Telangana

News May 14, 2024

హైదరాబాద్: అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్!

image

రాజధాని‌ ఓటరు తీర్పు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్‌ లోక్‌సభలో 30 మంది, సికింద్రాబాద్‌లో 45, మల్కాజిగిరిలో 43, చేవెళ్లలో 22, కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉపఎన్నికలో 15 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత HYD రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ సమయంలో‌ ఓటరు ఎవరివైపు నిలిచారనేది అభ్యర్థుల్లో‌ టెన్షన్‌ పెంచింది. దీనికి తెరపడాలంటే జూన్ 4 వరకు వేచిచూడాల్సిందే.

News May 14, 2024

PDPL: సంబరపడుతూ కనిపించిన వివేక్‌ వెంకటస్వామి

image

PDPL ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ తండ్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి కళ్లల్లో విజయానందం కనిపించింది. పలు పోలింగ్ కేంద్రాల వద్ద సందడి చేస్తూ పుత్రోత్సాహంతో సంబరపడుతూ కనిపించారు. ఓటు హక్కు వినియోగించుకుని వెళ్లిపోయిన ఆయన.. MLA ప్రేమ్‌సాగర్‌రావు అదే కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చారని తెలవడంతో మరోసారి వచ్చారు. చిరునవ్వు చిందిస్తూ.. చేయి కలిపేందుకు రాగా ప్రేమ్‌సాగర్‌రావు దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకున్నారు.

News May 14, 2024

CBSE ఫలితాల్లో సత్తా చాటిన నిజామాబాదీలు

image

నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు సీబీఎస్ఈ విడుదల చేసిన ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తెలిపారు. సమీక్షారెడ్డి 600 మార్కులకు గాను 559 మార్కులు సాధించి పాఠశాల టాపర్‌గా నిలవగా, మదన్ శ్రీవల్లభ్ 557 మార్కులు సాధించాడు. నిజాంసాగర్ నవోదయ విద్యాలయం విద్యార్థులు శతశాతం ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపల్ సత్యవతి తెలిపారు.

News May 14, 2024

MNCL: సంబరపడుతూ కనిపించిన వివేక్‌ వెంకటస్వామి

image

PDPL ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ తండ్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి కళ్లల్లో విజయానందం కనిపించింది. పలు పోలింగ్ కేంద్రాల వద్ద సందడి చేస్తూ పుత్రోత్సాహంతో సంబరపడుతూ కనిపించారు. ఓటు హక్కు వినియోగించుకుని వెళ్లిపోయిన ఆయన.. MLA ప్రేమ్‌సాగర్‌రావు అదే కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చారని తెలవడంతో మరోసారి వచ్చారు. చిరునవ్వు చిందిస్తూ.. చేయి కలిపేందుకు రాగా ప్రేమ్‌సాగర్‌రావు దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకున్నారు.

News May 14, 2024

మెదక్ లోక్‌సభ పరిధిలో 74.38 % పోలింగ్

image

మెదక్ లోక్ సభ పరిధిలో సాయంత్రం 6 గంటల వరకు మొత్తం74.38% పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా వివరాలు ఇలా..
సిద్దిపేట- 73.15 %
దుబ్బాక- 80.22 %
మెదక్- 79.61 %
నర్సాపూర్- 83.73 %
పటాన్ చెరువు -62.32 %
గజ్వేల్-79.70 %
సంగారెడ్డి -71.83%
అర్ధరాత్రి రెండు గంటలకు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రకటించారు.

News May 14, 2024

ADB: MP ELECTIONS.. అప్పుడు 40 రోజులు.. ఇప్పుడు 22 రోజులు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్ల పని పూర్తైనప్పటికీ నాయకులు, అనుచరులకు మాత్రం ఫలితాలు రావాలంటే 22 రోజుల నిరీక్షణ తప్పదు. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ఒక ఎత్తయితే.. ఫలితాల కోసం నిరీక్షించడం మరో ఎత్తు కానుంది. 2019లో నిర్వహించిన ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన తర్వాత 40 రోజులకు ఫలితాలు వెలువడగా.. ఇప్పుడు 22 రోజుల పాటు వేచి చూడాల్సిందే.

News May 14, 2024

కరీంనగర్ ఎక్కువ, పెద్దపల్లి తక్కువ

image

PDPLతో పోలిస్తే.. KNRలోనే ఎక్కువ శాతం పోలింగ్ నమోదయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 33,93,580 మంది ఓటర్లు ఉండగా.. KNRలో 72.33, PDPLలో 67.88% నమోదయింది. NZBD లోక్‌సభ స్థానం పరిధిలోకి వచ్చే జగిత్యాల, కోరుట్ల సెగ్మెంట్లలో కలిపి 73.75% పోలింగ్ నమోదయింది. చిగురుమామిడి మం. సీతారాంపూర్, ముల్కనూర్, గన్నేరువరం 190, 192, 208 పోలింగ్ బూత్‌లలో ఖాసీంపేట, శంకరపట్నం మం. మొలంగూర్‌లో ఈవీఎంలు మొరాయించాయి.

News May 14, 2024

వరంగల్ తక్కువ, MHBD ఎక్కువ

image

వరంగల్‌తో పోలిస్తే మహబూబాబాద్ లోక్‌సభ స్థానంలోనే ఎక్కువ శాతం పోలింగ్ నమోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 33,56,832 మంది ఓటర్లు ఉండగా.. MHBDలో 70.68, WGLలో 68.29శాతం నమోదయింది. అయితే వరంగల్ లోక్‌సభ స్థానం విషయానికొస్తే తక్కువ శాతం నమోదైనప్పటికీ ప్రతి రెండు గంటలకూ పెరుగుతూ వచ్చింది. 9గంటలకు 8.97, 11గం. 24.48, ఒంటి గంటకు 41.23, 3గం. 54.17, 5-9గంటల వరకు 67.49 శాతం నమోదయింది.

News May 14, 2024

NZB: MP ELECTIONS..అప్పడు 40 రోజులు.. ఇప్పుడు 22 రోజులు

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్ల పని పూర్తైనప్పటికీ నాయకులు, అనుచరులకు మాత్రం ఫలితాలు రావాలంటే 22 రోజుల నిరీక్షణ తప్పదు. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ఒక ఎత్తయితే.. ఫలితాల కోసం నిరీక్షించడం మరో ఎత్తు కానుంది. 2019లో నిర్వహించిన ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన తర్వాత 40 రోజులకు ఫలితాలు వెలువడగా.. ఇప్పుడు 22 రోజుల పాటు వేచి చూడాల్సిందే.

News May 14, 2024

మెదక్: ఓటు వేస్తూ సెల్ఫీలు.. ఇద్దరిపై కేసు నమోదు

image

ఓటు వేస్తూ సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో పెట్టిన ఇద్దరిపై కేసు నమోదైంది. SI పుష్పరాజ్‌ వివరాలు.. నర్సాపూర్‌ మం. బ్రాహ్మణపల్లికి చెందిన గణేష్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేస్తూ ఫోన్‌లో సెల్ఫీ తీసి సోషల్ మీడియా గ్రూపులో పెట్టిన వీడియో వైరల్‌ కాగా కేసు నమోదు చేశారు. అలాగే చిలప్‌చెడ్‌ మం. రహీంగూడా తండాలో ఓ యువకుడు ఓటూ వేస్తూ సెల్ఫీ దిగాడు. ఈ రెండు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.