Telangana

News May 13, 2024

KMM: ఎన్నికలు.. ఇలా చేస్తే కేసుల్లో ఇరుక్కుంటారు

image

లోక్‌సభ ఎన్నికల వేళ పోలింగ్‌ కేంద్రాల వద్ద యువత జాగ్రత్తగా వ్యవహరించాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. ఇలా చేయకండి. ⏵ఓటర్లను ప్రైవేటు వాహనాల్లో పోలింగ్‌ కేంద్రాలకు తరలింపు ⏵శాంతి భద్రతల ఆటంకం ⏵ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం ⏵ఓటర్లకు నగదు, బహుమతుల పంపిణీ ⏵మాదకద్రవ్యాలు పంచడం, తరలించడం ⏵రెచ్చగొట్టే ప్రసంగాలు, దాడులు ⏵అసత్య వార్తలు వ్యాప్తి

News May 13, 2024

NLG: ఎన్నికలు.. ఇలా చేస్తే కేసుల్లో ఇరుక్కుంటారు

image

లోక్‌సభ ఎన్నికల వేళ పోలింగ్‌ కేంద్రాల వద్ద యువత జాగ్రత్తగా వ్యవహరించాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. ఇలా చేయకండి.
⏵ఓటర్లను ప్రైవేటు వాహనాల్లో పోలింగ్‌ కేంద్రాలకు తరలింపు
⏵శాంతి భద్రతల ఆటంకం
⏵ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం
⏵ఓటర్లకు నగదు, బహుమతుల పంపిణీ
⏵మాదకద్రవ్యాలు పంచడం, తరలించడం
⏵రెచ్చగొట్టే ప్రసంగాలు, దాడులు
⏵అసత్య వార్తలు వ్యాప్తి

News May 13, 2024

HYD: ఓటుకు సిద్ధమైన నగరం

image

రాజధాని నగరం ఓటుకు సిద్ధమైంది. కోటి పదిలక్షల మంది ఓటర్లు హక్కును వినియోగించుకోనున్నారు. HYD, SEC, చేవెళ్ల, మల్కాజిగిరి MP స్థానాల్లో 140 మంది ఎంపీ అభ్యర్థులు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేందుకు భారీ ఏర్పాట్లు చేసినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

News May 13, 2024

HYD: ఓటుకు సిద్ధమైన నగరం

image

రాజధాని నగరం ఓటుకు సిద్ధమైంది. కోటి పదిలక్షల మంది ఓటర్లు హక్కును వినియోగించుకోనున్నారు. HYD, SEC, చేవెళ్ల, మల్కాజిగిరి MP స్థానాల్లో 140 మంది ఎంపీ అభ్యర్థులు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేందుకు భారీ ఏర్పాట్లు చేసినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

News May 13, 2024

MBNR, NGKL: ఓటు వేయనున్న 34.20 లక్షల మంది

image

ఉమ్మడి జిల్లాలో నేడు 34.20 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. MBNR పరిధిలో 16,82,470, NGKL పరిధిలో 17,38,254 మంది పోలింగ్‌లో పాల్గొనున్నారు. 2 నియోజకవర్గాల్లో మొత్తం 3,993 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా.. 15,876 మంది విధుల్లో పాల్గొంటున్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో సుమారు 2లక్షలకుపైగా వలస ఓటర్లు ఉన్నారు. వీరంతా ఓటింగ్‌లో పాల్గొంటే పోలింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉంది.

News May 13, 2024

కరీంనగర్: పోలింగ్ సర్వం సిద్ధం

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 33 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

News May 13, 2024

వరంగల్: పట్టణాల్లో తక్కువ, పల్లెల్లో ఎక్కువ

image

గతేడాది జరిగిన అసెబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి WGL 12 అసెంబ్లీ స్థానాల్లోని WGL తూర్పు, పశ్చిమ మినహా మిగతా 10స్థానాల్లోని చాలా కేంద్రాల్లో 90%పైగా ఓటింగ్ నమోదైంది. ఈ క్రమంలోనే 1952 నుంచి 2019 వరకు WGL లోక్‌సభ స్థానంలో 2014లో 76.39% అత్యధికంగా 1952లో అత్యల్పంగా 51.03% నమోదయింది. MHBD స్థానంలో 1957లో అత్యల్పంగా(53.82), 2014లో 81.05% ఓటేశారు. పట్టణాల్లో విద్యావంతులున్నా పల్లెల్లోనే ఓటింగ్ శాతం ఎక్కువ ఉంది.

News May 13, 2024

NZB: ఓటు వేయాడానికి ఇవి తప్పనిసరి..!

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఓటర్లు తమ ఓటు వినియోగించుకోవడానికి కిందివాటిలో ఏదైనా ఒక ఐడీ కార్డు తీసుకెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్, జాబ్ కార్డ్, ఫొటోతో ఉన్న పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, లేబర్ కార్డ్, పాస్ పోర్ట్, దివ్యాంగుల గుర్తింపు కార్డు వంటి వాటిలో ఏదైనా చూపించి ఓటు వెయవచ్చు.

News May 13, 2024

598 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల: ఎస్పీలు

image

నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చందన దీప్తి వెల్లడించారు. 349 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వాటిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. సూర్యాపేట జిల్లాలో 229 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, అక్కడ సజావుగా ఎన్నికలు జరిగేందుకు తగిన చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వెంకట్రావ్ తెలిపారు. 

News May 13, 2024

హైదరాబాద్‌ పరువు తీయకండి.. ఇకనైనా ఓటేయండి!

image

ఏ ఎన్నికలైనా పోలింగ్ శాతంలో రాజధాని మాత్రం చివరిలో నిలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో HYDలో 44.84%, మల్కాజిగిరిలో 49.63%, సికింద్రాబాద్‌లో 46.50%, చేవెళ్లలో 53.25% నమోదు కావడం గమనార్హం. పోలింగ్ శాతం పెంచేలా EC అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ప్లే స్టోర్‌లో VOTER HELPLINE యాప్ తీసుకొచ్చారు. ఇప్పుడే డౌన్‌లోడ్ చేసి మీ పోలింగ్ బూత్‌‌ ఎక్కడుందో తెలుసుకోండి. HYD పరువు తీయకండి. ఇకనైనా ఓటేయండి.