Telangana

News May 14, 2024

HYD: FINAL పోలింగ్ శాతం ఇదే..!

image

HYD, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల తుది పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఈరోజు ప్రకటించారు. HYDలో 48.48%, సికింద్రాబాద్‌లో 49.04%, మల్కాజిగిరిలో 50.78%, చేవెళ్లలో 56.40% నమోదైంది. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 51.61% పోలింగ్ నమోదైందని ఆయన తెలిపారు. కాగా రాజధాని పరిధిలో 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి సుమారు 3 శాతం పోలింగ్ అధికంగా నమోదైంది.

News May 14, 2024

యాదాద్రి: రైలు పట్టాల ప్రక్కన మహిళ మృతదేహం

image

రైలు పట్టాల పక్కన మహిళ మృతదేహం లభ్యమైన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. రైల్వే పోలీసుల వివరాలిలా.. నాగిరెడ్డిపల్లి – బొమ్మాయిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య అనాజిపురం సమీపాన మహిళ మృతదేహం లభ్యం కాగా.. రైలు నుంచి చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతురాలు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందన్నారు. మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆచూకీ తెలిసినవారు 87125 68454ను సంప్రదించాలన్నారు.

News May 14, 2024

FINAL: వరంగల్ ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 68.86%

image

వరంగల్ లోక్‌సభ స్థానం పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. భూపాలపల్లి- 67.71%, స్టే.ఘ-78.77%, పాలకుర్తి- 71.43%, పరకాల-76.86%, వర్ధన్నపేట-72.24%, వరంగల్ ఈస్ట్ -65.08%, వరంగల్ వెస్ట్- 52.68%గా ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ 68.86% పోలింగ్ నమోదైంది. కాగా ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, BJP నుంచి ఆరూరి రమేశ్, BRS నుంచి సుధీర్ కుమార్ బరిలో ఉన్నారు.

News May 14, 2024

NZB: భార్యాభర్తల మధ్య గొడవ.. ముంజైలో కేసు

image

భర్తే తనను మోసం చేశాడని ఓ మహిళ ఆందోళనకు దిగింది. NZBలోని కోటగల్లికి చెందిన మనష్వినికి 2016లో శ్రీనివాస్‌తో వివాహమైంది. పెళ్లి తర్వాత అత్తగారుంటున్న ఇంటిని మనష్వినికి బహుమతిగా ఇచ్చారు. అయితే కొన్ని రోజులుగా ఆమె భర్త, అతడి మొదటి భార్య సవితతో కలిసి ఆ ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు ఆమెపై దాడి చేసి బెదిరించారు. దీంతో ఆమె సవిత నివాసం ఉంటున్న ముంబైకి వెళ్లి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News May 14, 2024

KTDM: అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

image

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన ఘటన గుండాల మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. తునికిబండల గ్రామానికి చెందిన గిరిజన రైతు ఈసం రామయ్య చిన్న కూతురు ఈసం రమ్య (20) అనే యువతి అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి కింద పడింది. నోటి నుంచి నురగ వచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News May 14, 2024

BRSకు మంచి సీట్లు వస్తాయి: నామా

image

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే తమ పార్టీ విజయానికి సోపానమని BRS ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వర రావు అన్నారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధినేత కేసీఆర్ బస్సుయాత్రలో సానుకూల ప్రభావం ఏర్పడిందని చెప్పారు. రాష్ట్రంలో BRSకు మంచి సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఖమ్మం ఓటర్లు విజ్ఞతతో ఓటు వేశారని ఆయన వ్యాఖ్యానించారు.

News May 14, 2024

మెదక్ అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్..!

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మెదక్ పార్లమెంట్ బరిలో 44 మంది ఉండగా 75.09 శాతం ఓటింగ్ నమోదైంది. జహీరాబాద్ నుంచి 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 74.63 శాతం ఓటింగ్ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఓటరు ఎవరివైపు నిలిచారని జూన్ 4 వరకు వేచి చూడాల్సి ఉండగా ప్రస్తుతం అభ్యర్ధుల్లో టెన్షన్ నెలకొంది.

News May 14, 2024

ఆదిలాబాద్‌లో పెరిగిన పోలింగ్.. గెలుపెవరిది..!

image

2019 పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్‌లో పోలింగ్ శాతం పెరిగింది. గత ఎన్నికల్లో 71.41 % పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 74.03%నమోదైంది. 16,50,175 మంది ఓటర్లు ఉండగా 12,21,563 మంది ఓటు వేశారు. 5,99,108 మంది పురుషులు, 6,22,420 మంది మహిళలు, ఇతరులు 35 మంది ఉన్నారు. ఈ ఎన్నికల్లో 2.5% పోలింగ్ పెరిగింది. గత ఎన్నికల్లో BJP గెలుపొందగా మరి ఈసారి ఎవరు గెలుస్తారో చూడాలి.

News May 14, 2024

జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్‌దే గెలుపు: మంత్రి దామోదర రాజనర్సింహ

image

జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆందోలు- జోగిపేట మున్సిపల్ కౌన్సిలర్లు మంగళవారం మంత్రిని కలిశారు. ఎన్నికల సరళిని వారిని అడిగి తెలుసుకున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నుంచి భారీ మెజార్టీ వస్తుందని మంత్రికి కౌన్సిలర్లు వివరించారు.

News May 14, 2024

కాంగ్రెస్‌కు 12 నుంచి 14 సీట్లు: డిప్యూటీ సీఎం భట్టి

image

కాంగ్రెస్‌కు 12 నుంచి 14 సీట్లు వస్తాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజలు తమ పార్టీని విశ్వసించారని చెప్పారు. కేంద్రంలోనూ ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. సెంటిమెంట్ రగిలించేందుకు బీజేపీ ప్రయత్నించి విఫలమైందన్నారు.