Telangana

News May 12, 2024

KNR: అమ్మను ఆదర్శంగా తీసుకొని.. ఓటు వేద్దాం

image

నవమాసాలు మోసి అమ్మ జన్మనిచ్చి నిన్ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఒక్క ఓటుతో ఉత్తమ నాయకుడిని ఎన్నుకొని బాధ్యత నెరవేర్చుకోలేమా..? తల్లి ప్రేమ వెలకట్టలేనిది, బాధ్యతగా జీవితమంతా వెంటే ఉంటోంది. మన ఓటుకూ వెలకట్టకపోతే వచ్చే ఐదేళ్లు మంచి పాలన అందుతోంది. అమ్మను ఆదర్శంగా తీసుకుందాం. ప్రేమలోనూ, బాధ్యతలోనూ. మన KNR జిల్లాలో 33,93,580 మంది ఓటర్లున్నారు. – నేడు మాతృ దినోత్సవం. రేపే మన బాధ్యతను నెరవేర్చుకుందాం.

News May 12, 2024

HYD: కేంద్రాలకు రండి.. ఓటేయండి: కలెక్టర్లు

image

HYD, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ఓటర్లందరూ రేపు ఓటేసేందుకు రావాలని HYD కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ గౌతమ్, రంగారెడ్డి కలెక్టర్ శశాంక, వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ఈసారి ఓటింగ్ శాతం పెంచేలా చర్యలు తీసుకున్నామని, అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. నిర్భయంగా వచ్చి ఓటేయాలని కోరారు. యువత చొరవ చూపి అందరూ ఓటేసేలా చూడాలన్నారు.

మహబూబ్‌నగర్: పదండి.. సగర్వంగా ఓటేద్దాం..!

image

ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల సంఘం ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. ఓటరు చైతన్యం కోసం వినూత్న ప్రచారం చేసిన ఈసీ రెండు రోజులుగా మెసేజ్‌లు పంపుతూ ఫోన్లు చేస్తోంది. ‘మీ ఓటు మీ స్వరం. పదండి.. ఈ ఎన్నికల్లో సగర్వంగా ఓటేద్దాం. దేశం కోసం మీ వంతు బాధ్యత మర్చిపోకండి. ఎన్నికల పర్వం.. దేశానికి గర్వం’. పనులుంటే వాయిదా వేసుకోండి. సాకులు చెప్పకుండా రేపు ఓటు వేయండి’ అంటూ సందేశానిస్తుంది.
-GO VOTE.

News May 12, 2024

ఓటు వేయడానికి గుర్తింపు కార్డు తప్పనిసరి

image

1.ఓటర్ ఐడి 2.పాస్ పోర్ట్ 3.డ్రైవింగ్ లైసెన్స్ 4.ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు గుర్తింపు కార్డులు 5.పోస్టాఫీసు పాస్ బుక్ 6.పాన్కార్డు 7.ఆర్టీజీ ఎన్పీఆర్ స్మార్ట్ కార్డు 8.మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి జాబ్ కార్డు 9.ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు10. ఫొటోతో కూడిన పింఛను పత్రం11. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అధికారిక గుర్తింపు కార్డులు 12.ఆధార్ కార్డు, వీటిలో ఏదైనా ఒకటి చూపించి మీరు ఓటు వేయవచ్చు.

News May 12, 2024

మహబూబ్‌నగర్: సగర్వంగా ఓటేద్దాం.!

image

ఓటింగ్ శాతాన్ని పెంచడానికి భారత ఎన్నికల సంఘం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు ఓటరు చైతన్యం కోసం వినూత్న కార్యక్రమాలు చేపట్టిన ఈసీ రెండ్రోజులుగా మెసేజ్‌లు పంపుతూ ఫోన్లు చేస్తోంది. ‘మీ ఓటు మీ స్వరం. ఈ ఎన్నికల్లో సగర్వంగా ఓటేద్దాం. ఎన్నికల పర్వం.. దేశానికి గర్వం’ అన్న సందేశాన్ని ఓటర్లకు చేరవేస్తోంది. పనులుంటే వాయిదా వేసుకోండి.. రేపు మాత్రం ఓటు వేయండి అంటూ పిలుపునిస్తోంది.
**GO VOTE.

News May 12, 2024

HYD: గత ఎన్నికల్లో స్వతంత్రులకు 5,173 ఓట్లు

image

హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 2019 పార్లమెంట్ ఎన్నికలలో స్వతంత్రులకు 5,173 ఓట్లు వచ్చాయి. నోటాకు మాత్రం 5,653 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. ముందస్తు ఎత్తుగడలతో వివిధ పార్టీల నేతలు స్వతంత్రులను బరిలోకి దింపుతున్నారు. స్వతంత్రులు, నోటాకు వచ్చిన ఓట్లు గెలుపోటములపై కీలకంగా మారుతున్నాయి.

News May 12, 2024

సికింద్రాబాద్: ప్రారంభమైన ఈవీఎంల పంపిణీ ప్రక్రియ: రోనాల్డ్ రోస్

image

పోలింగ్‌కు మరికొద్ది గంటల సమయమే ఉంది. దీంతో అధికారులు ఈవీఎంల పంపిణీ ప్రక్రియను మొదలుపెట్టారు. సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈవీఎంల పంపిణీ ప్రారంభమైంది. 2 పార్లమెంట్‌ సెగ్మెంట్ల పరిధిలోని పోలింగ్ బూత్‌లకు ఈవీఎంలను పంపిణీ చేయనున్నారు. సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్‌లో ఈవీఎంల పంపిణీని జీహేచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు. ఈవీఎంలు సాయంత్రం 4 వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటాయి.

News May 12, 2024

HYD: రాష్ట్రంలో ఈ ప్రాంతాల్లో పురుష ఓటర్లే అధికం!

image

రాష్ట్రంలోనే HYD, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి పార్లమెంటు స్థానాల్లో పురుష ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. ఈ ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో పురుషుల కన్నా మహిళ ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. ఎన్నికల అధికారులు టార్గెట్-80 శాతం పేరిట ప్రజల్లో అవగాహన కల్పించారు. అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.