Telangana

News April 5, 2025

HYD: ఆ బస్సుల్లోనూ మహిళలకు FREE..!

image

HYDలో అనేక ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ బస్సుల కంటే ఎలక్ట్రిక్ బస్సులు లగ్జరీగా ఉండడంతో కొందరు ప్రయాణికులు వాటిలో మహిళలకు ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకం వర్తించదనే అపోహ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ఎలక్ట్రిక్ బస్సులపై మహాలక్ష్మి FREE పథకం వర్తిస్తుందని స్టిక్కర్లు అంటించారు.

News April 5, 2025

HYD: ఆ బస్సుల్లోనూ మహిళలకు FREE..!

image

HYDలో అనేక ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ బస్సుల కంటే ఎలక్ట్రిక్ బస్సులు లగ్జరీగా ఉండడంతో కొందరు ప్రయాణికులు వాటిలో మహిళలకు ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకం వర్తించదనే అపోహ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ఎలక్ట్రిక్ బస్సులపై మహాలక్ష్మి FREE పథకం వర్తిస్తుందని స్టిక్కర్లు అంటించారు.

News April 5, 2025

గ్రూప్-1లో మెరిసిన గంగాధర ఎస్ఐ

image

కరీంనగర్ జిల్లా గంగాధర మండల పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న వంశీ కృష్ణ టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో 390వ ర్యాంక్ సాధించాడు. ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే గ్రూప్-1 పరీక్ష రాయగా మెరుగైన ర్యాంక్ సాధించాడు. దీంతో ఆయనకు మండల ప్రజలు పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.

News April 5, 2025

మధిర: రైలు నుంచి జారిపడి వ్యక్తి దుర్మరణం

image

గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. మధిర-తొండల గోపురం రైల్వేస్టేషన్ మధ్య గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి ఏపీలోని పల్నాడు జిల్లా గురజాలకు చెందిన గడ్డం మహేశ్వరరావు మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

News April 5, 2025

కరీంనగర్ స్మార్ట్ సిటీ పెండింగ్ పనులపై సమీక్ష

image

కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధిలో భాగంగా శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, ఆర్వీ కన్సల్టెన్సీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్మార్ట్ సిటీ లిమిటెడ్‌లో అభివృద్ధి పనులపై చర్చించి వేగంగా పూర్తి చేయాలని తెలిపారు.

News April 5, 2025

మెదక్: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

జాతీయ రహదారిపై స్కూటీని లారీ ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన రామాయంపేట మండలంలో జరిగింది. ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు.. దేవునిపల్లి గ్రామానికి చెందిన సాకేత్ (19) గురువారం రాత్రి తన స్నేహితులతో కలిసి స్కూటీపై వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో సాకేత్ అక్కడికక్కడే మృతి చెందాడు. శుక్రవారం బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 5, 2025

మహబూబ్‌నగర్: BJP నాయకులపై కేసు నమోదు

image

పాఠశాల తరగతులు జరుగుతున్న సమయంలో విధులకు ఆటంకం కలిగించిన BJP నాయకులపై కేసు నమోదు చేసిన ఘటన శుక్రవారం MBNR జిల్లా చిన్నచింతకుంటలో చోటుచేసుకుంది. ఎస్ఐ రామ్‌లాల్ నాయక్ తెలిపిన వివరాలు.. ఉన్నత పాఠశాలలో తరగతులు జరుగుతున్న సమయంలో BJP నాయకులు రమేశ్, శివ మరికొందరు కార్యకర్తలు HM అనుమతి లేకుండా పాఠశాలను విడిపించి విద్యార్థులను తీసుకొని CM దిష్టిబొమ్మ దహనం చేశారని HM మాధవి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.

News April 5, 2025

గంజాయిని, మాదకద్రవ్యాలను రూపమాపాలి: ADB SP

image

జిల్లా వ్యాప్తంగా గంజాయిని, మాదకద్రవ్యాలను రూపుమాపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. దాబాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించరాదన్నారు. శుక్రవారం ADBలోని AR హెడ్ క్వార్టర్స్‌లో ఉట్నూర్ సబ్ డివిజనల్ పోలీసు సిబ్బందితో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీటు దాఖలు చేయాలన్నారు. ఏఎస్పీ కాజల్ సింగ్ తదితరులున్నారు.

News April 5, 2025

మెదక్: చనిపోయిన జింకకు పోస్టుమార్టం.. అంత్యక్రియలు పూర్తి

image

రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామ శివారులో ఊరి కుక్కల దాడిలో జింక మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వెటర్నరీ డాక్టర్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా రామాయంపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్ మాట్లాడుతూ.. కుక్కల దాడిలోనే జింక మృతి చెందిందని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశామని పేర్కొన్నారు.

News April 5, 2025

మత్తు పదర్థాలు, గంజాయి రూపుమాపాలి: ఎస్పీ

image

మాదక ద్రవ్యాలు, మత్తు పదర్థాలు, గంజాయిని పూర్తి స్థాయిలో రూపుమాపాల్సిన అవసరం ఉందని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాదకద్రవ్యాలకు విద్యార్థులు, ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు వైపు ముందుకు సాగాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.హుస్సేన్ పాల్గొన్నారు.