Telangana

News May 13, 2024

HYD: ఓటేద్దాం.. ప్రశ్నిద్దాం..!

image

ఓటు వేయని వారికి ప్రశ్నించే హక్కు లేదని నానుడి. మనల్ని పాలించే వారిని మనమే ఎన్నుకునేందుకు నేడు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు. HYD ఎంపీ స్థానంలో 2019లో 44.84 శాతం పోలింగ్ నమోదవగా మల్కాజిగిరిలో 49.63, సికింద్రాబాద్‌లో 46.50, చేవెళ్లలో 53.25 శాతం నమోదైంది. ఈసారి గతం కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారులు కోరారు.

News May 13, 2024

KNR: ఓటేద్దాం.. ప్రశ్నిద్దాం..!

image

ఓటు వేయని వారికి ప్రశ్నించే హక్కు లేదని నానుడి. మనల్ని పాలించే వారిని మనమే ఎన్నుకునేందుకు నేడు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు. KNR ఎంపీ స్థానంలో 2019లో 69.52 శాతం పోలింగ్ నమోదవగా పెద్దపల్లిలో 65.59 శాతం నమోదైంది. ఈసారి గతం కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని అధికారులు కోరారు.

News May 13, 2024

ADB: ఓటేద్దాం.. ప్రశ్నిద్దాం..!

image

ఓటు వేయని వారికి ప్రశ్నించే హక్కు లేదని నానుడి. మనల్ని పాలించే వారిని మనమే ఎన్నుకునేందుకు నేడు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ ఎంపీ స్థానంలో 2019లో 71.42 శాతం పోలింగ్ నమోదవగా పెద్దపల్లి ఎంపీ స్థానంలో 65.59 శాతం నమోదైంది. ఈసారి గతం కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని అధికారులు కోరారు.

News May 13, 2024

కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు:కలెక్టర్

image

ఖమ్మం: లోక్ సభ సాధారణ ఎన్నికల పోలింగ్ పురస్కరించుకుని నూతన కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటుచేసినట్లు ఖమ్మం పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఆదివారం కంట్రోల్ రూం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. నియోజకవర్గ పరిధిలోని 7 సెగ్మెంట్లకు గాను 7 పెద్ద ఎల్ఈడి తెరలను ఏర్పాటుచేసి, వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తునట్లు తెలిపారు.

News May 13, 2024

కౌంటింగ్ గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

image

నల్గొండ పట్టణ సమీపంలోని
అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఉన్న గోదాములో పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపుకై ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చందన ఆదివారం తనిఖీ చేశారు. ఓట్ల లెక్కింపు కు ఏర్పాటు చేసే టేబుళ్లు,బ్యారీకేడింగ్, ఏజెంట్లు బ్యారేడింగ్, భద్రత, తదితరాలను పరిశీలించారు. ఓట్ల లెక్కింపుకు రెండు రోజుల ముందు అధికారులకు ఇక్కడ బస ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

News May 13, 2024

NZB: ఓటేద్దాం.. ప్రశ్నిద్దాం..!

image

ఓటు వేయని వారికి ప్రశ్నించే హక్కు లేదని నానుడి. మనల్ని పాలించే వారిని మనమే ఎన్నుకునేందుకు నేడు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు. నిజామాబాద్ ఎంపీ స్థానంలో 2019లో 68.44 శాతం పోలింగ్ నమోదవగా జహీరాబాద్ నియోజకవర్గంలో 69.70 శాతం నమోదైంది. ఈసారి గతం కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని అధికారులు కోరారు.

News May 12, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లా TOP NEWS

image

➤KNR: MP ఎన్నికలు.. భారీ బందోబస్తు
➤అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
➤ధర్మపురి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు
➤UAEలో KNR జిల్లా యువకుడి మృతి
➤రామగుండం: ఎన్నికల విధులకు NCC క్యాడెట్లు
➤ఇష్టానుసారంగా పోస్టులు పెడితే చర్యలు: CP
➤శంకరపట్నంలో వడదెబ్బతో మహిళ మృతి

News May 12, 2024

పిడుగుపాటుతో తాత, మనుమడు మృతి.. కలెక్టర్ రాహుల్‌రాజ్ దిగ్భ్రాంతి

image

మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం రామోజీపల్లి గ్రామంలో పిడుగుపాటుతో తాత, మనుమడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటనపై కలెక్టర్ రాహుల్ రాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వర్షం కురువడంతో వరి ధాన్యంపై కవర్ కప్పేందుకు వెళ్లిన శ్రీరాములు(43), శివరాజ్(విశాల్)(13) పిడుగుపాటుతో చనిపోయిన విషయం తెలిసిందే. కాగా రైతు కుటుంబానికి ప్రభుత్వం తరఫున రావాల్సిన సాయాన్ని ఈసీ నిబంధనల మేరకు త్వరలో అందిస్తామని చెప్పారు.

News May 12, 2024

ఆసిఫాబాద్: పోలింగ్ కేంద్రానికి వెళ్తున్న పోలీస్ వాహనం బోల్తా

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు వెళ్తున్న పోలీస్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. వివరాల్లోకి వెళితే.. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం దడ్పూర్ గ్రామం పోలింగ్ కేంద్రానికి వెళుతున్న పోలీస్ వాహనం ఈదురు గాలులకు అదుపుతప్పి బోల్తా పడింది. పలువురు పోలీస్ సిబ్బందికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 12, 2024

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ఓటేయనున్న సినీ సెలబ్రిటీలు

image

రేపు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిధిలో పలువురు సినీ సెలబ్రిటీలు ఓటు వేయనున్నారు. షేక్‌పేట్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో రాజమౌళి దంపతులు, గచ్చిబౌలిలో హీరో నాని, ఫిలింనగర్‌లోని ఫిలిం ఛాంబర్ పక్కన గల FMCCలో రాఘవేంద్ర, విశ్వక్‌సేన్, రానా, సురేశ్ బాబు, న్యూ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో రవితేజ సహా పలువురు ప్రముఖులు ఓటేయనున్నారు.