Telangana

News May 13, 2024

వరంగల్ ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ శాతం (8.97%)

image

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు ఉదయం 9 గంటల వరకు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి-9.00%, స్టే.ఘ-13.00, పాలకుర్తి-10.24%, పరకాల-9.75%, వర్దన్నపేట-8.10%, వరంగల్ ఈస్ట్-6.70%, వరంగల్ వెస్ట్-6.50శాతంగా ఉన్నాయి.

News May 13, 2024

HYD: ఉ.9 గంటల వరకు పోలింగ్ ఎంతంటే?

image

HYD, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ ఎలక్షన్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉ.9 గంటల వరకు HYDలో 5.06, మల్కాజిగిరిలో 6.20, సికింద్రాబాద్ 5.40, చేవెళ్ల 8.29 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 6.28 శాతం పోలింగ్ నమోదైంది. ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపునిచ్చారు. ‌

News May 13, 2024

HYD: ఉ.9 గంటల వరకు పోలింగ్ ఎంతంటే?

image

HYD, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ ఎలక్షన్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉ.9 గంటల వరకు HYDలో 5.06, మల్కాజిగిరిలో 6.20, సికింద్రాబాద్ 5.40, చేవెళ్ల 8.29 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 6.28 శాతం పోలింగ్ నమోదైంది. ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపునిచ్చారు. ‌

News May 13, 2024

మహబూబాబాద్ ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ శాతం (11.94%)

image

మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు ఉదయం 9 గంటల వరకు ఇలా ఉన్నాయి. భద్రాచలం-12.07%, డోర్నకల్-14.60, మహబూబాబద్-11.65%, ములుగు-11.38, నర్సంపేట-11.20, పినపాక-11.95, ఇల్లందు-11.90శాతంగా ఉన్నాయి.

News May 13, 2024

WGL: ఓవైపు వర్షం… మరోవైపు పోలింగ్

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. ఓ వైపు వర్షం.. మరోవైపు నేడు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో.. జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు కూలిపోయి కరెంట్ లేక పలు సమస్యలు తలెత్తాయి. వర్షం నీరు భారీగా నిలిచి ఓటర్లు చాలా చోట్ల ఇబ్బందులు పడుతున్నారు వర్షం, ఎండల నేపథ్యంలో ఉదయమే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు.

News May 13, 2024

ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

image

భారత రాజ్యాంగం రూపొందించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. సోమవారం వరంగల్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తొర్రూరు హైస్కూల్‌లో 258వ బూతులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

News May 13, 2024

ఆలంపూర్: ఓటేసిన BRS అభ్యర్థి RSP

image

లోక్ సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆలంపూర్ పట్టణంలోని పోలింగ్ బూత్ నంబర్ 272లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఓటరు విధిగా తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ, వెంకట్ రామయ్య శెట్టి పాల్గొన్నారు.

News May 13, 2024

సజావుగా పోలింగ్.. పర్యవేక్షిస్తున్న రాహుల్ రాజ్ రాహు

image

మెదక్ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగానికి ఉదయం నుంచి ఓటర్లు బారులు తీరారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్, మెదక్ ఐడీఓసీ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో నిర్ణీత సమయానికి అన్ని పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

News May 13, 2024

KNR: ఓటేసిన BRS ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్

image

కరీంనగర్‌లోని ముకరంపురలో గల ఉర్దూ ఉన్నత పాఠశాలలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఆయన సతీమణి డాక్టర్ బోయినపల్లి మాధవితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారితో పాటు కుమారులు ప్రతీక్, ప్రణయ్ కోడలు హర్షిణి ఓటు వేశారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు.

News May 13, 2024

BREAKING.. ఖమ్మం జిల్లాలో పోలింగ్ బహిష్కరణ

image

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాయమాదారంలో గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. ఎన్ఎస్పీ కాలువపై బ్రిడ్జి నిర్మించలేదని.. ఓటు వేసేది లేదని వారు చెబుతున్నారు.