%, ఇల్లందు-70.48%గా ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ 71.85% పోలింగ్ నమోదైంది. కాగా ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, బీజేపీ నుంచి అజ్మీరా సీతారాం నాయక్, బీఆర్ఎస్ నుంచి మాలోతు కవిత బరిలో ఉన్నారు.

News May 14, 2024

భువనగిరి ఎంపీ సెగ్మెంట్‌ ఫైనల్ ఓటింగ్ 76.78%

image

భువనగిరి లోక్‌సభ స్థానం పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. ఆలేరు- 82.81%, భువనగిరి- 82.71%, ఇబ్రహీంపట్నం- 66.83%, జనగాం-74.68%, మునుగోడు- 83.71%, నకిరేకల్ -77.11%, తుంగతుర్తి- 74.06%గా ఉంది. మొత్తంగా 76.78% పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో ఇదే టాప్. కాగా ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి చామల కిరణ్, బీజేపీ నుంచి బూర నర్సయ్య , బీఆర్ఎస్ నుంచి మల్లేశ్ బరిలో ఉన్నారు.

News May 14, 2024

MBNR: FINAL పోలింగ్ శాతం ఇదే..!

image

ఎంపీ ఎన్నికల తుది పోలింగ్ శాతాన్ని CEO వికాస్ రాజ్ ఈరోజు ప్రకటించారు. MBNR ఎంపీ స్థానంలో 72.43%, NGKLలో 69.46% నమోదైంది. అసెంబ్లీ స్థానాల వారీగా దేవరకద్ర-74.50%, జడ్చర్ల-77.92%, కొడంగల్-71.04%, మహబూబ్ నగర్-66.27%, మక్తల్-71.63%, నారాయణపేట్-69.13%, షాద్‌నగర్-77.40%, అచ్చంపేట-65.11%, అలంపూర్-74.06%, గద్వాల్-74.93%, కల్వకుర్తి-72.51%, కొల్లాపూర్-65.11%,నాగర్ కర్నూల్-67.94%, వనపర్తి-66.66%గా నమోదైంది.

News May 14, 2024

FINAL: ఖమ్మం ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 76.09%

image

ఖమ్మం లోక్‌సభ స్థానం పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. ఖమ్మం – 62.97%, పాలేరు -83.77%, మధిర -81.84%, వైరా-81.06%, సత్తుపల్లి-80.34%, కొత్తగూడెం -69.47%, అశ్వారావుపేట- 80.95%గా ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ 76.09% శాతం పోలింగ్ నమోదైంది. ఈ స్థానంలో కాంగ్రెస్ తరఫున రఘురాం రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నామా, బీజేపీ తరఫున వినోద్ రావు పోటీ చేశారు.

News May 14, 2024

FINAL: కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 72.54%

image

కరీంనగర్ లోక్‌సభ స్థానం పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. చొప్పదండి- 75.36%, హుస్నాబాద్- 77.25%, హుజూరాబాద్-73.82%, కరీంనగర్-60.51%, మానకొండూర్- 77.75%, సిరిసిల్ల-75.27%, వేములవాడ-74.44 శాతంగా ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ 72.54% పోలింగ్ నమోదైంది. కాగా ఈ స్థానంలో BJP నుంచి బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి రాజేందర్ రావు, BRS నుంచి వినోద్ కుమార్ బరిలో ఉన్నారు.

News May 14, 2024

HYD: FINAL పోలింగ్ శాతం ఇదే..!

image

HYD, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల తుది పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఈరోజు ప్రకటించారు. HYDలో 48.48%, సికింద్రాబాద్‌లో 49.04%, మల్కాజిగిరిలో 50.78%, చేవెళ్లలో 56.40% నమోదైంది. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 51.61% పోలింగ్ నమోదైందని ఆయన తెలిపారు. కాగా రాజధాని పరిధిలో 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి సుమారు 3 శాతం పోలింగ్ అధికంగా నమోదైంది.

News May 14, 2024

HYD: FINAL పోలింగ్ శాతం ఇదే..!

image

HYD, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల తుది పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఈరోజు ప్రకటించారు. HYDలో 48.48%, సికింద్రాబాద్‌లో 49.04%, మల్కాజిగిరిలో 50.78%, చేవెళ్లలో 56.40% నమోదైంది. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 51.61% పోలింగ్ నమోదైందని ఆయన తెలిపారు. కాగా రాజధాని పరిధిలో 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి సుమారు 3 శాతం పోలింగ్ అధికంగా నమోదైంది.

News May 14, 2024

యాదాద్రి: రైలు పట్టాల ప్రక్కన మహిళ మృతదేహం

image

రైలు పట్టాల పక్కన మహిళ మృతదేహం లభ్యమైన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. రైల్వే పోలీసుల వివరాలిలా.. నాగిరెడ్డిపల్లి – బొమ్మాయిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య అనాజిపురం సమీపాన మహిళ మృతదేహం లభ్యం కాగా.. రైలు నుంచి చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతురాలు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందన్నారు. మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆచూకీ తెలిసినవారు 87125 68454ను సంప్రదించాలన్నారు.