Telangana

News May 13, 2024

HYD: ఓటేసిన 104 ఏళ్ల అవ్వ..!

image

HYD శివారు శంషాబాద్ పరిధి నందిగామ మండలం వీర్లపల్లి గ్రామానికి చెందిన సట్టి రుక్కమ్మ 104 ఏళ్ల వయసులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోనే అత్యధిక వయస్కురాలు ఓటు హక్కును వినియోగించుకున్న వ్యక్తిగా రుక్కమ్మ నిలిచారు. ఎంతో మందికి రుక్కమ్మ ఆదర్శమని పలువురు నాయకులు ఆమెను కొనియాడారు. 

News May 13, 2024

నిజామాబాద్: GREAT.. చేతులు లేకపోయినా ఓటేశాడు

image

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్దపల్లిలో దివ్యాంగుడైన అజ్మీరా రవి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అతడికి రెండు చేతులూ లేకపోవటంతో ఎన్నికల సిబ్బంది వేలికి సిరా చుక్క వేశారు. వైకల్యాన్ని లెక్క చేయకుండా ఓటు వేయడానికి ముందుకు వచ్చిన రవిని పలువురు అభినందిస్తున్నారు.

News May 13, 2024

కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు

image

కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు క్రమ సంఖ్య 4వ నంబర్ కలిగిన టీ షర్టును ధరించి కాంగ్రెస్‌కు ఓటేయాలంటూ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేస్తున్నారని ఎన్నికల సంఘానికి బీజేపీ కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ బోయిన్‌పల్లి ప్రవీణ్ రావు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి రాజేందర్ రావుపై ఎన్నికల సంఘం అధికారులు కేసు నమోదు చేశారు.

News May 13, 2024

జగిత్యాల: తల్లి మృతి.. దుఃఖంలోనూ ఓటేశారు!

image

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన తోకల గంగాధర్ తల్లి మల్లు అనారోగ్యంతో మృతి చెందారు. పుట్టెడు దుఃఖంలో ఉన్నా ఓటు హక్కును గంగాధర్‌తో పాటు ఆయన భార్య ప్రవళిక వినియోగించుకున్నారు. ఓటు వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గంగాధర్ అన్నారు.

News May 13, 2024

ఓటును వినియోగించుకునేందుకు లండన్ నుంచి మెట్‌పల్లికి.. 

image

మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు తనయుడు కొమిరెడ్డి కపిల్ పార్లమెంట్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి లండన్ నుంచి సోమవారం మెట్‌పల్లికి వచ్చారు. పట్టణంలోని పోలింగ్ కేంద్రానికి కుటుంబ సమేతంగా వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

News May 13, 2024

నల్గొండ: తండ్రి చనిపోయిన బాధలోనూ ఓటేసిన మాజీ MLA

image

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తండ్రి మూడు రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే భాదలోనూ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తీవ్ర దుఖంలో ఓటువేసి పలువురి మన్ననలు పొందారు.

News May 13, 2024

@ 5PM వరంగల్ ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 64.08%

image

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు 5 గంటల వరకు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి-65.00%, స్టే.ఘ-74.64%, పాలకుర్తి- 68.41%, పరకాల-70.20%, వర్ధన్నపేట-66.43%, వరంగల్ ఈస్ట్-59.43%, వరంగల్ వెస్ట్-47.00%గా ఉన్నాయి.

News May 13, 2024

@ 5PM: పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 63.86%

image

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు 5 గంటల వరకు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి-73.53%, చెన్నూర్- 68.00%, ధర్మపురి-69.83%, మంచిర్యాల-59.78%, మంథని-61.55%, పెద్దపల్లి- 64.80%, రామగుండం-55.18 శాతంగా ఉన్నాయి. మొత్తం పోలింగ్ 63.86% నమోదైంది. కాగా కరీంనగర్‌లో పోలింగ్ 55.92% నమోదైంది. ఇప్పటికే బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, మంథనిలో పోలింగ్ పూర్తి అయింది.

News May 13, 2024

HYD: ఓటు వేసి ప్రశ్నిద్దాం..!: IPS

image

HYDలో తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ IPS షికా గోయల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. HYD నగరవ్యాప్తంగా ఉన్న పట్టణ ఓటర్లు ఓటు వేసేందుకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఓటు వేసి, సమస్యల పై ప్రశ్నిద్దాం..! అంటూ పిలుపునిచ్చారు.HYD మహానగరంలో 40 శాతానికి మించి ఓటింగ్ శాతం నమోదు కాలేదు.

News May 13, 2024

HYD: ఓటు వేసి ప్రశ్నిద్దాం..!: IPS

image

HYDలో తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ IPS షికా గోయల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. HYD నగరవ్యాప్తంగా ఉన్న పట్టణ ఓటర్లు ఓటు వేసేందుకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఓటు వేసి, సమస్యల పై ప్రశ్నిద్దాం..! అంటూ పిలుపునిచ్చారు.HYD మహానగరంలో 40 శాతానికి మించి ఓటింగ్ శాతం నమోదు కాలేదు.