Telangana

News May 12, 2024

కేసీఆర్ దేవరకొండ పర్యటన రద్దు

image

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేవరకొండ పర్యటన రద్దు అయినట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, నల్గొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రవీంద్ర కుమార్ తండ్రి కన్నిలాల్ నాయక్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఆదివారం రావాల్సి ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కేసీఆర్ పర్యటనకు అధికారులు అనుమతివ్వలేదు. దీంతో పర్యటన రద్దైంది. 

News May 12, 2024

NZB: ఎన్నికల్లో పసుపు బోర్డు ఎఫెక్ట్ ఉంటుందా..?

image

NZB పార్లమెంట్ స్థానంలో పసుపు బోర్డు MP అభ్యర్థుల ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. 2019 ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని 182 మంది MP ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసి చరిత్ర సృష్టించారు. కాగా ఈ ఏడు పసుపునకు దేశంలోనే రికార్డు ధర పలికింది. మరి ఈ ఎన్నికల్లో పసుపు బోర్డు ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటుందో చూద్దాం.

News May 12, 2024

HYD: RTC స్పెషల్ బస్సులపై ఛార్జీలు పెంపు!

image

HYD నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్న స్పెషల్ RTC బస్సుల్లో ప్రయాణానికి RTC ఛార్జీలు 1.25% పెంచినట్లు అధికారులు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బస్సుల్లో రద్దీ ఏర్పడింది. వన్ సైడ్ ట్రాఫిక్ అధికంగా ఉందని, తిరుగు ప్రయాణంలో బస్సులు ఖాళీగా వస్తున్నాయని అధికారులు తెలిపారు. ఉప్పల్-తొర్రూరు ఎక్స్‌ప్రెస్ సాధారణంగా రూ.220 కాగా.. స్పెషల్ బస్సులో రూ.250 తీసుకున్నట్లు ప్రయాణికులు తెలిపారు.

News May 12, 2024

కరీంనగర్‌లో ముగిసిన ప్రచారం.. గెలుపెవరిదో..!

image

గత నెల రోజుల నుంచి జరుగుతున్న లోక్ సభ ఎన్నికల ప్రచారం శనివారంతో ముగిసింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముఖ్య పార్టీల ఎంపీ అభ్యర్థులతో పాటు ఆ పార్టీల నేతలు జోరుగా ప్రచారం నిర్వహించారు. ఇక మిగిలింది ప్రజల నిర్ణయమే. కాగా.. కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి బోయినపల్లి వినోద్ కుమార్-BRS, వెలిచాల రాజేందర్ రావు-కాంగ్రెస్, బండి సంజయ్-BJP బరిలో ఉన్నారు. మరి గెలుపెవరిదో చూడాలి.

News May 12, 2024

పెద్దపల్లిలో ముగిసిన ప్రచారం.. గెలుపెవరిదో..!

image

గత నెల రోజుల నుంచి జరుగుతున్న లోక్ సభ ఎన్నికల ప్రచారం శనివారంతో ముగిసింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముఖ్య పార్టీల ఎంపీ అభ్యర్థులతో పాటు ఆ పార్టీల నేతలు జోరుగా ప్రచారం నిర్వహించారు. ఇక మిగిలింది ప్రజల నిర్ణయమే. కాగా.. పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి కొప్పుల ఈశ్వర్-BRS, గడ్డం వంశీ కృష్ణ-కాంగ్రెస్, గోమాస శ్రీనివాస్-BJP బరిలో ఉన్నారు. మరి గెలుపెవరిదో చూడాలి.

News May 12, 2024

HYD: RTC స్పెషల్ బస్సులపై చార్జీలు పెంపు!

image

HYD నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్న స్పెషల్ RTC బస్సుల్లో ప్రయాణానికి RTC ఛార్జీలు 1.25% పెంచినట్లు అధికారులు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బస్సుల్లో రద్దీ ఏర్పడింది. వన్ సైడ్ ట్రాఫిక్ అధికంగా ఉందని, తిరుగు ప్రయాణంలో బస్సులు ఖాళీగా వస్తున్నాయని అధికారులు తెలిపారు. ఉప్పల్-తొర్రూరు ఎక్స్‌ప్రెస్ సాధారణంగా రూ.220 కాగా.. స్పెషల్ బస్సులో రూ.250 తీసుకున్నట్లు ప్రయాణికులు తెలిపారు.

News May 12, 2024

కల్హేర్: దూడను చంపిన చిరుత

image

నాగధర్- సంజీవర్‌రావుపేట్ శివారులో పోలంలో దూడను చిరుత చంపేసింది. రైతు గోపాల్‌రెడ్డి వివరాలిలా.. గోపాల్‌రెడ్డి పొలంలో పశువులను మేపుతున్నారు. భోజనానికి ఇంటికి వెళ్లగా.. చిరుత దాడిచేసి దూడను చంపినట్లు తెలిపారు. ఈ విషయాన్ని అటవీశాఖ, పశువైద్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని నాగదర్ FBO శ్రీకాంత్ సందర్శించి, పంచనామా నిర్వహించారు.

News May 12, 2024

KTDM: ప్రచారం నుంచి వచ్చి ఉరేసుకుని సూసైడ్ 

image

అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ ఉరి వేసుకొని మృతి చెందిన ఘటన పాల్వంచ మండలంలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరకవాగు ఏరియాకు చెందిన మందలపు స్వాతి(38) శనివారం మధ్యాహ్నం వరకు ఓ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. మధ్యాహ్నం ఇంటికి వెళ్లిన తర్వాత ఉరి వేసుకొని మృతి చెందింది. స్వాతి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 12, 2024

ముగిసిన ప్రచారం.. శబ్దానికి విరామం

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం 6 గంటలకు తెరపడింది. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ కంటే 48 గంటల ముందే అన్ని పార్టీల వాళ్లు ప్రచారం ఆపేశాయి. రెండు నెలలుగా ప్రచార వాహనాలు, పాటలతో హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ప్రచార వాహనాలకు అంటించిన పార్టీ స్టిక్కర్లు, హోర్డింగులకు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు తొలగించేశారు.

News May 12, 2024

కరీంనగర్: ఎడారి దేశంలో యువకుడి మృతి

image

జీవనోపాధి కోసం ఎడారి దేశం వెళ్లిన యువకుడు మృతిచెందిన ఘటన భీమారం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మోత్కురావుపేట గ్రామానికి చెందిన గణేశ్(26) గత కొన్ని నెలల క్రితం అల్-ఎయిన్ (UAE)వెళ్ళాడు. అక్కడ ప్రమాదవశాత్తు మ్యాన్ హోల్లో పడి మృతి చెందాడు. రెండురోజుల క్రితం స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గణేశ్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.