Telangana

News May 12, 2024

HYD: ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు: సీపీ

image

శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. HYD నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, డబ్బు, మద్యం అక్రమ రవాణాను అడ్డుకుంటామన్నారు. ఇప్పటి వరకు రూ.2 కోట్లు స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారులకు అందించామని పేర్కొన్నారు.

News May 12, 2024

ఆదిలాబాద్: 1500 పోలీసులతో ఎన్నికల నిర్వహణ

image

పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల బందోబస్తులు దాదాపు 1100 జిల్లా పోలీసులు, 400 ఇతర శాఖలకు సంబంధించిన పోలీసులు, 27 సెక్షన్ల కేంద్రబలగాలు, 15 సెక్షన్ల స్పెషల్ పోలీసులు పాల్గొన్నట్లు తెలియజేశారు. మొత్తం 1500 సిబ్బంది ఉన్నరన్నారు.

News May 12, 2024

పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు :కలెక్టర్

image

ఖమ్మం: లోక్ సభ సాధారణ ఎన్నికలను పురస్కరించుకొని ఈనెల 13న పోలింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఖమ్మం పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ అన్నారు. శనివారం కలెక్టరేట్ లో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో కలిసి, ఎన్నికల ఏర్పాట్లు, సైలెన్స్ పీరియడ్ పై మీడియా, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల కమీషన్ పోలింగ్ సమయం ఒక గంట పొడిగించిందని తెలిపారు.

News May 12, 2024

పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: ఎస్పీ చందనా దీప్తి

image

NLG:ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు.జిల్లాలో శాంతి యుత వాతవారణంలో ఎన్నికలు నిర్వహించడానికి ఇద్దరు అడిషనల్ ఎస్పీలు,9 మంది డిస్పీలు,37 మంది సీఐలు,84 మంది యస్.ఐలతో కలిపి మొత్తం 3000 మంది సిబ్బంది, 7 కంపెనీల కేంద్ర బలగాలు ఏర్పాటు చేయడం జరిగింది.వీటితో పాటు 5 ప్లాటున్ల TSSP సిబ్బంది,పెట్రోలింగ్ పార్టీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News May 12, 2024

స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసేలా పకడ్బందీగా ఏర్పాట్లు

image

ఈ నెల 13 న జరిగే లోక సభ పోలింగ్ కు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేయుటకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని, ఓటర్లు వంద శాతం పోలింగ్ లో పాల్గొనాలని కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం విజ్ఞప్తి చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవటానికి వీలుగా 913 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 64 సమస్యాత్మక లొకేషన్లలో 183 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి గట్టి భద్రతా ఏర్పాటు చేశామన్నారు.

News May 12, 2024

HNK: రిసెప్షన్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

image

ఈనెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లోని ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తాపట్నాయక్ శనివారం సాయంత్రం పరిశీలించారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గపరిధిలో ఉన్న హనుమకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.

News May 12, 2024

KNR: ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేశాం: కలెక్టర్

image

పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేశామని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గాల వారీగా పోలింగ్ అధికారుల థర్డ్ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయినట్టు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు అమిత్ కటారియా, సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి పాల్గొన్నారు.

News May 11, 2024

ఇల్లంతకుంట మండల విద్యాధికారి సస్పెన్షన్.!

image

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల విద్యాధికారి (FAC ) బన్నాజీని సస్పెండ్ చేస్తూ వరంగల్ ఆర్జేడి కే.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఇల్లంతకుంట మండల ఎంపీపీ నుంచి బన్నాజీ సన్మానం పొందారు. ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ RJDకి తెలియజేసారు. ఎన్నికల నియమనిబంధనలు బన్నాజీ ఉల్లంఘించడంతో సస్పెండ్ చేసినట్టు RJD తెలిపారు.

News May 11, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కాటారం మండలంలో ఉరి వేసుకొని రైతు ఆత్మహత్య. @ సుల్తానాబాద్ మండలంలో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి. @ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ పై కేసు నమోదు. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముగిసిన ఎన్నికల ప్రచారం. @ పార్లమెంట్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: కరీంనగర్ సిపి. @ పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కరీంనగర్ కలెక్టర్.

News May 11, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈరోజు TOPNEWS

image

> జిల్లావ్యాప్తంగా ముగిసిన ఎన్నికల ప్రచారం
> ములుగు: అన్నం పెట్టలేదని సెల్ టవర్ ఎక్కిన యువకుడు
> జిల్లాలో సాయంత్రం నుంచి అమల్లోకి వచ్చిన 144 సెక్షన్
> ETNR: లారీ-బైకు ఢీ..యువతికి తీవ్రగాయాలు
> బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడోరోజు భద్రకాళి అమ్మవారికి విశేష పూజలు
> MHBD: బిల్డింగ్ పై నుండి పడి యువకుడికి గాయాలు
> WGL,KZP రైల్వేస్టేషన్లో ప్రయాణికుల రద్దీ
> ములుగు: పొలంలోకి దూసుకెళ్లిన ఆటో..పలువురికి గాయాలు