Telangana

News May 14, 2024

మెదక్: అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్!

image

మెతుకు సీమ తీర్పు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మెదక్ పార్లమెంట్ బరిలో 44 మంది, జహీరాబాద్ లోక్ సభ నుంచి 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ సమయంలో‌ ఓటరు ఎవరివైపు నిలిచారనేది అభ్యర్థుల్లో‌ టెన్షన్‌ పెంచింది. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే జూన్ 4 వరకు వేచిచూడాల్సిందే.

News May 14, 2024

HYD: BJP సీనియర్ నేత శ్యామ్ రావు మృతి

image

BJP సీనియర్ నేత అల్వాల శ్యామ్ రావు హఠాన్మరణం చెందారు. ఆదివారం అర్ధరాత్రి సమమంలో గుండెపోటు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఆయన మృతి చెందారు. శ్యామ్ రావు BJPలో ఏళ్లుగా పనిచేశారు. ప్రస్తుతం గోల్కొండ జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. సీనియర్ నేత మృతి పట్ల వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

News May 14, 2024

HYD: BJP సీనియర్ నేత శ్యామ్ రావు మృతి

image

BJP సీనియర్ నేత అల్వాల శ్యామ్ రావు హఠాన్మరణం చెందారు. ఆదివారం అర్ధరాత్రి సమమంలో గుండెపోటు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఆయన మృతి చెందారు. శ్యామ్ రావు BJPలో ఏళ్లుగా పనిచేశారు. ప్రస్తుతం గోల్కొండ జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. సీనియర్ నేత మృతి పట్ల వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

News May 14, 2024

KNRలో EVMలు ఎక్కడెక్కడ మొరాయించాయంటే.?

image

*పోల్ చీటీలు అందకపోవడం, అసెంబ్లీ ఎన్నికల్లో పేర్లు ఉండి ప్రస్తుత ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడంతో పలువురు నిరాశ చెందారు.
*వావిలాలపల్లిలో ఈవీఎం పని చేయకపోవడంతో పోలింగ్‌ అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది.
*ఓటరు చీటీ మీద కేంద్రం కెన్‌క్రెస్ట్‌ పాఠశాల పేరు ఉండగా.. అక్కడికి వెళ్లి చూసే సరికి SR పాఠశాల బోర్డు కనిపించడంతో ఓటర్లు అయోమయానికి గురయ్యారు.
*చిగురుమామిడి, శంకరపట్నం మండలాల్లో ఈవీఎంలు మొరాయించాయి.

News May 14, 2024

WGL: అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్!

image

ఓరుగల్లు ఓటరు తీర్పు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. వరంగల్ లోక్‌సభలో 42 మంది, మహబూబాబాద్‌లో 23 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత వరంగల్ రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ సమయంలో‌ ఓటరు ఎవరివైపు నిలిచారనేది అభ్యర్థుల్లో‌ టెన్షన్‌ పెంచింది. దీనికి తెరపడాలంటే జూన్ 4 వరకు వేచిచూడాల్సిందే.

News May 14, 2024

WGL: మన అభ్యర్థులు ఓటేసింది ఇక్కడే

image

MHBDలో 70.68, WGLలో 68.29శాతం పోలింగ్ నమోదయింది. ఇక అభ్యర్థుల విషయానికొస్తే.. MHBD కంకరబోడు పాఠశాలలో BRS అభ్యర్థి కవిత, మానుకోట పీఏసీఎస్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్, వెంకటాపూర్ మం. మల్లయ్యపల్లిలో BJP అభ్యర్థి సీతారాం నాయక్‌లు ఓటేశారు. HNK టీచర్స్ కాలనీలో WGL కాంగ్రెస్ అభ్యర్థి కావ్య, KZPT ఫాతిమానగర్‌లో ఆరూరి రమేశ్, ములక్కనూర్ బాలుర ఉన్నత పాఠశాలలో BRS అభ్యర్థి సుధీర్ కుమార్ ఓటేశారు.

News May 14, 2024

నాగర్ కర్నూల్: పెరిగిన పోలింగ్ శాతం..

image

నాగర్ కర్నూల్ లోక్ సభ పరిధిలో అచ్చంపేట, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, గద్వాల, అలంపూర్, వనపర్తి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. లోక్ సభ పరిధిలో మొత్తం 17,38,254 మంది ఓటర్లు ఉండగా, సాయంత్రం వరకు 69.01 శాతం ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో 62.23 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ సారి 6.78 శాతం ఓటింగ్ పెరిగింది.

News May 14, 2024

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి  మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 14, 2024

35 ఏళ్ల తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్న మాదన్న

image

న్యూడెమోక్రసీ దళ సభ్యుడిగా పనిచేసి 35 ఏళ్లపాటు అజ్ఞాత జీవితం గడిపిన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఆవునూరి మధు 50 ఏళ్ల వయస్సులో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇల్లెందు మండలం కొమరారంలో సోమవారం ఆయన ఓటు వేశారు. చిన్నతనంలోనే అజ్ఞాత దళ సభ్యుడిగా చేరిన మధు కమాండర్ స్థాయికి ఎదిగారు. 2000 సంవత్సరంలో మొదటిసారిగా అరెస్ట్ అయిన ఆయన బెయిల్ పై బయటకు వచ్చినా మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు.

News May 14, 2024

నిజామాబాద్: అభ్యర్థుల్లో టెన్షన్..టెన్షన్..!

image

నిజామాబాద్, జహీరాబాద్ ఓటరు తీర్పు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. నిజామాబాద్ లోక్‌సభకు 29 మంది, జహీరాబాద్‌‌కు 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పొలిస్తే ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అభ్యర్థుల్లో టెన్షన్ పెంచింది. దీనికి తెరపడాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.