Telangana

News May 13, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్. @ రాయికల్ మండలంలో అనుమానాస్పద స్థితిలో 20 గొర్రెలు మృతి. @ ఇబ్రహీంపట్నం మండలంలో ఓటు వేస్తూ సెల్ఫీ తీసుకున్న యువకుడు. @ మెట్పల్లి పట్టణంలో ఒకరి ఓటును మరొకరు వేశారు. @ ఓటు హక్కును వినియోగించుకున్న ఎంపీ అభ్యర్థులు. @ మెట్ పల్లి మండలంలో గుండెపోటుతో రేషన్ డీలర్ మృతి. @ ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్లు.

News May 13, 2024

మెదక్: పిల్లల మీద బెంగతో తల్లి ఆత్మహత్య

image

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామంలో నివాసముండే మధ్యప్రదేశ్‌కు చెందిన ఊర్మిళ ఊకే (30) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై కరుణాకర్ రెడ్డి వివరాలు.. పెళ్లయి ముగ్గురు పిల్లలున్న ఊర్మిళ అదే రాష్ట్రానికి చెందిన జైన్ లాల్ వర్కడే‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పిల్లలను వదిలి ఏడాదిన్నరగా కాళ్లకల్‌లో కంపెనీలో పని చేస్తున్నారు. పిల్లల మీద బెంగతో నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంది.

News May 13, 2024

NZB: ఓటువేయడానికి వచ్చి వృద్ధురాలి మృతి

image

ఓటు వేయడానికి వచ్చిన వృద్ధురాలు మృతి చెందిన ఘటన నిజామాబాద్‌జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. న్యూ పోతంగల్‌కు చెందిన గిరిగమ అనే వృద్ధురాలు ఓటు వేయడానికి సోమవారం పోలింగ్ కేంద్రానికి వచ్చింది. గేటు దాటి లోపలికి వెళుతూ నీరసంగా ఉందని కొద్ది సేపు కూర్చోని అక్కడే స్పృహకోల్పోయింది. దవాఖానాకు తీసుకెళ్లగా ఆరోగ్య సిబ్బంది పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు.

News May 13, 2024

భారీ మెజార్టీతో గెలుస్తాం: డీకే అరుణ

image

మూడు లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తానని బిజెపి అభ్యర్థి డీకే అరుణ అన్నారు. మక్తల్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు గెలుపు కనుచూపు మెడలో కనిపించడం లేదని అన్నారు. గత 10 ఏళ్లు ప్రధానమంత్రిగా మోడీ చేసిన పాలనకు దేశంలోని ప్రజలు ఆకర్షితులై ఆయనను మూడోసారి ప్రధానమంత్రిగా చూడాలన్న తపనతో దేశ ప్రజలు ఉన్నారని, అందులో భాగంగానే తెలంగాణలో మెజారిటీ సీట్లను గెలుచుకుంటామని ఆమె అన్నారు.

News May 13, 2024

కరీంనగర్: పోలింగ్ ముగించుకొని తిరుగు ప్రయాణమైన సిబ్బంది

image

కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగించుకొని పోలింగ్ సిబ్బంది తిరుగు ప్రయాణమయ్యారు. ఈవీఎం వీవీ ప్యాట్లను రిసెప్షన్ సెంటర్లలో అప్పగించి అనంతరం వారి స్వగ్రామాలకు బయలుదేరి వెళుతున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఆలస్యం అవుతుండడంతో వారు ఇంకా రిసెప్షన్ కేంద్రాలకు చేరుకోలేదు. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో పోలింగ్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

News May 13, 2024

ADB: ప్రశాంతంగా పోలింగ్.. అక్కడక్కడా ఆగమాగం

image

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ముగిసింది. ఉమ్మడి వ్యాప్తంగా అక్కడక్కడా చిన్న చిన్న గొడవలు, వాగ్వివాదాలు తప్పితే పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కండువాల వివాదం, పలుచోట్ల ఎన్నికల బహిష్కరణ, అధికారులతో వాగ్వివాదం, కాసేపు ఈవీఎం మొరయింపు, తదితర చిన్నపాటి సంఘటనలు జరిగాయి. ఇక పోలింగ్ ముగిశాక ఎవరికి వారే తామే గెలుస్తున్నామన్న ధీమాతో ప్రధానపార్టీల అభ్యర్థులు ఉన్నారు.

News May 13, 2024

HYD: పోలింగ్‌ శాతం తగ్గినా BJPకే అనుకూలం: కిషన్‌రెడ్డి

image

నేడు జరిగిన పోలింగ్‌తో తెలంగాణలో BJP కొత్త శక్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదని కేంద్ర మంత్రి, BJP రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్ర నాయకత్వం అనేక రకాలుగా తమకు సహకరించిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి నడ్డా నాయకత్వంలో BJP సంపూర్ణ సహకారం లభించిందని చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవాలను ఏటా అధికారికంగా నిర్వహించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిందన్నారు.

News May 13, 2024

HYD: పోలింగ్‌ శాతం తగ్గినా BJPకే అనుకూలం: కిషన్‌రెడ్డి

image

నేడు జరిగిన పోలింగ్‌తో తెలంగాణలో BJP కొత్త శక్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదని కేంద్ర మంత్రి, BJP రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్ర నాయకత్వం అనేక రకాలుగా తమకు సహకరించిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి నడ్డా నాయకత్వంలో BJP సంపూర్ణ సహకారం లభించిందని చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవాలను ఏటా అధికారికంగా నిర్వహించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిందన్నారు.

News May 13, 2024

MBNR: యాక్సిడెంట్.. యువకుడి మృతి

image

కొడంగల్ పరిధి కోస్గి మండల శివారులో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగి ఓ యువకుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం భిచ్చాల్ గ్రామానికి చెందిన విష్ణు గౌడ్(18) బైక్ పై వెళుతుండగా అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్నాడు. ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు సమాచారం.

News May 13, 2024

HYD: ఓటేసిన 104 ఏళ్ల అవ్వ..!

image

HYD శివారు శంషాబాద్ పరిధి నందిగామ మండలం వీర్లపల్లి గ్రామానికి చెందిన సట్టి రుక్కమ్మ 104 ఏళ్ల వయసులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోనే అత్యధిక వయస్కురాలు ఓటు హక్కును వినియోగించుకున్న వ్యక్తిగా రుక్కమ్మ నిలిచారు. ఎంతో మందికి రుక్కమ్మ ఆదర్శమని పలువురు నాయకులు ఆమెను కొనియాడారు.