Telangana

News May 11, 2024

NLG: ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థులకు కీలక సూచన

image

MP ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థులందరూ వారి ఎన్నికల ఖర్చులకు సంబంధించిన లెక్కలన్నింటినీ తనిఖీ చేయించుకోవాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు కళ్యాణ్ కుమార్ దాస్ తెలిపారు. శనివారం ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల మూడో విడత తనిఖీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంకా ఎవరైనా అభ్యర్థులకు ఖర్చులకు సంబంధించి రిజిస్టర్లు, ఖర్చులు సంబంధించిన వివరాలు మిగిలిపోయినట్లయితే తనిఖీ చేయించుకోవాలన్నారు.

News May 11, 2024

HYD: ఓటేసిన వారికి ఆఫర్ అంటూ ఫ్లెక్సీ 

image

HYD కుత్బుల్లాపూర్ పరిధి సూరారంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, పోలింగ్ శాతాన్ని పెంచాలని కోరుతూ సామాజిక కార్యకర్త రవీందర్ ముదిరాజ్ శనివారం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మే 13న ఎన్నికల్లో ఓటు వేసిన వారు.. తమ షాప్‌కు వచ్చి వారి చేతికున్న సిరా గుర్తు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు చూపిస్తే కూరగాయలు 10 శాతం, జిరాక్స్ 25 శాతం తక్కువ ధరకు ఇస్తానని బ్యానర్ ఏర్పాటు చేశారు. 

కుంటాల మండలంలో గుర్తు తెలియని మృతదేహం

image

నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని కల్లూరు గ్రామ శివారులో గల పెట్రోల్ బంకు వెనకాల ఒక గుర్తు తెలియని మృతదేహనం లభ్యమైంది. సమాచారం అందుకున్న ఎస్సై రజనీకాంత్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడికి సుమారు 50 నుంచి 55 సం.ల వయసు ఉంటుందని, నల్లని ప్యాంటు, పసుపు రంగు షర్టు ధరించాడన్నారు. ఆచూకీ తెలిసిన వారు 8712659535,8712659534 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఎస్‌ఐ తెలిపారు.

News May 11, 2024

NZB: నడిరోడ్డుపై కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ

image

పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. పార్టీ సీనియర్ నేత మునిపల్లి సాయిరెడ్డికి ఇందల్వాయి మండల ప్రచార బాధ్యతలు అప్పగించగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి సూచనల మేరకు ఆయన శనివారం మండలంలోని తిర్మన్పల్లి గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో గౌరారం గ్రామానికి చెందిన సంతోష్‌తో గొడవ జరిగింది. మా ఇలాకాలో మీ పెత్తనం ఏంటని? సాయిరెడ్డిపై సంతోష్ నడిరోడ్డుపై గొడవకు దిగారు.

News May 11, 2024

HYD: రైల్వే పట్టాలు దాటేటప్పుడు జర జాగ్రత్త!

image

రైల్వే పట్టాలను దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలు పోతాయని పోలీసులు హెచ్చరించారు. ఈరోజు హైటెక్ సిటీ-హఫీజ్‌పేట్ మధ్యలో ఓ గుర్తుతెలియని వ్యక్తి(35) రైలు ఢీకొని మృతిచెందాడని రైల్వే హెడ్ కానిస్టేబుల్ బి.శ్రీనివాసులు తెలిపారు. ఉందానగర్-బుద్వేల్ లైన్‌లో మరో వ్యక్తి(25) ఇలాగే చనిపోయాడని హెడ్ కానిస్టేబుల్ చిమ్నా తెలిపారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

రైలు పట్టాల వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

నార్కట్పల్లి – చిట్యాల రైల్వే స్టేషన్ మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. నల్గొండ రైల్వే హెడ్ కానిస్టేబుల్ డి.రజిత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తుతెలియని రైలు నుంచి కిందపడి మృతి చెందినట్లుగా తెలిపారు. మృతుడి వయసు 35-40సంవత్సరాల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. మృతుడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News May 11, 2024

ఎన్నికలు బహిష్కరించిన అచ్యుతాపురం గ్రామస్థులు

image

దుమ్ముగూడెం: ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు అచ్చుతాపురం గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. లక్ష్మీనగరం గ్రామం నుండి అచ్చుతాపురానికి వెళ్లే జిల్లా పరిషత్ రోడ్డు ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదని అవేదన వ్యక్తం చేశారు. కల్వర్టు సైతం పూర్తిగా కుంగి రహదారి అధ్వానంగా మారిందని వాపోయారు. ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం సమర్పించినా పట్టించుకోలేదన్నారు.

News May 11, 2024

HYD: రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్

image

HYD బాచుపల్లిలో ఇటీవల గోడ కూలి మృతిచెందిన కూలీలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని జన్‌ సేవా సంఘ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌పీ సింగ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాచ్‌పల్లిలో ఈనెల 10న గోడ కూలి ఏడుగురు కార్మికులు మృతిచెందారని, పలువురు గాయపడ్డారని, వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.