Telangana

News May 12, 2024

ASF: పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సు.. వాగులోకి..!

image

అసిఫాబాద్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కెరమెరి మండలం కరంజివాడ వద్ద పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లింది. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సు వాగులోకి పూర్తిగా వెళ్లకుండా బస్సును ఆపాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. పోలింగ్ సిబ్బంది బస్సు దిగి కాలినడకన కరంజివాడ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు.

News May 12, 2024

పిడుగుపాటుతో తాత, మనుమడు మృతి.. కలెక్టర్ రాహుల్ రాజ్ దిగ్బ్రాంతి

image

మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం రామోజీపల్లి గ్రామంలో పిడుగుపాటుతో తాత, మనుమడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటనపై కలెక్టర్ రాహుల్ రాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వర్షం కురువడంతో వరి ధాన్యంపై కవర్ కప్పేందుకు వెళ్లిన శ్రీరాములు(43), శివరాజ్(విశాల్)(13) పిడుగుపాటుతో చనిపోయిన విషయం తెలిసిందే. కాగా రైతు కుటుంబానికి ప్రభుత్వం తరఫున రావాల్సిన అన్ని సహాయక సహకారాలను త్వరలో అందిస్తామని చెప్పారు.

News May 12, 2024

NGKL: సోషల్ మీడియాలో రాజకీయ ప్రస్తావన వద్దు: ఎస్పీ గైక్వాడ్

image

ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తూ సామాజిక మాధ్యమాల్లో రాజకీయానికి సంబంధించిన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియా గ్రూపుల్లో రాజకీయానికి సంబంధించిన విద్వేషపూరితంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికలు పూర్తయ్యేంతవరకు రాజకీయ ప్రస్తావన పోస్టులు పెట్టొద్దని సూచించారు.

News May 12, 2024

KMR: భార్య పుట్టింటికి వెళ్లిందని ఆత్మహత్యాయత్నం.. కాపాడిన కానిస్టేబుల్

image

భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రావడం లేదని భర్త వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రామారెడ్డిలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన కట్ట బాబు అతని భార్య పుట్టింటికి వెళ్ళి తిరిగి రావడం లేదనీ మనస్తాపం చెంది, మద్యం సేవించి వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా.. అది చూసిన కానిస్టేబుల్ రంజిత్ ట్యాంక్ పైకి ఎక్కి అతనిని కాపాడాడు.

News May 12, 2024

ఎన్నికల విధులు.. గుండెపోటుతో సిబ్బంది మృతి

image

ఎన్నికల విధులు నిర్వర్తిస్తుండగా గుండెపోటుతో వలిగొండ వాసి మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. మండల పరిధిలోని పహిల్వాన్ పురంకి చెందిన బొడ్డుపల్లి నరసింహ హైదరాబాద్‌లోని చంపాపేట్‌లో మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సాయంత్రం ఎన్నికల విధుల్లో ఉండగా గుండె నొప్పితో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

News May 12, 2024

మాదాపూర్ శిల్పారామంలో అలరించిన భరతనాట్య ప్రదర్శన

image

HYD మాదాపూర్‌ శిల్పారామంలో ఆదివారం కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు అలరించాయి. చెన్నై నుంచి వచ్చిన భరతనాట్య కళాకారిణి రక్షా దేవనాథన్‌ నట్టైకురంజి రాగం వర్ణం, జయదేవ అష్టపది అంశాలను ప్రదర్శించి మెప్పించారు. కూచిపూడి నటి గురువు చూడామణి తన శిష్య బృందంతో మూషిక వాహన, పలుకే బంగారమయే, మాతృ దినోత్సవం సందర్బంగా ‘అమ్మ’ నృత్య రూపకాన్ని ప్రదర్శించారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓటు వేయనున్న ప్రముఖులు

image

ఉమ్మడి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రేపు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సిద్దిపేట రూరల్ మండలం చింతమడకలో ఉదయం 11 గంటలకు మాజీ సీఎం కేసీఆర్ ఓటు వేయనున్నారు. అలాగే సంగారెడ్డి జిల్లా జోగిపేటలో మంత్రి దామోదర రాజనర్సింహ, సంగారెడ్డిలో జగ్గారెడ్డి, సిద్దిపేట భరత్ నగర్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు, దుబ్బాక మండలం పోతారంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

News May 12, 2024

HYD: ఓటర్ స్లిప్ ఎక్కడ.. అసంతృప్తిలో ఓటర్లు..!

image

HYD, RR, MDCL, VKB జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఓటర్లకు ఇప్పటికీ ఓటర్ స్లిప్పులు అందలేదు. ముఖ్యంగా ఉప్పల్, చార్మినార్, ఖైరతాబాద్, జవహర్‌నగర్ తదితర ప్రాంతాల్లోని ఓటర్లు తమకు ఓటర్ స్లిప్పులు ఇవ్వలేదని పేర్కొన్నారు. రేపు ఓటింగ్ ఉన్న నేపథ్యంలో, ఇప్పటి వరకు ఓటర్ స్లిప్పులు అందకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటింటికి వచ్చి అందిస్తామని చెప్పిన అధికారులపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.