Telangana

News May 13, 2024

HYD: ఈవీఎంల మొరాయింపు.. తిరిగి వెళ్లిపోతున్నారు..!

image

HYD, ఉమ్మడి RR జిల్లాల పరిధిలో ఈవీఎంలు మొరాయిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. జూబ్లీహిల్స్, ఉప్పల్, మల్కాజిగిరి, జవహర్‌నగర్, షాద్‌నగర్ తదితర చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో గంటల తరబడి ఓటర్లు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారుల పనితీరుపై ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తూ ఇంటికి తిరిగి వెళ్తున్నారు. తాము ఓటేసేందుకు వస్తే ఈవీఎంలు పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News May 13, 2024

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలింగ్ బహిష్కరణ

image

భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లచ్చగూడెంలో గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. గ్రామ సమస్యలు పరిష్కరించలేదని.. ఓటు వేసేది లేదని వారు చెబుతున్నారు. సాగు, తాగు నీరు లేక ఇబ్బంది పడుతున్నట్లు అవేదన వ్యక్తం చేశారు.

News May 13, 2024

వరంగల్: ఓటేసిన మంత్రి కొండా సురేఖ

image

మంత్రి కొండా సురేఖ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మెరుగైన సమాజం, దేశ భవిష్యత్తు కోసం రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకొని తమ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

News May 13, 2024

వరంగల్ ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ శాతం (24.18%)

image

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు ఉదయం 11 గంటల వరకు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి-26.00%, స్టే.ఘ-30.40%, పాలకుర్తి-27.20%, పరకాల-27.56%, వర్దన్నపేట-22.50%, వరంగల్ ఈస్ట్-18.50%, వరంగల్ వెస్ట్-18.24శాతంగా ఉన్నాయి.

News May 13, 2024

పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ శాతం (26.17%)

image

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు ఉదయం 11 గంటల వరకు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి-30.52%, చెన్నూర్-26.35, ధర్మపురి-28.11%, మంచిర్యాల-24.87%, మంథని-27.45%, పెద్దపల్లి-25.57%, రామగుండం-21.46శాతంగా ఉన్నాయి.

News May 13, 2024

NZB పార్లమెంట్‌లో 11 గంటలకు 28.26% పోలింగ్

image

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉదయం 11 గంటల వరకు 28.26 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు నిజామాబాద్ రూరల్ 28.77, నిజామాబాద్ అర్బన్ 23.04, ఆర్మూర్ 28.39, బోధన్ 29.46, బాల్కొండ 30.53, కోరుట్ల 29.10, జగిత్యాల 30.10 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వివరించారు.

News May 13, 2024

కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ శాతం (26.14%)

image

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు ఉదయం 11 గంటల వరకు ఇలా ఉన్నాయి.
చొప్పదండి-29.09%, హుస్నాబాద్-30.35%, హుజూరాబాద్-22.89%, కరీంనగరర్-20.78%, మానకొండూర్-24.96%, సిరిసిల్ల-27.80%, వేములవాడ-30.17శాతంగా ఉన్నాయి.

News May 13, 2024

MBNRలో 26.99.. NGKLలో 27.74 శాతం పోలింగ్

image

ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ఉ. 11గం. వరకు MBNR పరిధిలో 26.99, నాగర్ కర్నూల్‌లో 27.74 పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ వివరాలు ఇలా..⏵నాగర్‌కర్నూల్- 26.12, వనపర్తి- 29.46, గద్వాల- 29.53, ఆలంపూర్- 30.46, అచ్చంపేట- 25.32, కల్వకుర్తి- 28.46, కొల్లాపూర్- 24.50⏵మహబూబ్‌నగర్-25.23, జడ్చర్ల-29.80, దేవరకద్ర-29.75, నారాయణపేట-24.32, మక్తల్-25.11, షాద్‌నగర్-25.69, కొడంగల్-29.32 శాతం నమోదైంది.

News May 13, 2024

HYD: ఉ.11 గంటల వరకు పోలింగ్ ఎంతంటే?

image

HYD, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ ఎలక్షన్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉ.11 గంటల వరకు HYDలో 10.70, మల్కాజిగిరిలో 15.05, సికింద్రాబాద్ 15.77, చేవెళ్ల 20.35 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 16.34 శాతం పోలింగ్ నమోదైంది. ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపునిచ్చారు. ‌

News May 13, 2024

HYD: ఉ.11 గంటల వరకు పోలింగ్ ఎంతంటే?

image

HYD, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ ఎలక్షన్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉ.11 గంటల వరకు HYDలో 10.70, మల్కాజిగిరిలో 15.05, సికింద్రాబాద్ 15.77, చేవెళ్ల 20.35 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 16.34 శాతం పోలింగ్ నమోదైంది. ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపునిచ్చారు. ‌