Telangana

News May 13, 2024

WGL-HYD జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

image

WGL-HYD జాతీయ రహదారి.. రఘునాథపల్లి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొని టిఫిన్ చేస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 13, 2024

కడెం: ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్థులు

image

నిర్మల్ జిల్లా కడెం మండలంలోని అల్లంపల్లి, బాబా నాయక్ తండ గ్రామాస్థులు ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదని.. పలుమార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోలేదన్నారు. గ్రామాలకు రోడ్డు ఏర్పాటు చేస్తామని ఉన్నతాధికారులు హామీ ఇస్తేనే ఓట్లు వేస్తామని గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రెండు గ్రామాల్లో కలిపి ఒకటే ఓటు నమోదైంది.

News May 13, 2024

ఉమ్మడి వరంగల్‌లో ఈ గ్రామాలు SPECIAL

image

ఉమ్మడి WGLలోని ఈ గ్రామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. వాజేడు మండలం బొల్లారానికి చెందిన 219 మంది దాదాపు 6కి.మీ దూరంలోని ఆర్.గుంటపల్లిలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఓటేస్తున్నారు. వెంకటాపురం మం.లోని పెంకవాగు, కలిపాక, కొత్తగుంపు గ్రామాల్లోని 433 మంది 6-7 కి.మీ దూరంలోని ఆలుబాక వెళ్లి ఓటేస్తున్నారు. మంగపేట మం. రేగులగూడెంలోని 150 మంది 4కి.మీ దూరం వెళ్లి తొండ్యాల-లక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఓటేస్తారు.

News May 13, 2024

MBNRలో 10.33.. NGKLలో 9.18 శాతం పోలింగ్

image

ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ఉ. 9గం. వరకు MBNR పరిధిలో 10.33, నాగర్ కర్నూల్‌లో 9.18 పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ వివరాలు ఇలా..⏵నాగర్‌కర్నూల్- 8.65, వనపర్తి- 11.46, గద్వాల- 9.23, ఆలంపూర్- 9.42, అచ్చంపేట- 8.13, కల్వకుర్తి- 11.31, కొల్లాపూర్- 10.31⏵మహబూబ్‌నగర్-10.87, జడ్చర్ల-11.32, దేవరకద్ర-12.25, నారాయణపేట-9.40, మక్తల్-8.07, షాద్‌నగర్-9.25, కొడంగల్-11.19 శాతం నమోదైంది.

News May 13, 2024

నల్గొండ, భువనగిరి MP ఓటింగ్ శాతమిలా..

image

నల్గొండ, భువనగిరి ఎంపీ సెగ్మెంట్ల పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు ఓవరాల్‌గా నల్గొండలో 12.80%, భువనగిరిలో 10.54శాతం పోలింగ్ నమోదైంది. అసెంబ్లీల వారీగా పోలింగ్ శాతమిలా.. ఇబ్రహీంపట్నం-8.79,మునుగోడు -13.32, భువనగిరి -9.13, NKG -10.86, తుంగతుర్తి -10.65, ఆలేరు -10.53, జనగామ -10.84, NLG -15.15, DVK-12.47, సాగర్ -13.30, MLG -12.55, HNR-12.11, KDD-13.49, SRPT-10.55.

News May 13, 2024

మెదక్‌లో 10.99.. జహీరాబాద్‌లో 12.88 శాతం పోలింగ్

image

ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ఉ. 9గంటల వరకు మెదక్ పరిధిలో 10.99, జహీరాబాద్‌లో 12.88 పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ వివరాలు ఇలా..
⏵ మెదక్-12, నర్సాపూర్-12.24, సంగారెడ్డి-10.14, పటాన్‌చెరు-9.15, సిద్దిపేట-11.10, దుబ్బాక-13.06, గజ్వేల్- 11.12,
⏵జహీరాబాద్-11.84, ఆందోల్-11.48, నారాయణ్‌ఖేడ్-12.71, జుక్కల్-12.58, బాన్సువాడ-15.71, ఎల్లారెడ్డి-14.17, కామారెడ్డి-12.49 శాతం నమోదైంది.

News May 13, 2024

ఖమ్మం ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ శాతం (12.24%)

image

ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు ఓవరాల్‌గా 12.24శాతం నమోదైంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతమిలా..
ఖమ్మం – 11.08,
పాలేరు -11.65,
మధిర -13.79,
వైరా-11.65,
సత్తుపల్లి-15.61,
కొత్తగూడెం-10.75,
అశ్వారావుపేట- 11.16.

News May 13, 2024

ఓటు వేసిన బీజేపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్

image

కరీంనగర్‌లోని జ్యోతి నగర్లో గల సాధన హై స్కూల్‌లో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఆయన సతీమణి అపర్ణతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారితో పాటు తల్లి, కుమారుడు ఓటు వేశారు. అంతకముందు మహాశక్తి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం జ్యోతినగర్‌లోని తన నివాసానికి వెళ్లి హంపి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతీ స్వామి వారిని దర్శించుకున్నారు.

News May 13, 2024

పెద్దపల్లి పార్లమెంట్ ఎలక్షన్ అప్‌డేట్

image

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు ఉదయం 9 గంటల వరకు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి-12.12%, చెన్నూర్-9.49, ధర్మపురి-8.70%, మంచిర్యాల-10.49%, మంథని-102.%, పెద్దపల్లి-8.42%, రామగుండం-7.64శాతంగా ఉన్నాయి.

News May 13, 2024

కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్ అప్‌డేట్

image

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు ఉదయం 9 గంటల వరకు ఇలా ఉన్నాయి.
చొప్పదండి-10.90%, హుస్నాబాద్-11.84, హుజూరాబాద్-9.45%, కరీంనగర్-10.23%, మానకొండూర్-10.06%, సిరిసిల్ల-7.23%, వేములవాడ-12.10శాతంగా ఉన్నాయి.