Telangana

News May 12, 2024

పోలింగ్ ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ రవినాయక్

image

మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సోమవారం జరగనున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రవినాయక్ తెలిపారు. ఆదివారం డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఈవీఎం, పోలింగ్ సామాగ్రి పంపిణీ ఏర్పాట్లను ఎస్పీ హర్షవర్ధన్, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్‌తో కలిసి పరిశీలించారు. MBNR పార్లమెంట్ పరిధిలో 1916 పోలింగ్ కేంద్రాలు, 21 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

News May 12, 2024

బొంరస్‌పేట్: గుండెపోటుతో జర్నలిస్ట్ మృతి

image

కొడంగల్ నియోజకవర్గం బొంరస్‌పేట్ మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఉప్పరి వెంకటయ్య గుండెపోటుతో మృతి చెందాడు. 30 ఏళ్లుగా ఓ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్న వెంకటయ్య మరణం పత్రికా రంగానికి తీరని లోటుని టియుడబ్ల్యుజే(ఐజేయు) సంఘం రాష్ట్ర నాయకులు శ్రీకిషన్ రావు అన్నారు. వెంకటయ్య మృతి బాధాకరమని, మీడియా రంగంలో ఆయన లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు.

News May 12, 2024

ఎన్నికల విధులకు గైర్హాజరైన 48 మందిపై కేసులు నమోదు:SP

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేవరకొండ నియోజకవర్గంలో ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల విధులకు గైర్హాజరైన 48 మందిపైన ఆర్పీ ఆక్ట్ యు/ఎస్ 134 క్రింద కేసులు నమోదు అయినట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రోసెడింగ్ అధికారులు 48 మంది రిపోర్టు చేయాల్సి ఉండగా ఇంతవరకు రిపోర్ట్ చేయలేదు. దీంతో వారిపై చర్యలకు ఉపక్రమించారు.

News May 12, 2024

ఎన్నికల సామగ్రి తరలింపులో అజాగ్రత వద్దు:కలెక్టర్‌

image

ఎన్నికల్లో పోలింగ్‌కు అవసరమైన సామగ్రి తరలింపులో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పక్కాగా విధులు నిర్వహించాలని ఎన్నికల అధికారులు, సిబ్బందికి కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ సూచించారు. ఆదివారం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను, స్ట్రాంగ్‌ రూమ్‌ను‌ పరిశీలించారు. ఈవీఎంల తరలింపు, తదితర అంశాలపై ఆరా తీశారు.

News May 12, 2024

మెదక్: ఓటు వేయాలంటే గుర్తింపు కార్డు తీసుకెళ్లాల్సిందే..!

image

పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నందున ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లేటప్పుడు ఓటర్ స్లిప్పుతో పాటు కచ్చితంగా ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు. ఓటర్ ఐడి, ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, జాబ్ కార్డ్, ఉపాధి హామీ కార్డ్, పాస్ పోర్ట్, బ్యాంకు, పాస్ బుక్ తో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచిస్తున్నారు.

News May 12, 2024

KNR: ప్రలోభ పెట్టే అంశాలపై ఫిర్యాదు చేయొచ్చు

image

కేంద్ర ఎన్నికల సంఘం తెచ్చిన సీ-విజిల్ మొబైల్ యాప్‌లో ఓటర్లను ప్రలోభ పెట్టే అంశాలపై ఫిర్యాదు చేయొచ్చని, వీడియోలు, ఫొటోలతో యాప్‌లో ఫిర్యాదు ఇస్తే 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు తెలిపారు. తనిఖీ బృందాలు, ఎన్నికల పరిశీలకులు, ఇతర నిఘా బృందాలు నిరంతరం ఫిర్యాదులను పర్యవేక్షిస్తుంటాయి. అనధికార ప్రచారాలు, ఓటర్లను భయపెట్టడం, దాడులపై ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.

News May 12, 2024

MHBD: జిల్లాలో పోలీసులు సీజ్ చేసిన ఐటమ్స్ ఇవే..!

image

పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి నేటివరకు మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఎలాంటి పత్రాలు లేని రూ.870,840 నగదును పట్టుకుని సీజ్ చేసినట్లు జిల్లా SP సుధీర్ రామ్నాథ్ కెనాన్ తెలిపారు. అలాగే రూ.91,18,107 విలువచేసే మద్యాన్ని సీజ్ చేశామని, రూ.11,04,150ల విలువ చేసే గంజాయిని సైతం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలో వివిధ వ్యక్తులు 18 తుపాకులను డిపాజిట్ చేశారన్నారు.

News May 12, 2024

కరీంనగర్: EVMలను భద్రంగా తీసుకెళ్లాలి: జిల్లా కలెక్టర్

image

సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను భద్రంగా తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ఆదివారం కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాలకు సంబంధించి, మానకొండూర్‌కు సంబంధించి కరీంనగర్లోని పాలిటెక్నిక్ కళాశాలలో ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు బాధ్యతయుతంగా పనిచేయాలని అధికారులకు చెప్పారు.

News May 12, 2024

HYD: అందరూ ఓటేయాలంటూ వినూత్నంగా అవగాహన

image

ప్రజలకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఓటు. దానిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మేడ్చల్ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త తారక్ HYDలోని ప్రధాన మార్గాలు, గల్లీగల్లీ తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 250 కిలోమీటర్లు తన ద్విచక్ర వాహనంపై తిరుగుతూ తన భుజానికి వేసుకున్న బ్యాగ్ పై Vote is Voice #IVOTEFORSURE అని ఓ స్టిక్కర్ అతికించుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు.

News May 12, 2024

HYD: అందరూ ఓటేయాలంటూ వినూత్నంగా అవగాహన

image

ప్రజలకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఓటు. దానిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మేడ్చల్ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త తారక్ HYDలోని ప్రధాన మార్గాలు, గల్లీగల్లీ తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 250 కిలోమీటర్లు తన ద్విచక్ర వాహనంపై తిరుగుతూ తన భుజానికి వేసుకున్న బ్యాగ్ పై Vote is Voice #IVOTEFORSURE అని ఓ స్టిక్కర్ అతికించుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు.