Telangana

News May 14, 2024

BRSను KCR BJPకి తాకట్టు పెట్టారు: షబ్బీర్ అలీ

image

KCR RSS ఏజెంట్ అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. KMRలో ఆయన మీడియాతో మాట్లాడారు. బిడ్డ బెయిల్ కోసం KCR BRS పార్టీని MPఎన్నికల్లో BJPకి తాకట్టు పెట్టారని విమర్శించారు. పార్టీని, కేడర్‌ను, తెలంగాణ ప్రజల నమ్మకాన్ని BJPకి అమ్మేశారని ఆరోపించారు. BJPతో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్న KCRకు సెక్యులరిజంపై మాట్లాడే హక్కు లేదన్నారు. KMRలో కాంగ్రెస్‌కు బంపర్ మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

News May 14, 2024

సంగారెడ్డి: కాంగ్రెస్‌లోకి BRS, BJP ఎమ్మెల్యేలు: జగ్గారెడ్డి

image

కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు BRS నుంచి 25 మంది ఎమ్మెల్యేలు, BJP నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని, త్వరలో వారు చేరనున్నారని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ MLA జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్‌కు ఆగస్టులో సంక్షోభం తప్పదని BJP ఎంపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలకు జగ్గారెడ్డి ఈరోజు కౌంటర్ ఇచ్చారు. HYD గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. BJPపై మండిపడ్డారు.

News May 14, 2024

నల్గొండ: పిడుగుపడి యువకుడి మృతి

image

నల్గొండ జిల్లాలో పిడుగు పడి ఓ యువకుడు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. త్రిపురారం మండలం నీలాయగూడెంలో యువకులు క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. వారంతా చెట్టుకిందికి వెళ్లగా పిడుగుపడింది. దీంతో ఓ యువకుడు చనిపోగా, ఇద్దరికి గాయాలయ్యాయి.

News May 14, 2024

MBNR: గెలుపుపై ఎవరి ధీమా వారిదే!

image

పాలమూరులో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు హక్కును వినియోగించుకుని బాధ్యతను నెరవేర్చారు. ఇక లెక్కింపే తరువాయి. ఓటింగ్ శాతం బాగా పెరగడంతో ఇది ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలమన్న చర్చలు సర్వత్రా నడుస్తున్నాయి. ఓవైపు అధికార పక్ష నేతలు, మరోవైపు ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఎవరికి వారు తమ గెలుపుపై ధీమాతో కనిపిస్తున్నారు. మేమే గెలుస్తామంటే మేమే గెలుస్తామంటున్నారు. మరి గెలుపు ఎవరిది?

News May 14, 2024

మెదక్: EVMలలో అభ్యర్థుల భవిష్యత్తు !

image

నెల రోజులుగా కొనసాగిన పార్లమెంట్ ఎన్నికల ప్రహసనం సోమవారం పోలింగ్ ప్రక్రియతో ముగిసింది. ఇక పోలింగ్ అయిపోయిన వెంటనే అభ్యర్థులు తమ కార్యకర్తలతో సమావేశమై కూడికలు తీసివేతలతో విజయావకాశాలకు బేరీజు వేసుకుంటున్నారు. EVMలలో నిక్షిప్తమై ఉన్న వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఓటింగ్ సరళిని పరిశీలిస్తూ అంచనాలకు వస్తున్నారు. మెదక్‌లో 74.38%, జహీరీబాద్‌లో 74.54% ఓటింగ్‌ జరగ్గా.. అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.

News May 14, 2024

ఈసారి తగ్గిన పోలింగ్ శాతం

image

ఉమ్మడి నల్గొండ గత ఎన్నికలతో పోలిస్తే రెండు పార్లమెంట్ సెగ్మెంట్లలో ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గింది. 2019 ఎన్నికల్లో నల్గొండ పోలింగ్ శాతం 78.7%గా నమోదు కాగా ఈ సారి 73.85% నమోదైంది. భువనగిరి పార్లమెంట్లో గత ఎన్నికల్లో 79.3% నమోదు కాగా, ఈ సారి 76.47% నమోదైంది.

News May 14, 2024

నిజామాబాద్: శుభారంభం చేసిన నిఖత్

image

ఒలింపిక్స్‌కు ముందు నిజామాబాద్‌కు చెందిన క్రీడాకారిణి నిఖత్ జరీన్ సత్తా చాటింది. ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో భారత క్రీడాకారిణి నిఖత్ (52 కేజీలు) శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో నిఖత్ 5-0తో రఖింబెర్ది జాన్సాయా (కజకిస్తాన్)పై విజయం సాధించింది. బౌట్ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై పదునైన పంచ్లతో విరుచుకుపడ్డ నిఖత్.. అలవోక విజయంతో రెండో రౌండుకు దూసుకెళ్లింది.

News May 14, 2024

కుటుంబ కలహాలతో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం కూసుమంచి మండలంలో చోటు చేసుకుంది. హత్యతండాకు చెందిన బాదావత్ శంకర్ కుటుంబ కలహాల నేపథ్యంలో గ్రామ సమీపంలోని పొలాల వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News May 14, 2024

MBNR: సైలెంట్‌గా క్రాస్ ఓటింగ్.. అభ్యర్థుల్లో ఆందోళన

image

జనరల్ స్థానమైన MBNRతో పాటు ఎస్సీ రిజర్వ్ స్థానమైన NGKL పార్లమెంట్ పరిధిలోని దాదాపు అన్ని అసెంబ్లీ స్థానాల్లో “సైలెంట్” ఓటింగ్ కొనసాగినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. MBNR నుంచి 31 మంది, NGKL 19 మంది బరిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలాపడ్డ పార్టీకి చెందిన ఓట్లు రెండు నియోజకవర్గాల్లో వేరే పార్టీ అభ్యర్థికి క్రాస్ అయినట్లు చర్చ సాగుతోంది.  క్రాస్ ఓటింగ్ ఎవరికి కలిసి వచ్చేనో చూడాలి.

News May 14, 2024

లక్ష 30వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తాం: జీవన్ రెడ్డి

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వంశీ ఇంటర్నేషనల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ ఉత్తర భారత దేశంలో ఉనికి కోల్పోతుందని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. నిజామాబాద్‌లో లక్ష 30 వేల మెజార్టీతో గెలుస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.