Telangana

News May 13, 2024

BREAKING: HYD: పోలింగ్ కేంద్రంలో మహిళ మృతి!

image

HYD ఉప్పల్ భరత్ నగర్ ప్రాంతానికి చెందిన గట్టు విజయలక్ష్మి స్థానిక ఆంధ్ర యువత మండలి ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి వచ్చారు. ఈ క్రమంలో ఆమె పోలింగ్ స్టేషన్‌లోనే ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే పోలింగ్ సిబ్బంది ఆమెను అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆమెను పరీక్షించగా గుండెపోటుతో మరణించినట్లుగా నిర్ధారించారు. ఈ మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

News May 13, 2024

ఖమ్మం ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ శాతం (63.67%)

image

ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఓవరాల్‌గా 63.67%శాతం నమోదైంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతమిలా. ఖమ్మం – 51.18, పాలేరు -67.95, మధిర -68.83, వైరా-67.79, సత్తుపల్లి-67.44, కొత్తగూడెం -60.92, అశ్వారావుపేట- 68.88

News May 13, 2024

BREAKING: HYD: పోలింగ్ కేంద్రంలో మహిళ మృతి!

image

HYD ఉప్పల్ భరత్ నగర్ ప్రాంతానికి చెందిన గట్టు విజయలక్ష్మి స్థానిక ఆంధ్ర యువత మండలి ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి వచ్చారు. ఈ క్రమంలో ఆమె పోలింగ్ స్టేషన్‌లోనే ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే పోలింగ్ సిబ్బంది ఆమెను అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆమెను పరీక్షించగా గుండెపోటుతో మరణించినట్లుగా నిర్ధారించారు. ఈ మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

News May 13, 2024

మల్కాజిగిరిలో పార్లమెంట్ పరిధిలో ఓటింగ్ శాతం ఇలా..

image

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధి 7 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు నమోదైన ఓటింగ్ వివరాలను అధికారులు వెల్లడించారు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు కేంద్రానికి తరలిరావాలని పిలుపునిచ్చారు.
1. కూకట్‌పల్లి-25.12
2. ఎల్బీనగర్-26.74
3. మల్కాజిగిరి- 21.70
4. కుత్బుల్లాపూర్-28.36
5. సికింద్రాబాద్ కంటోన్మెంట్-29.03
6. ఉప్పల్- 26.25
7. మేడ్చల్-34.90

News May 13, 2024

చేవెళ్ల పరిధిలో ఇప్పటి వరకు 34.56% ఓటింగ్ నమోదు

image

చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ వివరాలను అధికారులు వెల్లడించారు. ఇంట్లో ఉన్న ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయాలని కోరారు.
✓1. చేవెళ్ల- 43.1
✓2. మహేశ్వరం- 31.84
✓3. పరిగి- 43.57
✓4. రాజేంద్రనగర్- 31.49
✓5. శేర్లింగంపల్లి- 27.49
✓6. తాండూరు- 41.05
✓ 7. వికారాబాద్ – 45.16

News May 13, 2024

HYD: ఓటేసిన రాచకొండ సీపీ

image

సికింద్రాబాద్ పరిధి గోపాలపురంలో ఉన్న St.ప్యాట్రిక్ స్కూల్‌లో రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రజలు భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని సూచించారు. పకడ్బందీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు.

ఖమ్మంలో ఓటేసిన ట్రాన్స్‌జెండర్స్

image

ఖమ్మంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పట్టణంలోని రాజేంద్రనగర్ జెడ్పీ హైస్కూల్‌ పోలింగ్ కేంద్రంలో ట్రాన్స్‌జెండర్స్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ ఒకేసారి క్యూలైన్‌లో వచ్చి ఓటు వేశారు. తమను కూడా ప్రతి ఒక్కరూ గౌరవించాలని వారు కోరారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వం కల్పిస్తున్న ఓటు హక్కును వినియోగించుకుని మంచి ప్రభుత్వాన్ని ఎంచుకోవాలని ట్రాన్స్‌జెండర్లు సూచించారు.

News May 13, 2024

@ 1PM: పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 44.40%

image

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి-50.42%, చెన్నూర్-45.45, ధర్మపురి-47.15%, మంచిర్యాల-41.40%, మంథని-48.21%, పెద్దపల్లి-44.40%, రామగుండం-38.78 శాతంగా ఉన్నాయి. మొత్తం పోలింగ్ 44.40% నమోదైంది. కాగా కరీంనగర్‌లో పోలింగ్ 45.11% నమోదైంది.

News May 13, 2024

మహబూబాబాద్ ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 48.81%

image

మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇలా ఉన్నాయి. భద్రాచలం-49.54%, డోర్నకల్-53.71%, మహబూబాబాద్-47.52%, ములుగు-50.66%, నర్సంపేట-43.60%, పినపాక-49.82%, ఇల్లందు-47.58%గా ఉన్నాయి.