Telangana

News May 14, 2024

ADB: ఓటు వేసి విదేశాలకు వెళ్లిన వైద్యులు

image

ఓటుహక్కు తెలిసినవారు పోలింగ్ సమయంలో ఎక్కడున్నా తమ గ్రామానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఆదిలాబాద్‌కు చెందిన వైద్యులు ప్రవీణ్ అగర్వాల్ దంపతులు యూరప్‌లో ఉంటున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ కు వచ్చిన ఆయన ఓటువేయాలని సంకల్పంతో ఈనెల 13న ఓటు వేసిన తర్వాత యూరప్ కు వెళ్లాలని నిర్ధారించుకున్నాడు. దీంతో సోమవారం ప్రవీణ్ దంపతులు ఓటువేసి యూరప్‌కు బయలుదేరారు.

News May 14, 2024

KMM: 11 మంది నామినేషన్ ఉపసంహరణ

image

ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. మొత్తం 11 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బండారు నాగరాజు (యువతరం పార్టీ) స్వతంత్ర అభ్యర్థులు పోతుల ప్రార్థన, పోతుల యాదగిరి, సోమగాని నరేందర్, గంగిరెడ్డి కోటిరెడ్డి, బండారు నాగరాజు, దైద సోమ సుందరం, రత్నం ప్రవీణ్, కేడారి మేకల, రత్నం ప్రవీణ్, రేకల సైదులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.

News May 14, 2024

నిజామాబాద్: మునుపెన్నడూ లేనివిధంగా ఓటింగ్ నమోదు

image

మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో మొదటి రెండు గంటలకే సగటున 10.91 శాతం ఓటింగ్ నమోదయ్యింది. అనంతరం కూడా అంతకంతకూ ఊపందుకుంది. ఉదయం 11 గంటల సమయానికి 28.26 శాతం జరిగిన ఓటింగ్, మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 45.67 శాతానికి, మధ్యాహ్నం 3గంటల సమయానికి 58.70 శాతానికి, సాయంత్రం 5 గంటల సమయానికి 67.96 శాతానికి చేరుకుంది.

News May 13, 2024

మెదక్ లోక్‌సభ సాయంత్రం 6 వరకు 73.63% పోలింగ్

image

మెదక్ లోక్ సభ పరిధిలో సాయంత్రం 6 గంటల వరకు మొత్తం73.63%
పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా
గజ్వేల్- 73.15 %
సిద్దిపేట- 73.15 %
దుబ్బాక- 80.22 %
మెదక్- 79.61 శాతం
నర్సాపూర్- 83.73 శాతం
పటాన్ చెరువు -61 శాతం
గజ్వేల్-79.07 శాతం
సంగారెడ్డి- శాతం రావాల్సి ఉన్నది. సంగారెడ్డి రిపోర్టు వస్తే పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.

News May 13, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్. @ రాయికల్ మండలంలో అనుమానాస్పద స్థితిలో 20 గొర్రెలు మృతి. @ ఇబ్రహీంపట్నం మండలంలో ఓటు వేస్తూ సెల్ఫీ తీసుకున్న యువకుడు. @ మెట్పల్లి పట్టణంలో ఒకరి ఓటును మరొకరు వేశారు. @ ఓటు హక్కును వినియోగించుకున్న ఎంపీ అభ్యర్థులు. @ మెట్ పల్లి మండలంలో గుండెపోటుతో రేషన్ డీలర్ మృతి. @ ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్లు.

News May 13, 2024

మెదక్: పిల్లల మీద బెంగతో తల్లి ఆత్మహత్య

image

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామంలో నివాసముండే మధ్యప్రదేశ్‌కు చెందిన ఊర్మిళ ఊకే (30) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై కరుణాకర్ రెడ్డి వివరాలు.. పెళ్లయి ముగ్గురు పిల్లలున్న ఊర్మిళ అదే రాష్ట్రానికి చెందిన జైన్ లాల్ వర్కడే‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పిల్లలను వదిలి ఏడాదిన్నరగా కాళ్లకల్‌లో కంపెనీలో పని చేస్తున్నారు. పిల్లల మీద బెంగతో నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంది.

News May 13, 2024

NZB: ఓటువేయడానికి వచ్చి వృద్ధురాలి మృతి

image

ఓటు వేయడానికి వచ్చిన వృద్ధురాలు మృతి చెందిన ఘటన నిజామాబాద్‌జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. న్యూ పోతంగల్‌కు చెందిన గిరిగమ అనే వృద్ధురాలు ఓటు వేయడానికి సోమవారం పోలింగ్ కేంద్రానికి వచ్చింది. గేటు దాటి లోపలికి వెళుతూ నీరసంగా ఉందని కొద్ది సేపు కూర్చోని అక్కడే స్పృహకోల్పోయింది. దవాఖానాకు తీసుకెళ్లగా ఆరోగ్య సిబ్బంది పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు.

News May 13, 2024

భారీ మెజార్టీతో గెలుస్తాం: డీకే అరుణ

image

మూడు లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తానని బిజెపి అభ్యర్థి డీకే అరుణ అన్నారు. మక్తల్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు గెలుపు కనుచూపు మెడలో కనిపించడం లేదని అన్నారు. గత 10 ఏళ్లు ప్రధానమంత్రిగా మోడీ చేసిన పాలనకు దేశంలోని ప్రజలు ఆకర్షితులై ఆయనను మూడోసారి ప్రధానమంత్రిగా చూడాలన్న తపనతో దేశ ప్రజలు ఉన్నారని, అందులో భాగంగానే తెలంగాణలో మెజారిటీ సీట్లను గెలుచుకుంటామని ఆమె అన్నారు.

News May 13, 2024

కరీంనగర్: పోలింగ్ ముగించుకొని తిరుగు ప్రయాణమైన సిబ్బంది

image

కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగించుకొని పోలింగ్ సిబ్బంది తిరుగు ప్రయాణమయ్యారు. ఈవీఎం వీవీ ప్యాట్లను రిసెప్షన్ సెంటర్లలో అప్పగించి అనంతరం వారి స్వగ్రామాలకు బయలుదేరి వెళుతున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఆలస్యం అవుతుండడంతో వారు ఇంకా రిసెప్షన్ కేంద్రాలకు చేరుకోలేదు. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో పోలింగ్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

News May 13, 2024

ADB: ప్రశాంతంగా పోలింగ్.. అక్కడక్కడా ఆగమాగం

image

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ముగిసింది. ఉమ్మడి వ్యాప్తంగా అక్కడక్కడా చిన్న చిన్న గొడవలు, వాగ్వివాదాలు తప్పితే పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కండువాల వివాదం, పలుచోట్ల ఎన్నికల బహిష్కరణ, అధికారులతో వాగ్వివాదం, కాసేపు ఈవీఎం మొరయింపు, తదితర చిన్నపాటి సంఘటనలు జరిగాయి. ఇక పోలింగ్ ముగిశాక ఎవరికి వారే తామే గెలుస్తున్నామన్న ధీమాతో ప్రధానపార్టీల అభ్యర్థులు ఉన్నారు.