Telangana

News May 13, 2024

BREAKING.. యాదాద్రి: ఎన్నికల బహిష్కరణ

image

యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామస్థులు ఎన్నికలు బహిష్కరించారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ధర్నా చేశారు. స్పష్టమైన హామీ ఇస్తేనే ఓటు వేస్తామని పోలింగ్ కేంద్రం వద్ద నిరసన చేపట్టారు.

News May 13, 2024

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పోలింగ్

image

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా మూడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోనికి వస్తుంది. జిల్లాలోని జనగామ అసెంబ్లీ నియోజకవర్గం భువనగిరి పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. ములుగు, మహబూబాబాద్, నర్సంపేట, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాలు మహబూబాబాద్ పరిధిలోకి, మిగిలిన ఏడు నియోజకవర్గాలు వరంగల్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి.

News May 13, 2024

WGL: ఎన్నికలు.. ఇలా చేస్తే కేసుల్లో ఇరుక్కుంటారు

image

లోక్‌సభ ఎన్నికల వేళ పోలింగ్‌ కేంద్రాల వద్ద యువత జాగ్రత్తగా వ్యవహరించాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. ఇలా చేయకండి. ⏵ఓటర్లను ప్రైవేటు వాహనాల్లో పోలింగ్‌ కేంద్రాలకు తరలింపు
⏵శాంతి భద్రతల ఆటంకం
⏵ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం
⏵ఓటర్లకు నగదు, బహుమతుల పంపిణీ
⏵మాదకద్రవ్యాలు పంచడం, తరలించడం
⏵రెచ్చగొట్టే ప్రసంగాలు, దాడులు
⏵అసత్య వార్తలు వ్యాప్తి

News May 13, 2024

ఓటు వేసిన పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి

image

పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంచిర్యాలలోని మార్కెట్ రోడ్‌లో ఉన్న పాఠశాలలో తన తల్లి సరోజ వివేకానందతో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

.

News May 13, 2024

ఓటు హక్కు వినియోగించుకున్న ఎర్రబెల్లి దంపతులు

image

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన సతీమణి ఎర్రబెల్లి ఉషాతో కలిసి ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎర్రబెల్లి కోరారు.

News May 13, 2024

HYDలో విషాదం.. ఎలక్షన్‌ ఆఫీసర్ మృతి

image

గుండెపోటుతో ఎలక్షన్ ఆఫీసర్ మృతి చెందిన ఘటన HYDలో వెలుగుచూసింది. చంపాపేట్‌ మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నరసింహ MP ఎన్నికల నేపథ్యంలో రెడ్‌హిల్స్‌‌లోని కేంద్రానికి ఆదివారం సా. పోలింగ్ సామాగ్రితో విధులకు హాజరయ్యారు. ఉక్కపోతగా ఉందని ఓ ఫ్యాన్ వద్ద కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఇతర సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.

News May 13, 2024

HYDలో విషాదం.. ఎలక్షన్‌ ఆఫీసర్ మృతి

image

గుండెపోటుతో ఎలక్షన్ ఆఫీసర్ మృతి చెందిన ఘటన HYDలో వెలుగుచూసింది. చంపాపేట్‌ మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నరసింహ MP ఎన్నికల నేపథ్యంలో రెడ్‌హిల్స్‌‌లోని కేంద్రానికి ఆదివారం సా. పోలింగ్ సామాగ్రితో విధులకు హాజరయ్యారు. ఉక్కపోతగా ఉందని ఓ ఫ్యాన్ వద్ద కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఇతర సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.

News May 13, 2024

కరీంనగర్: ఉమ్మడి జిల్లాలో పోలింగ్ షురూ

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమయ్యింది. ఓటర్లు పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూ కట్టారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. కాగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగియనుంది. 

News May 13, 2024

ADB: పోలింగ్ ప్రారంభం.. ఇవి తప్పనిసరి..!

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఓటు వెయ్యడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లే వారు ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకెళ్లాలని ఎన్నికల అధికారులు సూచించారు. ఓటరు ఐడీ, ఆధార్ కార్డు, జాబ్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఫొటోతో ఉన్న పోస్టాఫీస్ పాస్ బుక్, పాన్ కార్డు, లేబర్ గుర్తింపు కార్డు, పాస్ పోర్ట్, దివ్యాంగుల కార్డు వంటి వాటిలో ఏదైనా ఒకటి తప్పనిసరి.

News May 13, 2024

మెదక్: 4.54 లక్షల యువ ఓటర్లు

image

మెదక్ లోక్ సభ పరిధిలో మొత్తం 18.28 లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో 29 ఏళ్ల వరకు 4.54 లక్షల మంది ఉన్నారు. వీరి ఓటు కీలకం కానుంది. 18-19 ఏళ్ల లోపు వారు 55,947 మంది ఉన్నారు. వీరిలో పలువురు తొలిసారి ఓటు వేయనున్నారు. ఓటర్లలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉన్నారు. 9.25 లక్షల మంది అతివలు గెలుపును ప్రభావితం చేయనున్నారు.