Telangana

News May 12, 2024

మహబూబ్‌నగర్: మరవద్దు.. రేపే పోలింగ్ !

image

దేశానికి సంబంధించి అత్యున్నత ఎన్నికలివి. ఇప్పటికే వృద్ధులు, వికలాంగులు మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం పరిధిలో 296 మంది, నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి 228 మంది ఓటేశారు. ఇంకా చాలామంది వృద్ధులు పోలింగ్ కేంద్రానికి రావడానికి సిద్ధం అవుతున్నారని, మన రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో (MBNR, NGKL) పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికం. రేపు జరిగే ఎన్నికల్లో ఓటు వేయడం మరువద్దని అధికారులు పిలుపునిచ్చారు.

News May 12, 2024

HYD: అభిమాన నేత కోసం నాలుక కోసుకున్నాడు..!

image

HYD బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద ఈరోజు ప.గో. జిల్లాకు చెందిన చెవల మహేశ్ తన నాలుక కోసుకున్నాడు. ఏపీలో తన అభిమాన నేత సీఎం కావాలని నాలుక కోసుకుని మొక్కు తీర్చుకున్నానని ఆయన ఓ లెటర్‌లో రాశారు. కాగా గతంలోనూ రెండు సార్లు తాను ఇలాగే నాలుక కోసుకున్నట్లు లెటర్‌లో పేర్కొన్నారు. పోలీసులు వచ్చి ఆయన్ను స్థానికంగా ఉన్న అపోలో ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.  

ఎన్నికల విధులకు డుమ్మా కొట్టిన వారిపై కేసులు

image

నల్గొండ : ఎన్నికల విధులకు గైర్హాజరైన వారిపై కేసులు నమోదు చేయాలని నల్గొండ కలెక్టర్ హరిచందన ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులపై ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 కింద కేసు బుక్ చేయాలని సూచించారు. పోలింగ్ విధులకు రిపోర్ట్ చేయని పీవో, ఏపీవో, ఇతర పోలింగ్ సిబ్బందిపై చర్యలకు ఆదేశించారు.

News May 12, 2024

మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం.. పిడుగుపాటుతో ఇద్దరు మృతి

image

మెదక్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెద్ద శంకరంపేట మండలం రామోజీపల్లి శివారులో ధాన్యం కుప్పల వద్ద పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు. మృతులు పాలంచ శ్రీ రాములు, విశాల్‌గా గుర్తించారు. మధ్యాహ్నం వరకు ఎండ ఉండగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఒక్కసారి వాతావరణ మారి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగు పడింది. దీంతో ఆ ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. దీంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది.

News May 12, 2024

 KMM: అస్వస్థతకు గురైన పోలింగ్ సిబ్బంది 

image

వెంకటాపురం మండలం‌లోని ఎన్నికల డిస్ట్రిబ్యూటర్ కేంద్రంలో విధి నిర్వహణలో ఉన్న పోలింగ్ సిబ్బంది ఒకరు హఠాత్తుగా అస్వస్థతకు గురై కింద పడిపోయారు. మండల విద్యాశాఖ రికార్డు అసిస్టెంట్ జంగిటి స్వామి ఎన్నికల సామగ్రి తీసుకొని పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అస్వస్థతకు గురయ్యారు. గమనించిన తోటి సిబ్బంది ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. 

News May 12, 2024

HYD: రేపు జూబ్లీహిల్స్‌లో ఓటేయనున్న సినీ ప్రముఖులు

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు రేపు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. HYD జూబ్లీహిల్స్ క్లబ్‌లో చిరంజీవి కుటుంబ సభ్యులు ఓటేయనుండగా ఓబుల్ రెడ్డి స్కూల్‌లో జూనియర్ NTR, ప్రణతి, BSNL సెంటర్‌లో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ఓటేయనున్నారు. ఇక జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో మహేశ్ బాబు, నమ్రత, మోహన్ బాబు, విష్ణు, మనోజ్, మంచు లక్ష్మి తదితరులు ఓటేయనున్నారు. 

ADB: ఎన్నికల విధుల్లో ఒకేచోట SI అన్నదమ్ములు

image

ఆదిలాబాద్ టీటీడీసీ కేంద్రంలో ఈవీఎం మిషన్ల పంపిణీ ఆదివారం చేపట్టారు. ఇందులో భాగంగా ఆయా మండల పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, సీఐలు విధి నిర్వహణలో భాగంగా అక్కడికి వచ్చారు. అయితే ఎన్నికల విధుల్లో ఇద్దరు ఎస్ఐలు పాల్గొనగా.. వారిద్దరూ అన్నదమ్ములు అవ్వడం విశేషం. మావల పోలీస్ స్టేషన్ SI విష్ణువర్ధన్, జైనథ్ పోలీస్ స్టేషన్ SI పురుషోత్తం ఇక్కడే విధులు నిర్వర్తించారు. 

News May 12, 2024

WGL: అమ్మను ఆదర్శంగా తీసుకొని.. ఓటు వేద్దాం

image

నవమాసాలు మోసి అమ్మ జన్మనిచ్చి నిన్ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఒక్క ఓటుతో ఉత్తమ నాయకుడిని ఎన్నుకొని బాధ్యత నెరవేర్చుకోలేమా..? తల్లి ప్రేమ వెలకట్టలేనిది, బాధ్యతగా జీవితమంతా వెంటే ఉంటోంది. మన ఓటుకూ వెలకట్టకపోతే వచ్చే ఐదేళ్లు మంచి పాలన అందుతోంది. అమ్మను ఆదర్శంగా తీసుకుందాం. ప్రేమ, బాధ్యతలోనూ. మన ఓరుగల్లు జిల్లాలో 33,56,832 మంది ఓటర్లున్నారు. -నేడు మాతృ దినోత్సవం. రేపే మన బాధ్యతను నెరవేర్చుకుందాం.