Telangana

News May 12, 2024

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ఓటేయనున్న సినీ సెలబ్రిటీలు

image

రేపు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిధిలో పలువురు సినీ సెలబ్రిటీలు ఓటు వేయనున్నారు. షేక్‌పేట్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో రాజమౌళి దంపతులు, గచ్చిబౌలిలో హీరో నాని, ఫిలింనగర్‌లోని ఫిలిం ఛాంబర్ పక్కన గల FMCCలో రాఘవేంద్ర, విశ్వక్‌సేన్, రానా, సురేశ్ బాబు, న్యూ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో రవితేజ సహా పలువురు ప్రముఖులు ఓటేయనున్నారు. 

News May 12, 2024

HYD: రూ.23,84,36,012 నగదు సీజ్

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా HYDలో ఇప్పటివరకు రూ.23,84,36,012 నగదు, రూ.26,03,12,917 విలువ గల ఇతర వస్తువులు, 27,715.965 లీటర్ల మద్యాన్ని పట్టుకుని సీజ్ చేసినట్లు HYD ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. అక్రమ మద్యం అరికట్టడంలో భాగంగా 354 మందిపై కేసులు నమోదు చేసి 356 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

WGL: ప్రలోభ పెట్టే అంశాలపై ఫిర్యాదు చేయొచ్చు

image

కేంద్ర ఎన్నికల సంఘం తెచ్చిన సీ-విజిల్ మొబైల్ యాప్‌లో ఓటర్లను ప్రలోభ పెట్టే అంశాలపై ఫిర్యాదు చేయొచ్చని, వీడియోలు, ఫొటోలతో యాప్‌లో ఫిర్యాదు ఇస్తే 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు తెలిపారు. తనిఖీ బృందాలు, ఎన్నికల పరిశీలకులు, ఇతర నిఘా బృందాలు నిరంతరం ఫిర్యాదులను పర్యవేక్షిస్తుంటాయి. అనధికార ప్రచారాలు, ఓటర్లను భయపెట్టడం, దాడులపై ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.

News May 12, 2024

BREAKING: HYDలో స్టూడెంట్ SUICIDE

image

HYD ఘట్‌కేసర్ PS పరిధి ఘనపూర్‌లో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఒకేషనల్ కోర్సు అయిన MPHWలో మార్కులు తక్కువ వచ్చాయని మానసిక వేదనతో కాసర్ల స్వప్న‌(20) అనే విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్వప్న తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో ఆమె తండ్రి సతీశ్ 2009లో ఘనపూర్‌లోని హ్యాపీ ఆర్ఫన్ హోంలో చేర్పించాడు. 1000కి 700 మార్కులే వచ్చాయని ఆమె సూసైడ్ చేసుకుంది. కేసు నమోదైంది.

ASF: పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సు.. వాగులోకి..!

image

అసిఫాబాద్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కెరమెరి మండలం కరంజివాడ వద్ద పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లింది. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సు వాగులోకి పూర్తిగా వెళ్లకుండా బస్సును ఆపాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. పోలింగ్ సిబ్బంది బస్సు దిగి కాలినడకన కరంజివాడ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు.

News May 12, 2024

పిడుగుపాటుతో తాత, మనుమడు మృతి.. కలెక్టర్ రాహుల్ రాజ్ దిగ్బ్రాంతి

image

మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం రామోజీపల్లి గ్రామంలో పిడుగుపాటుతో తాత, మనుమడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటనపై కలెక్టర్ రాహుల్ రాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వర్షం కురువడంతో వరి ధాన్యంపై కవర్ కప్పేందుకు వెళ్లిన శ్రీరాములు(43), శివరాజ్(విశాల్)(13) పిడుగుపాటుతో చనిపోయిన విషయం తెలిసిందే. కాగా రైతు కుటుంబానికి ప్రభుత్వం తరఫున రావాల్సిన అన్ని సహాయక సహకారాలను త్వరలో అందిస్తామని చెప్పారు.

News May 12, 2024

NGKL: సోషల్ మీడియాలో రాజకీయ ప్రస్తావన వద్దు: ఎస్పీ గైక్వాడ్

image

ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తూ సామాజిక మాధ్యమాల్లో రాజకీయానికి సంబంధించిన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియా గ్రూపుల్లో రాజకీయానికి సంబంధించిన విద్వేషపూరితంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికలు పూర్తయ్యేంతవరకు రాజకీయ ప్రస్తావన పోస్టులు పెట్టొద్దని సూచించారు.

News May 12, 2024

KMR: భార్య పుట్టింటికి వెళ్లిందని ఆత్మహత్యాయత్నం.. కాపాడిన కానిస్టేబుల్

image

భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రావడం లేదని భర్త వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రామారెడ్డిలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన కట్ట బాబు అతని భార్య పుట్టింటికి వెళ్ళి తిరిగి రావడం లేదనీ మనస్తాపం చెంది, మద్యం సేవించి వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా.. అది చూసిన కానిస్టేబుల్ రంజిత్ ట్యాంక్ పైకి ఎక్కి అతనిని కాపాడాడు.