India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జల్ సంచయ్ జన భాగీదారి కార్యక్రమం కింద కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మంగళవారం నిర్వహించిన వాటర్ సిరీస్ వెబినార్‌లో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో అమలు చేస్తున్న జల సంరక్షణ ఉత్తమ విధానాలను ప్రస్తావించారు. వర్షపు నీటి సంగ్రహణ, సంప్రదాయ జల వనరుల పునరుద్ధరణ, జల్ జీవన్ మిషన్, పీఎంఖెఎస్‌వై వంటి పథకాల సమన్వయంతో భూగర్భ జల మట్టం పెంపుదలపై చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.

మున్సిపల్ <<18974641>>ఎన్నికల నగారా<<>> మోగింది. మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో 75 వార్డులకు 150 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 87,615 మంది ఓటర్లు ఉన్నారు. మెదక్-32 వార్డులు, 37,016 ఓటర్లు, రామాయంపేట-12 వార్డులు, 13,106 ఓటర్లు, నర్సాపూర్-15 వార్డులు, 17,066 ఓటర్లు, తుప్రాన్-16 వార్డులు 20,427 మంది ఓటర్లు ఉన్నారు. కాగా FEB 11న పోలింగ్, 13న ఫలితాలు.

నిజామాబాద్ నగర ఏసీపీ ఎల్. రాజా వెంకటరెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సైబరాబాద్ ఎస్బీ ఏసీపీగా పనిచేస్తున్న బి. ప్రకాష్‌ను నియమిస్తూ డీజీపీ శశిధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 2024 ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టిన రాజా వెంకటరెడ్డి బదిలీ కావడం నగరంలో చర్చనీయాంశమైంది. బదిలీ అయిన ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని అధికారులు ఆదేశించారు.

సాయుధ పోరాటమే స్వాతంత్ర్యానికి మార్గమని విశ్వసించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. యుద్ధ విద్యలో ఆరితేరిన అల్లూరి ఆంగ్లేయుల అరాచకాలపై ఆయుధాలు ఎక్కుపెట్టారు. మన్యం గిరిజనుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా గర్జించారు. మహిళల అవమానాలపై తెల్లదొరల అరాచకానికి ఎదిరించి తిరగబడ్డారు. గెరిల్లా దాడులతో పోలీస్‌స్టేషన్లపై పిడుగులా విరుచుకుపడ్డారు. ప్రజల కోసం లొంగిన అల్లూరిని ఆంగ్లేయులు అతి కిరాతకంగా హతమార్చారు.

మెదక్ జిల్లాలో వన్య ప్రాణుల లెక్క తేలింది. జిల్లాలోని 6 రేంజ్‌ల పరిధిలో 51 మాంసాహార జంతువులు గుర్తించినట్లు డీఎఫ్ఓ జోజి పేర్కొన్నారు. రేంజ్‌ల వారీగా మాంసాహార జంతువులు మెదక్-16, రామాయంపేట-9, తుప్రాన్-5, నర్సాపూర్-6, కౌడిపల్లి-12, పెద్దశంకరంపేట-3 ఉన్నట్లు తెలిపారు. సర్వేలో 71 మంది అటవీ సిబ్బంది, 143 మంది వాలంటీర్లు పాల్గొన్నారని చెప్పారు.

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర నేటితో ముగిసింది. 9రోజులుగా కొనసాగిన నాగోబా జాతర ఉట్నూర్ మండలం శ్యాంపూర్ బుడుం దేవతకు పవిత్ర గంగాజలంతో ఆదివారం మహా పూజ నిర్వహించి జాతరను ప్రారంభించారు. అనంతరం “ఝరి” తాలిని భద్రపరిచేందుకు మేస్రం వంశీయులు కాలినడకతో కేస్లాపూర్‌లోని శాంతి నిలయానికి చేరుకొని మెస్రం వంశీయులు కలశం (జారీ)దేవతకు ప్రత్యేక పూజలు చేసి నాగోబా జాతరకు ముగింపు పలికారు.

పాలమూరు విశ్వవిద్యాలయంలో జరుగుతున్న మూడో సెమిస్టర్ పరీక్షా కేంద్రాలను మంగళవారం ఉపకులపతి (VC) శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశ్నపత్రాల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఉమ్మడి జిల్లాలోని ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు RCO అరుణకుమారి తెలిపారు. CBSE సిలబస్‌లో బోధన ఉంటుందన్నారు. భద్రాద్రిలోని ములకలపల్లి, గండుగులపల్లి, గుండాల, చర్ల, దుమ్ముగూడెం, పాల్వంచ, టేకులపల్లితో ఖమ్మంలోని సింగరేణి పాఠశాలలో 480 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఫిబ్రవరి 20 వరకు అప్లై చేసుకోవాలని, మార్చి 29న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

కరీంనగర్ జిల్లా కాకతీయ కాలువలో ఒకేరోజు రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. చిగురుమామిడి మండలం నవాబుపేటకు చెందిన వివేక్ రెండు రోజుల క్రితం అదృశ్యం అవ్వగా.. నేడు సైదాపూర్ మండలం సోమారం శివారులోని కాకతీయ కాలువలో అతని మృతదేహం లభ్యమైంది. శంకరపట్నం మండలం కరింపేటకి చెందిన సాదుల అనిల్ మూడు రోజుల క్రితం కాకతీయ కాలువలో గల్లంతవ్వగా.. సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామ శివారులో అనిల్ మృతదేహం లభ్యమైంది.

మేడారం జాతర ప్రభావం భాగ్యనగర రవాణా వ్యవస్థపై పడింది. సమ్మక్క-సారలమ్మ మహాజాతర కోసం గ్రేటర్ పరిధిలోని సుమారు 50 శాతం సిటీ బస్సులను ప్రత్యేక సర్వీసులుగా మళ్లించడంతో నగరంలో రద్దీ పెరిగింది. కార్యాలయాలు, విద్యాసంస్థలకు వెళ్లే వారు బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బస్సులు కిక్కిరిసిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Sorry, no posts matched your criteria.