Telangana

News May 12, 2024

HYD: అందరూ ఓటేయాలంటూ వినూత్నంగా అవగాహన

image

ప్రజలకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఓటు. దానిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మేడ్చల్ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త తారక్ HYDలోని ప్రధాన మార్గాలు, గల్లీగల్లీ తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 250 కిలోమీటర్లు తన ద్విచక్ర వాహనంపై తిరుగుతూ తన భుజానికి వేసుకున్న బ్యాగ్ పై Vote is Voice #IVOTEFORSURE అని ఓ స్టిక్కర్ అతికించుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు.

ఎంపీ ఎన్నికలు.. ఆకుపై ఓటు చిత్రం అదుర్స్

image

ఓటు వజ్రాయుధం, ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని నారాయణఖేడ్‌కు చెందిన ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్ అన్నారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో అశ్వత్థ పత్రంపై ఓటు సింబల్ గీసి గిశారు. రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని, మన ఓటుతో సుస్థిర, సమర్థవంతమైన భారత దేశాన్ని నిర్మిద్దామని ఆర్టిస్ట్ ఆకాంక్షించారు. ‘మై ఓటు ఈస్ మై ఫ్యూచర్, పవర్ అఫ్ వన్’ ఓటు అని అన్నారు.

News May 12, 2024

మహబూబ్‌నగర్: మరవద్దు.. రేపే పోలింగ్ !

image

దేశానికి సంబంధించి అత్యున్నత ఎన్నికలివి. ఇప్పటికే వృద్ధులు, వికలాంగులు మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం పరిధిలో 296 మంది, నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి 228 మంది ఓటేశారు. ఇంకా చాలామంది వృద్ధులు పోలింగ్ కేంద్రానికి రావడానికి సిద్ధం అవుతున్నారని, మన రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో (MBNR, NGKL) పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికం. రేపు జరిగే ఎన్నికల్లో ఓటు వేయడం మరువద్దని అధికారులు పిలుపునిచ్చారు.

News May 12, 2024

HYD: అభిమాన నేత కోసం నాలుక కోసుకున్నాడు..!

image

HYD బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద ఈరోజు ప.గో. జిల్లాకు చెందిన చెవల మహేశ్ తన నాలుక కోసుకున్నాడు. ఏపీలో తన అభిమాన నేత సీఎం కావాలని నాలుక కోసుకుని మొక్కు తీర్చుకున్నానని ఆయన ఓ లెటర్‌లో రాశారు. కాగా గతంలోనూ రెండు సార్లు తాను ఇలాగే నాలుక కోసుకున్నట్లు లెటర్‌లో పేర్కొన్నారు. పోలీసులు వచ్చి ఆయన్ను స్థానికంగా ఉన్న అపోలో ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.  

ఎన్నికల విధులకు డుమ్మా కొట్టిన వారిపై కేసులు

image

నల్గొండ : ఎన్నికల విధులకు గైర్హాజరైన వారిపై కేసులు నమోదు చేయాలని నల్గొండ కలెక్టర్ హరిచందన ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులపై ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 కింద కేసు బుక్ చేయాలని సూచించారు. పోలింగ్ విధులకు రిపోర్ట్ చేయని పీవో, ఏపీవో, ఇతర పోలింగ్ సిబ్బందిపై చర్యలకు ఆదేశించారు.

News May 12, 2024

మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం.. పిడుగుపాటుతో ఇద్దరు మృతి

image

మెదక్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెద్ద శంకరంపేట మండలం రామోజీపల్లి శివారులో ధాన్యం కుప్పల వద్ద పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు. మృతులు పాలంచ శ్రీ రాములు, విశాల్‌గా గుర్తించారు. మధ్యాహ్నం వరకు ఎండ ఉండగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఒక్కసారి వాతావరణ మారి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగు పడింది. దీంతో ఆ ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. దీంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది.

News May 12, 2024

 KMM: అస్వస్థతకు గురైన పోలింగ్ సిబ్బంది 

image

వెంకటాపురం మండలం‌లోని ఎన్నికల డిస్ట్రిబ్యూటర్ కేంద్రంలో విధి నిర్వహణలో ఉన్న పోలింగ్ సిబ్బంది ఒకరు హఠాత్తుగా అస్వస్థతకు గురై కింద పడిపోయారు. మండల విద్యాశాఖ రికార్డు అసిస్టెంట్ జంగిటి స్వామి ఎన్నికల సామగ్రి తీసుకొని పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అస్వస్థతకు గురయ్యారు. గమనించిన తోటి సిబ్బంది ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. 

News May 12, 2024

HYD: రేపు జూబ్లీహిల్స్‌లో ఓటేయనున్న సినీ ప్రముఖులు

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు రేపు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. HYD జూబ్లీహిల్స్ క్లబ్‌లో చిరంజీవి కుటుంబ సభ్యులు ఓటేయనుండగా ఓబుల్ రెడ్డి స్కూల్‌లో జూనియర్ NTR, ప్రణతి, BSNL సెంటర్‌లో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ఓటేయనున్నారు. ఇక జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో మహేశ్ బాబు, నమ్రత, మోహన్ బాబు, విష్ణు, మనోజ్, మంచు లక్ష్మి తదితరులు ఓటేయనున్నారు.