Telangana

News May 14, 2024

NRPT: విషాదం.. కొత్తింటి కల నెరవేరకుండానే చనిపోయాడు

image

మక్తల్ పట్టణంలోని టీవీఎస్ షోరూం నిర్వాహకుడు మహేశ్ గౌడ్ కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. స్థానికుల వివరాలు.. చింతరేవులకు చెందిన మహేశ్ మక్తల్‌లో నిర్మిస్తున్న ఇంటి దగ్గరికి సోమవారం రాత్రి వెళ్లాడు. అక్కడ తెగిపడిన సర్వీస్ వైరుకు తగలడంతో షాక్‌కు గురయ్యాడు. రెండు గంటలైనా ఇంటికి రాకపోడవంతో కుటుంబీకులు వెళ్లి చూడగా పడి ఉన్నాడు. వారు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందాడని డాక్టర్లు నిర్ధారించారు.

News May 14, 2024

NZB: వచ్చే నెల 4 వరకు నిరీక్షించాల్సిందే..!

image

లోక్‌సభ పోరు ముగిసింది. ఓటరు తీర్పు EVMలలో నిక్షిప్తమైంది. రాజకీయపార్టీలు నెల రోజులుగా హోరాహోరీగా ప్రచారం చేశాయి. తుది తీర్పు కోసం ఓటర్ల నిర్ణయంపై ఆధారపడ్డాయి. ZHB స్థానంలోని 16,41,410 మంది ఓటర్లు 19 మంది అభ్యర్థులు, NZB పరిధిలోని 17,04,867 ఓటర్లు 29 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించారు. అధికారులు EVMలను స్ట్రాంగ్‌రూంలలో భద్రపరిచారు. విజేత ఎవరో తేలాలంటే వచ్చే నెల 4వ వరకు నిరీక్షించాల్సిందే..

News May 14, 2024

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అలజడులు ఇక్కడే

image

*జనగామ జిల్లా ధర్మకంచ(263)లో పోలింగ్‌ను పరిశీలించేందుకు యువజన కాంగ్రెస్‌ నేత కొమ్మూరి ప్రశాంతరెడ్డి వచ్చారు. దీంతో BRS నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
*సంగెం మం. ఎల్గూరుస్టేషన్‌లోని 211 పోలింగ్‌ కేంద్రంలో ఓటేసి ఓ యువకుడు ఫొటోతీసి వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టుకున్నాడు.
*జనగామ మం.లోని గానుగుపహాడ్‌ ZPHSలో BRS, BJP నాయకులు టెంట్లు ఏర్పాటు చేశారు. వాటిని తీసేయాలని పోలీసులు సూచించగా వాగ్వాదం చోటుచేసుకుంది.

News May 14, 2024

పెద్దపల్లి, ఆదిలాబాద్ అభ్యర్థుల్లో టెన్షన్..టెన్షన్!

image

ఉమ్మడి ADB జిల్లాలోని ఓటరు తీర్పు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలో 12 మంది పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 42 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ సమయంలో ఓటరు ఎవరివైపు నిలిచారనేది అభ్యర్థుల్లో టెన్షన్ పెంచింది. దీనికి తెరపడాలంటే జూన్ 4 వరకు వేచిచూడాల్సిందే.

News May 14, 2024

హైదరాబాద్: నాలాలో మృతదేహం

image

ఖైరతాబాద్ విశ్వేశ్వర్ భవన్ పక్కన ఉన్న నాలాలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీసి ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడు ఎవరు? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 14, 2024

HYD: నాలాలో మృతదేహం

image

ఖైరతాబాద్ విశ్వేశ్వర్ భవన్ పక్కన ఉన్న నాలాలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీసి ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడు ఎవరు? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 14, 2024

మంత్రి పొంగులేటి వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం

image

ఖమ్మం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్లవలసిన విమానంలో సాంకేతిక లోపం వల్ల దాదాపు గంట వరకు టేకాఫ్ కాకుండా రన్ వే పైనే నిలిచిపోయింది. కాగా మంత్రితో పాటు విమానంలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు ఉన్నారు. కాగా విమానంలో సాంకేతిక లోపానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News May 14, 2024

KNR: అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్!

image

కరీంనగర్‌ ఓటరు తీర్పు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కరీంనగర్ లోక్‌సభలో 28 మంది, పెద్దపల్లిలో 42 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత KNR రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ సమయంలో‌ ఓటరు ఎవరివైపు నిలిచారనేది అభ్యర్థుల్లో‌ టెన్షన్‌ పెంచింది. దీనికి తెరపడాలంటే జూన్ 4 వరకు వేచిచూడాల్సిందే.

News May 14, 2024

సిద్దిపేట కేంద్రీయ విద్యాలయంలో శత శాతం ఉత్తీర్ణత

image

సిద్దిపేటలోని కేంద్రీయ విద్యాలయంలో పదో తరగతి (సీబీఎస్ఈ) ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. 2018లో ప్రారంభమైన ఈ పాఠశాలలో ఈ ఏడాది పదవ తరగతి మొదటి బ్యాచ్‌కు చెందిన 29 మంది విద్యార్థులు పరీక్ష రాసి శత శాతం(100%) ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, ఫలితాల సాధన కృషి చేసిన ఉపాధ్యాయులను పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి అభినందించారు.

News May 14, 2024

గద్వాల: ఓటేసిన ట్రాన్స్ జెండర్లు

image

గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ట్రాన్స్ జెండర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గద్వాల పట్టణం వేణుకాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ట్రాన్స్ జెండర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడం సంతృప్తిని ఇచ్చిందన్నారు. నారాయణపేట జిల్లా మండలం జాజాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ట్రాన్స్ జెండర్ జనని తన ఓటు వేశారు.