Telangana

News May 14, 2024

ఎంపీ ఎన్నికలు.. నర్సాపూర్‌లో రెండు చోట్ల కౌంటింగ్

image

మెదక్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ఓట్ల లెక్కింపు నర్సాపూర్‌లోని రెండు చోట్ల నిర్వహిస్తున్నట్టు ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. బీవిఆర్ ఐటి కళాశాలలో నర్సాపూర్, గజ్వేల్, దుబ్బాక, మెదక్, సిద్దిపేటకు సంబంధించిన ఓట్లు, గిరిజన సంక్షేమ బాలుర గురుకులంలో సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూంల్లో భద్రపరిచినట్లు పేర్కొన్నారు.

News May 14, 2024

పెరిగిన ఓటింగ్.. MBNRలో 71.54%.. NGKLలో 69.91

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పార్లమెంట్ ఎన్నికల్లో MBNR,NGKL లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో ఓటింగ్ శాతం పెరిగింది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.MBNR స్థానం పరిధిలో మొత్తం 16,82,470 మంది మొత్తం ఓటర్లు ఉండగా.. రాత్రి వరకు 71.54 శాతం పోలింగ్ నమోదైంది.NGKL పరిధిలో మొత్తం 17,38,254 మంది ఓటర్లు ఉండగా 69.01 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

News May 14, 2024

మిడ్జిల్: కరెంట్ షాక్‌తో యువ రైతు మృతి

image

కరెంట్ షాక్‌తో యువరైతు మృతి చెందిన ఘటన మిడ్జిల్ మండలం వస్పుల గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీశైలం(34) పొలం వద్ద ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఫ్యూజ్ చేసే క్రమంలో కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News May 14, 2024

MBNR: విజయంపై ఎవరి ధీమా వారిదే..!

image

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో హోరాహోరీగా తలపడిన నాయకులు ఎన్నికలు ముగిసిన అనంతరం విజయంపై ఎవరికి వారే ధీమాతో ఉన్నారు. MBNR, NGKL స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. రెండు నియోజకవర్గాలలో గతంలో కంటే ఈసారి అధికంగా పోలింగ్ శాతం నమోదు కావడం ఎవరికి లాభం చేకూరుస్తుంది అనే అంశంపై నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. అటూ ఫేక్ సర్వేలు వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి.

News May 14, 2024

కుంటాల: జర్మనీ నుంచి వచ్చి ఓటు వేసిన యువకుడు

image

నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని లింబా(కె) గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు నానాజీ పటేల్ -గంగాసాగర దంపతుల కుమారుడు సిందె ఆకాష్ ఉన్నత చదువుల నిమిత్తం జర్మనీకి వెళ్లాడు. పార్లమెంట్ ఎన్నికల నిమిత్తం స్వగ్రామానికి వచ్చి సోమవారం గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నాడు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును దుర్వినియోగం చేయకూడదు అన్న ఉద్దేశంతోనే తాను వచ్చి ఓటు వేశానని తెలిపారు.

News May 14, 2024

ఓటేయడానికి దుబాయ్ నుంచి కరీంనగర్‌కు

image

ఉపాధికి దుబాయ్ వెళ్లిన ముగ్గురు లోక్‌సభ ఎన్నికల్లో ఓటేయడానికి సొంతూరుకు వచ్చారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్‌కు చెందిన బాబురావు దుబాయ్‌లోని ఓ కంపెనీలో ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. సేవలాల్‌తండాకు చెందిన దేవనాయక్ ఆ దేశంలోనే పని చేస్తున్నాడు. వీరు ఓటేయడం కోసమే స్వగ్రామానికి వచ్చినట్లు తెలిపారు. మద్దికుంటకు చెందిన సుధాకర్‌రావు, శ్రవణ్‌కుమార్, మాధురిలు ముంబై నుంచి వచ్చి ఓటేశారు.

News May 14, 2024

వరంగల్‌లో EVMలు ఎక్కడెక్కడ మొరాయించాయంటే.?

image

*HNK జిల్లా రహమత్‌నగర్‌లో 164 పోలింగ్ కేంద్రంలోని EVM బటన్‌ను ఓటరు గట్టిగా నొక్కడంతో అది పనిచేయకుండా ఆగిపోయింది.
*పలిమెల మండలం కామన్‌పల్లిలో EVMలు పనిచేయక మంగళవారం రెండు గంటల తర్వాత పోలింగ్ మొదలైంది.
*రేగొండ మం. రూపిరెడ్డిపల్లిలో EVM మొరాయించడంతో ఉ.7-8 వరకు పోలింగ్ నిలిచిపోయింది.
*వెంకటాపురం మం, సూరవీడులో 56వ పోలింగ్ కేంద్రంలో EVM మొరాయించడంతో 40ని. ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.
SHARE IT

News May 14, 2024

ఓటేసేందుకు వెళ్తుండగా తేనెటీగల దాడి

image

అమ్రాబాద్: ఓటేసేందుకు వెళ్తున్న ఓటర్లపై తేనెటీగలు దాడి చేయడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్థుల కథనం ప్రకారం.. వట్వర్లపల్లిలోని ఆశ్రమ పాఠశాలలో సోమవారం ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటేసేందుకు కొందరు ఓటర్లు వెళ్తున్నారు. కొందరు పిల్లలు ఆ సమీపంలోని తేనెతుట్టెపై రాళ్లు విసరడంతో కందిరీగలు ఒక్కసారిగా లేచి ఆ సమీపంలోని వారిపై దాడి చేశాయి. దీంతో వారిని 108లో అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు.

News May 14, 2024

హైదరాబాద్: అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్!

image

రాజధాని‌ ఓటరు తీర్పు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్‌ లోక్‌సభలో 30 మంది, సికింద్రాబాద్‌లో 45, మల్కాజిగిరిలో 43, చేవెళ్లలో 22, కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉపఎన్నికలో 15 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత HYD రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ సమయంలో‌ ఓటరు ఎవరివైపు నిలిచారనేది అభ్యర్థుల్లో‌ టెన్షన్‌ పెంచింది. దీనికి తెరపడాలంటే జూన్ 4 వరకు వేచిచూడాల్సిందే.

News May 14, 2024

సిద్దిపేట కేంద్రీయ విద్యాలయంలో శత శాతం ఉత్తీర్ణత

image

సిద్దిపేటలోని కేంద్రీయ విద్యాలయంలో పదో తరగతి (సీబీఎస్ఈ) ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. 2018లో ప్రారంభమైన ఈ పాఠశాలలో ఈ ఏడాది పదవ తరగతి మొదటి బ్యాచ్‌కు చెందిన 29 మంది విద్యార్థులు పరీక్ష రాసి శతశాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, ఫలితాల సాధన కృషి చేసిన ఉపాధ్యాయులను పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి అభినందించారు.