Telangana

News January 18, 2026

సీపీఐ 100 ఏళ్ల పండుగకు సీఎం

image

ఖమ్మంలో నేడు జరిగే సీపీఐ శతవసంతాల ముగింపు సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు బీజేఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో జరిగే సీపీఐ శతాబ్ది ఉత్సవ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. కాగా ఈ సభకు రావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం సీఎంకు ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే. మిత్రపక్షం ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి సభకు వెళ్తున్నారు.

News January 18, 2026

హైదరాబాద్ మళ్లీ ‘ఆమె’దే!

image

త్వరలో ఎన్నికలు జరగనున్న జీహెచ్ఎంసీ కొత్త పాలక మండలిలో మేయర్‌గా మరోసారి మహిళే ఎన్నిక కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల ఛైర్మన్లు, మేయర్లకు శనివారం లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. పది మున్సిపల్ కార్పొరేషన్లకు గానూ జీహెచ్ఎంసీకి మహిళ (జనరల్) రిజర్వు కావడంతో రాబోయే పాలకమండలిలోనూ హైదరాబాద్‌లో మహిళే చక్రం తిప్పనున్నారు.

News January 18, 2026

రద్దీ దృష్ట్యా రహదారులపై నిఘా: ఎస్పీ

image

సంక్రాంతి సెలవుల ముగింపుతో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యే ప్రయాణికుల కోసం జిల్లా పోలీసులు సమగ్ర ఏర్పాట్లు చేశారు. 450 మంది సిబ్బందితో నిరంతర పర్యవేక్షణ, డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేపట్టినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. టోల్ ప్లాజాలు, కూడళ్ల వద్ద ప్రత్యేక బలగాలను మోహరించామన్నారు. అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచామని, వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని కోరారు.

News January 18, 2026

NZB: వారం రోజుల్లో 99 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో 99 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. వారి కోర్టుల్లో హాజరు పరచగా ఇందులో ముగ్గురికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించగా, రూ.5,80,000 జరిమానా విధించారన్నారు. కాగా మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ప్రజలకు కమిషనర్ సూచించారు సూచించారు.

News January 18, 2026

ఖమ్మం 45 ఏళ్ల నిరీక్షణకు సీఎం తెరదించేనా.. ?

image

ఖమ్మంలో ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న 45 ఏళ్ల నిరీక్షణకు తెరపడాలని విద్యావంతులు కోరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేటి పర్యటన నేపథ్యంలో చారిత్రక ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలను వర్సిటీగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి అనుమతి లభించినా, ఖమ్మంలో జనరల్ వర్సిటీ అవసరమని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

News January 18, 2026

ఖమ్మం: ట్రాన్స్‌జెండర్ల స్వయం ఉపాధికి చేయూత

image

ఖమ్మం జిల్లాలో ట్రాన్స్‌జెండర్ల స్వయం ఉపాధి కోసం 100% సబ్సిడీతో రూ. 75 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి విజేత తెలిపారు. 18-55 ఏళ్ల వయస్సు ఉండి, కలెక్టర్ జారీ చేసిన ఐడీ కార్డు ఉన్నవారు అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షలు, పట్టణాల్లో రూ. 2 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉండాలి. ఆసక్తి గలవారు ఈ నెల 25లోపు జిల్లా సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News January 18, 2026

FLASH.. HYD: భార్యను కత్తితో పొడిచిన భర్త

image

మానవ సంబంధాలు దారి తప్పుతున్నాయి. HYD శివారు, దుండిగల్ PS పరిధి డి.పోచంపల్లిలో డాక్టర్ బస్తీలో దారుణం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మద్యానికి బానిసైన భర్త సాదుల్లా, భార్య సాహిని(30)ని తాగడానికి డబ్బులు అడిగాడు. ఆమె నిరాకరించడంతో విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలైన ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News January 18, 2026

NLG: మేయర్ పీఠంపై మూడు పార్టీల గురి!

image

NLG కార్పొరేషన్ మేయర్ పీఠం జనరల్ మహిళకు కేటాయించడంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారనుంది. దీంతో అధికార పార్టీతో పాటు అటు BRS, ఇటు BJPలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. 33వ వార్డు నుంచి మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి భార్య చైతన్య, BRS మాజీ ఛైర్మన్ సైదిరెడ్డి ఆయన భార్యను పోటీలో నిలుపుతుండగా, BJP నుంచి పిల్లి రామరాజు భార్య సత్యవతి 8వ వార్డు నుంచి పోటీ చేయనున్నారు.

News January 18, 2026

రంగారెడ్డి జిల్లాలో మహిళలకు 62 స్థానాలు

image

రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల పరిధిలో 126 వార్డులు ఉన్నాయి. వీటిలో ఆమనగల్లులో 15, చేవెళ్లలో 18, ఇబ్రహీంపట్నంలో 24, మొయినాబాద్‌లో 26, షాద్‌నగర్‌లో 28, శంకర్‌పల్లిలో 15 వార్డులు ఉన్నాయి. వీటిలో ST మహిళ, SC మహిళ, BC మహిళ, అన్‌రిజర్వ్‌డ్ మహిళలకు 62 స్థానాలు దక్కాయి. ఆమనగల్లులో 7, చేవెళ్లలో 9, ఇబ్రహీంపట్నంలో 12, మొయినాబాద్‌లో 13, షాద్‌నగర్‌లో 14, శంకర్‌పల్లిలో 7వార్డులు మహిళలకు కేటాయించారు.

News January 18, 2026

NLG: మారిన రిజర్వేషన్లు.. డివిజన్ల కోసం సెర్చింగ్!

image

NLG కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీల్లోనూ రిజర్వేషన్‌లు మారిపోయాయి. తాము పోటీచేసిన స్థానంలో అనుకూలమైన రిజర్వేషన్ కాకుండా మహిళలకు వచ్చిన స్థానాలు ఉన్నాయి. అలాంటి చోట్ల తమ సతీమణులను బరిలో నిలిపేందుకు సిద్ధం అవుతున్నారు. NLG కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీల్లోనూ గతంలో పోటీ చేసి గెలిచిన స్థానాల్లో ఈ సారి రిజర్వేషన్లు మారిపోయాయి. దీంతో తమకు అనుకూలమైన డివిజన్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.